శీర్షిక : స్వయంకృతాపరాధం
శీర్షిక : స్వయంకృతాపరాధం
అక్షయపాత్ర ఈ పుడమి
కొలిచే వాడికి కొంగు బంగారం
దోచే వాడికి పాపపరిహారార్థం
చేయకమానదు!
నేలకోరిగినా చెట్లు చేమలు
రెక్కలు విరిగిన పక్షులు
గొంతెండిన చెరువులు
అగ్నిగుండంలో కొంపలు
ఎవరి పాపానికి మిగిలిన ఆనవాలు!
ప్రాణం పోసే వాయువు
దాహం తీర్చే నదీనదాలు
చివరికి తినే తిండి కూడా
కృత్రిమంగా మారాయి!
వ్యాపారంలో చెయ్యి తిరిగి
ప్రతిభ పరదేశానికి ప్రయాణం కట్టి
అమ్మ పాలను కూడా
అంగడిలో అమ్ముకునే
మేధావులు పెరిగి...
స్వచ్ఛమైన ప్రకృతిని బ్రష్టు పట్టించి
కుబేరులవ్వాలనే కోరికే
ఊసరవెల్లి లాంటి మనుసు రంగులను
పుడమికి అద్దారు!
కాలుష్యంలో ముంచెత్తారు!!
- జ్యోతి మువ్వల