జ్ఞాపకం
జ్ఞాపకం
పాతరేసిన జ్ఞాపకాలన్నీ
పదే పదే ప్రాణం పోసుకొని ప్రత్యక్షమై
పీడించే ప్రారబ్ధమైతే...
నా నుండి నేను పారిపోయా...!!
చితికిన గతాల బ్రతుకుగది గవాక్షాల చాటున
నాలో నేను బందీగా మారిపోయా!!
నిదురమాసిన నిశిరాత్రుల సహవాసంలో పుష్పించక నేలరాలిన ఆశలమొగ్గల్ని
ఆఘ్రూ నిస్తూ... పీడకలల పల్లకీయాత్రలో గతం సమాధుల్ని సందర్శించా....
నిస్తేజమైన నన్ను కాలం జ్ఞాపకాల పంజరం నుండి విసిరేసిన వేళ...
నిరాకార నిర్మల భావస్థితిని నే పొందినవేళ... మనిషినయ్యా!!!