Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

'హరీ!'శతకపద్యములు

'హరీ!'శతకపద్యములు

1 min
1

'హరీ!'శతకపద్యములు 

21.

చంపకమాల.

ఘనతరమౌ *కశాయి* వయి కావగ నీభువనాళిఁ గుక్షిలో 

ననువుగ పేర్చియుంచి పరమాద్భుతమౌ శిశు రూపుదాల్చినన్

గనుగొని కొల్చిరా మునులు కాలముఁ ద్రిప్పెడి వాడవంచు నే

విని తరియించి మ్రొక్కితిని వీనుల విందుగ లీలలన్ హరీ!//

కశాయి =జలధి శయనుడు, విష్ణువు.

22.

ఉత్పలమాల.

అక్షరమైన తత్త్వముగ నంతట నిండిన విశ్వరూప!నీ

కుక్షిని లోకముల్ కుదురుకొన్నవి భద్రగతిన్ జరించుచున్

రక్షకుడంచు నిన్ బొగడి లావును బొందిరి దేవతాళి నీ

వీక్షణమే శుభంబిడుగ బ్రీతిగ గాంచుమ నా దెసన్ హరీ!//

Rate this content
Log in

Similar telugu poem from Classics