మనసు కనులు
మనసు కనులు
నన్ను విడచి వెళ్ళవనే నమ్మకాన్ని కాల్చినావు..!
అనుభవాల ప్రేమ కథల పుస్తకాన్ని కాల్చినావు..!
గుండె కనుల ధారల్లో భాష్పాగ్ని శిఖగ మారి..
తెలుపలేని మధురమైన ఆకసాన్ని కాల్చినావు..!
ఆశలన్నీ నీపైనే నిలుపుకొనుట తప్పు కదూ..!
ఎంత గొప్ప అందమైన సముద్రాన్ని కాల్చినావు..!
కొడిగట్టిన దీపమంటి నా మనసును చూస్తావా..!
కరుణ మాని విరబూసిన వసంతాన్ని కాల్చినావు..!
నీవు లేక క్షణమైనా బ్రతుకలేని తనం నాది..!
ఆసరాగ తీసుకు..నా మస్తకాని కాల్చినావు..!
మహిమాన్విత 'మనసా'నిగ అవలేనని తెలుసు కదా..!
నిర్దయగా మన చక్కని ప్రస్తుతాన్ని కాల్చినావు..!