ఓ ప్రియతమా
ఓ ప్రియతమా
నేను నేనుగా ఉన్నా నిన్నటి దాకా....!!
కానీ అదేమిటో....
నేను నీలాగా మారిన అక్షరాలతో తడబడుతున్నాను ఇవాళ.....!!
ఉదయించిన తొలి కిరణం నుండి పొద్దు మునిగే వేళ వరకు......!!
నా కనులలో నీ ప్రతి రూపం....!!
నా పెదవులపై నీ నామ స్మరణం.....!!
నా ప్రతి అడుగూ నీతో నడవాలన్న ఉబలాటంతో.....!!
ఎలా రోజంతా గడపాలని గడియలు లెక్క పెడుతున్నాను....!!
ఓ ప్రియతమా....!!
నాలో జరిగిన ఈ మార్పులకు కారణం ప్రేమేనా అన్న సందేహం కలుగుతోంది.....!!