కవి గా
కవి గా
కవి గా
నీ దుఃఖం ఘనీభవించినపుడే
నా విశ్రమించని ఆశృవులు
కవనాలయ్యాయి !
మాధ్యమాల లో మిధ్యాజీవి నై
సంచరించ కుండా
నీ కంటి చెమ్మ ను
కాంచాను.
మళ్ళీ కలుద్దాం అనే పొడి
మాటలు కాకుండా
అంతరంగ సంభాషణ
కొనసాగిస్తాను.
నీతో పాటు అడుగులు వేస్తూ
నా గుండె లో తేమ ను
పదిలపర్చుకుంటాను !
కవిత్వమై నీకు దూరం కాకుండా
నా తత్వం నీకు తేట తెల్లం చేస్తాను
కవి గా పత్రాలు కాకుండా
నీ గుండె లో నా కవిత్వం
నిలవాలని కోరుకుంటాను !