ప్రేమను అరువీయవా!
ప్రేమను అరువీయవా!
పల్లవి :ఇలా ఎలా అసలిలా ఎలా....
ఇలా ఎలా అసలిలా ఎలా....
పడిపోయానో పిల్లా.....
చరణం1:ఉన్నట్టుండి గుండెల్లో.
ఉల్కపాతం మొదలయ్యేనే
సరాసరి నరాల్లో...
చలి జ్వరం స్టార్ట్ అయ్యేనే
నిద్దురనేది కరువాయేనే..కనురెప్ప నాకు బరువాయేనే
నిన్ను చేరే వరమీయవే .. ప్రేమను అరువీయవే .....
వడ్డీతో కలిపి తీర్చేస్తా.....
నవ్వి నవ్వి కవ్వించి
గుండె వేగాన్నింకా పెంచొద్దే
రువ్వి రువ్వి చూపుల్ని
ఎద ప్రాణాలింకా తోడొద్దే
ఇలా ఎలా అసలిలా ఎలా
ఇలా ఎలా అసలిలా ఎలా
పడిపోయానో పిల్లా.
2:ఇనుము ఏమైనా తిన్నావో..
ఆణువణువూ ఆకర్షణే
అమాంతం అయస్కాంతామై .
నీ ఊహకే అతుకున్నానే
మంత్రం ఏదైనా నేర్చావో.. మనసంతా నీ మాయనే
అసాంతం ఆవాహనై.... నీకు సొంతమయ్యానే
అక్షరం ముక్క రానోన్ని
ప్రేమ కవిగా మార్చేస్తివే
సాదా సీదా కుర్రోన్ని
సూపర్ మాన్ గా చేసేస్తివే
ఇలా ఎలా అసలిలా.ఎలా
ఇలా ఎలా అసలిలా ఎలా
పడిపోయానో పిల్లా...