మంచు తుమ్మెద
మంచు తుమ్మెద
అక్షరాల వనాలనే..పెంచాలని ఉంది..!
గోర్వెచ్చని మౌననదిగ..మిగలాలని ఉంది..!
ఎదురుచూపు కానుకగా..ఇచ్చి వెళ్లినావు..
కనికరిస్తె ఒక హారతి..పట్టాలని ఉంది..!
మాటలేమొ కరువైనవి..వర్ణించగ లేను..
నీ అందెల సవ్వడిలో..ఆడాలని ఉంది..!
నీ తియ్యని ఒక్కచూపు..ఊయలగా దొరికె..
మది చేసే హడావిడిని..చెప్పాలని ఉంది..!
ఒణుకుతున్న పెదవులేలు..ప్రణయగంధమేదొ..
ఒక విందుగ నీ మటుకే..ఉంచాలని ఉంది..!
మనసు వనికి శోభ నింపు..ఈ మాదురం నిధియె..
జగాలకే వెన్నెలగా..పంచాలని ఉంది..!