నీ కోసం ఓ మనసా
నీ కోసం ఓ మనసా
నీతలపుల వానలోన..తడుస్తోంది మనసు..!
నీకోసం ఒకపాటగ..మారుతోంది మనసు..!
కన్నులింటి అలజడులకు..సెలవిమ్మని మనవి..
నీముంగిట వాలేందుకు..కోరుతోంది మనసు..!
గుండెసడిని అనువాదము..చేయుభాష ఏదొ..
నాపెదవుల వణుకుచూసి..నవ్వుతోంది మనసు..!
సంశయాల జాతరెంతొ..చిత్రముగా ఉంది..
ప్రేమకు ఒక నిర్వచనం..తెలుపుతోంది మనసు..!
కుశలమంటు తెలుపకుండ..ఎట్టులుంటివోయి..
కన్నులెత్తి చూడకుండ..అడుగుతోంది మనసు..!
గాలికెంత ముచ్చటోయి..పరవశమది నింప..
ఇసుకలోన నీపేరును..దిద్దుతోంది మనసు..!