Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మాసిపోన్ని జ్ఞాపకాల

మాసిపోన్ని జ్ఞాపకాల

1 min
0


నిరీక్షించు తీరంలో అలుపెరుగని అలనైతిని

పరీక్షించు మలుపులలో మమతెరుగని కథనైతిని


మరిమరి సాగే మదిలో ఆపలేని ఊహలెన్నొ 

సమీక్షించు విధిరాతన అంతులేని వ్యధనైతిని..


ఊపిరి పోసే ఆశలు ఎదలో మొగ్గలు తొడిగెను

కలల కౌముదిలో తడిసి ప్రియతలపుల సెగనైతిని


నాసర్వం నీవనుకొని నీ వెంటే ఆడుగేసా

నీపెదవుల నేఅద్దిన తొలివలపుల సుధనైతిని


మనసెందుకు మారిందో ప్రేమేనిను వీడిందో

నీమాటల ఉలిచెక్కిన ప్రాణమున్న శిలనైతిని..


ముసురుకున్న అపార్ధాలు తరుముతుంటె నిదురెక్కడ

వేకువలో కరిగిపోవు ఓచీకటి కలనైతిని


నీపరిచయ పరిమళాలు అద్దుకుంటు తపించాను

వద్దనుకున్నా వీడని నీతలపుల చెరనైతిని


నీజతగా సుజాతమై బ్రతకాలని అనుకున్నా

మాసిపోని జ్ఞాపకాలు పేర్చుకున్న అరనైతిని



Rate this content
Log in

Similar telugu poem from Romance