ప్రేయసి
ప్రేయసి
ప్రేయసిది అమలిన ప్రేమని
నిష్కలంక ప్రేమని ఆశించా
ఆమె మాత్రం తన గుండెను
ఎవరికో అద్దెకు ఇచ్చిందట
నాకంటే ధనవంతుడట
పోనీలే స్నేహమొన్నడు
స్వార్థం కోరదు కదా అని
స్నేహితులని స్నేహించా
అక్కర తీరాక వారు మొహం
చాటేసారు ఏరు దాటారు కదా
వీరందరి కన్నా మేలని
బంధువులకు దగ్గరయ్యా
వారు కూడా అంతే వారి
బుద్దిని చూపించారు
ఇలా కాదని అక్షరాలని
చేరదీశా విచిత్రం అవి
నన్ను అక్కున చేర్చుకున్నాయి
అమ్మలా ఆదరించాయి
బిడ్డలా ప్రేమించాయి