సీత
సీత
1 min
366
తనకోసం శివధనుస్సును ఎక్కుపెట్టిన నీలిమేఘశ్యాముని
తనమదిలోని అందాల రాకుమారుని రూపంలో ఎదురుగ నిలుచున్న అందాల రాముని రూపాన్ని కాంచి
ముగ్ధమోహన రూపవతి అయిన సీత
మనసులోని సంతోషపు అలజడిని దాచుకుంటూ
ప్రేమనిండిన నయనాలతో
ఆ మనోహరుని మెడలో
వరమాల వేయబోతూ నిండైన
ఆ మోహనరూపాన్ని చూచి తన అదృష్టానికి తానే అచ్చెరువొంది
ఎదలోని అనురాగఝరిని చూపులలో కురిపిస్తూ
మరొక్కసారి తనివితీరా ఆ అనంతాభిరాముని కాంచెను సీత