Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Crime Inspirational

3  

Midhun babu

Crime Inspirational

స్త్రీ

స్త్రీ

1 min
4



మమతల మల్లె పూదండ! 


ఎంత అపురూపం మగువ జీవితం .

ఇరు కుటుంబాలలో తన ముద్ర శాశ్వతం! 


మహాలక్ష్మి పుట్టేనంటూ పొంగిపోతారు 

స్త్రీ విలువ తెలిసిన సదాచార సంపన్నులు . 


తగిన విద్య నందించి, విలువలు నేర్పగా

కుటుంబాన తాను నింపేను వెలుగులు! 


ఆనందాల సిరులతో పుట్టినింటిని నింపి వెళుతుంది .

సరికొత్త అనుబంధాలతో మెట్టినింటిని కళ కళలాడిస్తుంది . 


మగని ఒంటరి జీవితాన ఒయాసిస్సులా తానొస్తుంది. 

ఎన్నో ఆశలను తన కనుల నిండుగా తోడు తెచ్చుకుంటుంది! 


కొత్త బాధ్యతలతో అలవోకగా అష్టావధానం చేస్తుంది . 

అంతలోనే ఇంటిల్లిపాదినీ నడిపించే ఇంధనంగా మారుతుంది! 


కుటుంబ క్షేత్రాన ఆప్యాయతలను నిత్యం సేద్యం చేస్తుంది. 

పదవీ విరమణ లేని బాధ్యతల మకుటం ధరించి గృహ రాణిగా మారుతుంది !! 


ఒక్క చిరునవ్వుతో ఎంతటి సమస్యనైనా తాను ఎదుర్కొంటుంది. 

ఓ మంచి నేస్తమై మగని జీవితాన కలకాలము తోడై నిలుస్తుంది. 


వయసెంత పెరిగినా ఎన్నటికీ తరగని ప్రేమ నిధిని తాను అందించగలదు. 

ఇంటిల్లిపాదికీ హాయినందించు మమతల మల్లెపూదండగా మారగలదు!! 


అటువంటి అర్ధాంగిని కంటికి రెప్పలా కాచుకోవాలి . 

ఎగుడు దిగుడు జీవితాన ఆలు మగలు ఒకరికొకరు తోడై నిలిచిపోవాలి .


సుధా కళ్యాణి


Rate this content
Log in

Similar telugu poem from Crime