Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

# Suryakiran #

Inspirational

4.0  

# Suryakiran #

Inspirational

రంగులే కావవి

రంగులే కావవి

1 min
29



జాతీయపతాకంలో కనిపించేవి

కేవలం రంగులే కావు .

దేశ సమగ్రతను ప్రతిబింబించ బూనిన భక్తుల

హృదయస్పందనలకు ప్రతీకలు .


మువ్వన్నెల జెండా ...

ముక్కచెక్కలై దిక్కుతోచని బానిసత్వంలో కూరుకున్న

భరతజాతిని రక్షింప వచ్చిన పాశుపతాస్త్రం .

మనిషియొక్క విలువను మహోన్నతంగా తెల్పిన

ఆ గోవిందుని ఉపదేశానికి ఒక రూపం .


మరిగేరక్తం నుంచి పుట్టిన మహాతల్లి శరం .

తరతరాలకు తలమానికమై

ప్రతిపౌరుని గుండెలో స్వేచ్ఛాప్రభాతానికి

ఊపిరులూదుతూ ఇళ్ళపై ఎగిరే వరం .


నీలివర్ణంలోని అశోకచక్రం

వికసించాలనే కాంక్షను రగిలించే గుర్తుగా .

రెపరెపలు కంటిరెప్పలను

తెరిపించి మున్ముందుకు నడిపించే సత్తాగా .


ఎన్నటికీ మారని గుణములవి .

కాపాడుతూనే ఉండును ప్రకాశించు రవి .

జనుల మనసులు మారిననూ

ఐకమత్యమనే బలమునకు అవే ఆమ్లజని !



Rate this content
Log in

Similar telugu poem from Inspirational