మనసు
మనసు
వుంటుంది ప్రతి మనిషి
మనసుకో రాగం
ప్రకృతిని వీక్షించిన మనసు
పాడుతుంది వసంత రాగం
కావాలి ప్రతి ఇల్లు
ఆనందనిలయం
సంసారంలో చిన్ని చిన్ని తగాదాలు
సృష్టించరాదు శోకరాగం
అలకలు తీరి ఒకటై జంట
పాడాలి మోహన రాగం
సరదాలతో ,సంతోషాలతో
కుటుంబమంతా ఒకటై
పాటై నిలవాలి ఆనందరాగం
మనసుకో రాగం
మనసులు కలిస్తే
అవుతుంది ఒకటే రాగం
అవుతుంది నిత్యం కల్యాణరాగం