జ్ఞానదిపం
జ్ఞానదిపం
కనులముందు ప్రపంచాన్ని జ్ఞానదీపంతో చూడాలోయ్,
కలలలోకంలో విహారిస్తూ
కష్టాలను కొనితెచ్చుకోకోయ్,
బ్రతుకు విలువ తెలియచేయు దారులెంట నడవాలోయ్,
మాటల యుద్ధంతో
బంధాలను త్రేంచుకోకోయ్,
కొత్త ఆలోచనలతో
నూతన ఒరవడికి ఊపిరిపోయాలోయ్.
ఆక్రోశం అవివేకంతో చిరునవ్వును బలిపెట్టకోయ్,
గాయాల జ్ఞాపకాలు
అనుభవాల పాఠాలుగా మలుచుకొని సాగాలోయ్,
మాటలు చేతలు
నీతికి నిలబడితే
ఆలస్యమైనా విజయం నీదేనోయ్,
మృధు మధుర స్నేహాభావంతో
గౌరవాన్ని కాపాడుకోవాలోయ్,
జ్ఞానదీపకాంతులే
వేదనలు తరిమేసే సత్యభాగ్యములని తెలుసుకుంటే విజయం నీదేనోయ్.