నీ సర్వం
నీ సర్వం
నిన్ను చూడలేకపోతేనేమి
అపురూపమైన నీ రూపం నా కళ్ళలోనే నిలిచుందిగా
నీ స్వరం వినిపించకపోతేనేమి
ప్రకృతిలోని ఏ సవ్వడివిన్నా నీ పిలుపే తోస్తుందిగా
నీ చేయి తాకకపోతేనేమి
చిరుగాలిలా నన్నే తడిమి పోతుంటావుగా
నీతోకలిసి నడవకపోతేనేమి
నీడవై నావెంటే ఉన్నావుగా
నీతో కలిసుండలేకపోతేనేమి
నువ్విచ్చిన జ్ఞాపకాలు తోడున్నాయిగా
కాలాన్నిలా కరిగించేస్తాను
మరుజన్మలోనయినా
మళ్ళీమళ్ళీ నిన్నే కోరుకుంటాను....