Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

కర్ణా

కర్ణా

1 min
4



కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు చేతిలో ఓడిన కర్ణుడు చివరిగా దుర్యోధనుడి తో...

" మిత్రమా ...!

సమస్త లోకాలకి వెలుగును ప్రసాదించే నా తండ్రి

ఆ సూర్య భగవానుడు నన్ను చీకట్లో వదిలేశాడు...

పొరపాటుతో నన్ను కన్న నా కన్నతల్లి కుంతీ దేవి అవమానంగా భావించి అనాథను చేసి నన్ను నదిలో వదిలేసింది ....

పెంచిన తల్లి దండ్రులు అతీరధుడు, రాధమ్మ నా వద్ద నిజాన్ని దాచి క్షత్రియుడైన నన్ను సూతుడుగా పెంచారు...

యుద్ద విద్య నేర్పమని గురువు ద్రోణుడు దగ్గరకేళ్తే,

" కులం తక్కువ వాడికి నే నేర్పను పో !" అని గెంటేశాడు...

కులం దాచి, గురువు పరుశరాముడు దగ్గర విద్యనభ్యసిస్తే,

" మోసం చేశావ్ ! " అంటూ నన్ను శపించి పంపించాడు...

సమస్త విద్యలను అభ్యసించే సాక్షాత్తు ఆ బ్రహ్మ ముఖం నుండి పుట్టిన బ్రాహ్మణుడు వాస్తవాన్ని గ్రహించక ఆవేశపడి శపించాడు...

ఓర్పుకు, ఔదార్యానికి ప్రతీకయిన భూదేవి కూడా

ఒక్క క్షణమైనా ఆలోచించకుండా తొందరపడి కోపగించుకుని దండించింది...

సమస్త లోకాలకే అధిపతి అయిన ఆ దేవేంద్రుడు నా దాన గుణాన్ని ఆసరాగా చేసుకుని యుద్ధం ముంగిట నా శక్తులన్నింటిని లాగేసుకున్నాడు...

చివరికి...

     చివరికి....

ఆ సర్వ లోకాధినాధుడు విష్ణుమూర్తి శ్రీ కృష్ణుడు...

శంకర సువన, కేసరి నందన, పవన సుతుడు హనుమంతుడు..

కూడా నాకు శత్రువైన అర్జునుడుతో జతకలిసి నా పై యుద్ధం చేసి నన్ను ఓడించారు...

ఇన్ని శాపాలు , ఇంత మంది శత్రువుల వల్ల...

అత్యంత బలహీనుడనై,

ఈ మహా సంగ్రామంలో ఓటమి పాలై,

నీకిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాను..

" నన్ను క్షమించు మిత్రమా ?" అని అడిగే అర్హత కూడా కోల్పోయి...

నీ భిక్ష, దయలతో జీవించిన ఈ ప్రాణాన్ని సైతం త్యజిస్తున్నాను...

కానీ, చివరిగా ఒక్క మాట ....

" అయినవాళ్లే అంటరాని వాడిగా అనగదొక్కుతుంటే,

తోడుగా నిలిచిన నీ మిత్రధర్మం కోసం అధర్మమని తెలిసినా నేను నీతో నడవక తప్పలేదు...

అయినా ఎన్ని జన్మలెత్తినా ఈ రాధేయుడు నీ విధేయుడే మిత్రమా !"

అంటూ తన ప్రాణాలు వదిలేశాడు.

-mr.satya's_writings



Rate this content
Log in

Similar telugu poem from Abstract