నా నీడను
నా నీడను
నమ్మలేక పోతున్నా..పాఠమైన నా నీడను..!
పాడలేక పోతున్నా..గేయమైన నా నీడను..!
చెలియలాగ తానున్నదె..రాగభోగ త్యాగపూర్ణ..
చదువలేక పోతున్నా..దేహమైన నా నీడను..!
ఎన్ని అనుభవాలొసగెనొ..వాంఛలెన్ని నెరవేర్చెనొ..
అందలేక పోతున్నా..అందమైన నా నీడను..!
తలపుచాటు బొమ్మలలో..దొరకలేదు దాగిలేదు..
చూడలేక పోతున్నా..పదిలమైన నా నీడను..!
ఎన్నిమెఱుపు లెన్నిసొగసు..లెంతహొయలు
ఏమిమాయ. అడగలేక పోతున్నా..చిత్రమైన నా నీడను..!
ప్రణయగగన వీధులనే..దాటించెను చెలిమిమీర..
పట్టలేక పోతున్నా..గంధమైన నా నీడను..!