కమ్మదనం
కమ్మదనం
ఏమిపోగొట్టు కుంటున్నామో
మరసి నిదుర పోతున్నాము.
కాలం కలిసి రాకపోతే,ఆకలి
బాధ తట్టు కోలేక ,భూమి పై
పడి ఎంత ఏడ్చినా కన్నీళ్ళే
కాలువగా మారింది.
అమ్మ పొత్తిళ్ళలో చేరి నాడు
అమ్మ చెంత చేరి త్రాగిన అమృతంను
ఎచ్చట నుండి వచ్చాయా తెలియదా
అవి ఏమయినా బజారులో
పెట్టేవా ఆలోచించారా
అమాయకుడా కమ్మదనం గూర్చి.
చిన్నా లేదు.పెద్దా లేదు.అందరం
మనిషులం అందరికీ కావాలి డబ్బే
అమ్మదనం నడివీధిలో పెట్టీ
బేరం ఆడుట నేటి సంప్రదాయం.
సిగ్గుకి,అభిమానానికి వ్యత్యాసం
తీసి పార వేసింది నేటి విజ్ఞాన సమాజం
అమ్మ లోని కమ్మదనం.కనుమరుగు
చేసి ఆకలికి అమ్మే కావాలి. ఆనాడు
ఈనాడు ఎంత ఎదిగినా అమ్మనే పెట్టాలా
తాకట్టు. అందుకే నాశనం దరిచేరింది
సమస్త చరాచర జగత్తును దహనం చేయగా
తిండి గింజలు లేకున్నా ,ఒంటి మీద
గుడ్డలు లేకున్నా ,మల మల మాడినా
అమ్మను వీధిలోకి తీసుకు రావద్దు
భారతీయ,ఇతియాస ,చరిత్రలో
మనకున్న గౌరవం,అమ్మదనాన్ని
మట్టి పాలు కానివ్వొద్దు.