తెల్పుటెలా
తెల్పుటెలా
గుండె తడికి నది భాషను నేర్పమంటు తెల్పుటెలా..!?
అద్దానికి ముద్దు ఘోష అద్దకంటు తెల్పుటెలా..!?
వెన్నెలతో శృతి కలిపే మౌనవీణ నీమనస్సు..!
వనసీమలు రక్షించగ చూడమంటు తెల్పుటెలా..!?
మరుమల్లెల పరిమళాల వసంతమే నీ హాసం..!
ఎదురయ్యే యుద్ధాలకు జంకకంటు తెల్పుటెలా..!?
ప్రతి వాకిట వెలుగు ముగ్గు చక్కలలో నీవేగా..!
స్నేహదీప్తి వంతెననే నిలుపమంటు తెల్పుటెలా..!?
నిన్ను నీవు తెలియకనే ఇన్నాళ్ళూ గొడవలన్ని..!
హంసయాన సాక్షిమల్లె ఉండమంటు తెల్పుటెలా..!?