మనసుంటే
మనసుంటే
మనసనేది ఉంటే భావోద్వేగం ఉప్పొంగవలసిందే
భావ జలపాతం ప్రవహించాల్సిందే.
మనసు....చలనం లేని శిల కాదు.
అనంత రాగడోలికల అల.
అమేయ అగ్నిజ్వాలల వల.
మౌనిలా కనిపిస్తుంది... ప్రశాంతంగా.
ధునిలా మండుతుంది...ప్రచండంగా.
ఆలోచనలను బట్టి మనసుకో రాగం.
ఆవేశాలకు అనుగుణంగా అది జీవన యాగం.
ఆ క్రతువు ఆశల పల్లకీ కావచ్చు.
భవితను మార్చే ప్రగతి పల్లవి కావచ్చు.
మనసు.....మాయా గవాక్షం.