కాలం
కాలం
కాలం అనే గురువు నేర్పు పాఠాలు నేర్చుకోవడం తప్పుకాదే
ప్రకృతి సోయగానికి మైమరచి నాట్యం నేర్చుకోవడం తప్పుకాదే
వెండి వెలుగులు వెన్నెల దీపమా వెలుగును పంచ రావుకదా
అమ్మ జోలపాట కమ్మదనం వినిపోవడం తప్పుకాదే
అందనంత ఎత్తు ఎదగడానికి ఆశయం ఒకటి చాలు కదా
గెలుపు బాటలో అలుపు లేకుండా నడుచుకోవడం తప్పుకాదే
మానవత్వం పరిమళించే రోజు వికాసం వెలుగు కదా
ఆపదలో ఉన్నవారిని కరుణతో ఆదుకోవడం తప్పుకాదే
తిరిగి రాని క్షణం కోసం ఎదురుచూస్తున్న ఫలితం శూన్యం కదా
బాధలు అన్నీ మరచి పోయి కొత్తగా మలుచుకోవడం తప్పుకాదే...