Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Krbabu Kommineni

Romance

4.9  

Krbabu Kommineni

Romance

జాగు

జాగు

1 min
408


ప౹౹

జాలి లేని ప్రేయసి ఆ జాగేలనో మరి నీకు

జాబిలి జారిపోక ముందే కనిపించు నాకు |2|

చ||

జాము రాతిరైన ఆనవాలే లేక ఆశొదలాల

గోముగా పిలిచినా పలుకవు నేనే కదలాల |2|

మందహాసం మరచి చంద్ర సాయం కోరానే

దరహాసంతో దరిచేరవా ఆ వెన్నెల తీరాన్నే|ప|

చ||

ఆనలన్ని చేసి ఆనవాయితీ మరచితివి కద

ఊసులన్ని ఊహలతోనేనింపి పండెనే ఎద |2|

కోరికలే కొత్త ఆశలతో చివురులే తొడిగాయి

తారకలే తహ తహగా ఎపుడని అడిగాయి |ప|

చ||

తొలి పలుకే తోరణమై తనువునెల్లా అల్లగా

మలి చూపులేక మదియే నీరసించే మెల్లగా |2|

వచ్చి వరద గోదారిల వలపించి గెలిపించు

నచ్చి నవపారిజాతంలా నను మురిపించు |ప|



Rate this content
Log in

Similar telugu poem from Romance