Gayatri Tokachichu

Children

4  

Gayatri Tokachichu

Children

గీతాంజలి రావు

గీతాంజలి రావు

2 mins
400


గీతాంజలి రావు.


గీతాంజలికి ఇప్పుడు 17 సంవత్సరాలు. తల్లి తండ్రులు అమెరికాలో స్థిరపడిన భారతీయులు. తండ్రి పేరు రామ్. తల్లి భారతి.

వాళ్ళు ఉండేది అమెరికా లోని కోలారాడో ప్రాంతం. అక్కడ ఉన్న 'స్టెమ్ స్కూల్ హైలాండ్ రాంచి 'లోఆమె చదువుతున్నది.ఆమెకు ఒక తమ్ముడు కూడా వున్నాడు.


గీతాంజలి ఒక సైంటిస్ట్ మరియు ఇన్వెంటర్.

ఆ అమ్మాయి స్కూల్ కు వెళ్తూనే పరిశోధనలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐదువేల మంది చిన్నారుల ప్రతిభను పరిశీలించి, వడబోసి గీతంజలిని టైమ్స్ పత్రిక ఎంపిక చేసింది.


 ఏమిటి ఆ బాలిక చేసిన ఘనకార్యం?


మంచినీటి కాలుష్యాన్ని తగ్గించటం మరియు 

స్కూల్ పిల్లల్లో 'సైబర్ బుల్లీయింగ్ 'ని 

 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తో నియంత్రించే పద్ధతులను కనిపెట్టటం!

ఈ ఆలోచనలు ఆమెకు తొమ్మిదేళ్ల వయస్సులోనే రావటం విశేషం.


భూగర్భజలాల్లో కూడా హానికారక రసాయనాలు వుంటాయి.అందులో సీసం కూడా ఒకటి. దీనివల్ల మానవాళి యొక్క ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలుగుతోంది.

మనం తాగే నీటిలో సీసం ఎంత వుందో ఎలా తెలుస్తుంది?


గీతాంజలి పరిశోధనలు చేసి 'టెథిస్ 'అనే పరికరాన్ని కనిపెట్టింది.'టెథిస్ 'అంటే స్వచ్ఛమైన జలం అని గ్రీకు భాషలో అర్థం.


 నీటిలో సీసం శాతం పాయింట్ 24 మైక్రో మోలార్స్ కంటే మించకుండా ఉండాలి.

అయితే నీటిలో సీసం శాతం ఎంతవుందో గీతాంజలి కనిపెట్టిన' టెథిస్ 'పరికరం ద్వారా కనుక్కోవచ్చు'. టెథిస్ 'పరికరాన్ని  నీటికి తాకించి,మొబైల్ కు కనెక్ట్ చేస్తే, దానిలోని సెన్సర్ ద్వారా నీటిలో సీసం ఎంత శాతం వుందో తెలుస్తుంది.


'సైబర్ బుల్లీయింగ్ 'అంటే స్కూళ్ళల్లో కొంత మంది పిల్లలు తోటి వారిని కించపరుస్తూ, వేధిస్తూ వుంటారు. దానిని నియంత్రించటం కోసం 'కైండ్ లీ 'అనే యాప్ ను  గీతాంజలి తయారు చేసింది.


ఈ రెండు ఆవిష్కరణలు ఆమెను 'కిడ్ అఫ్ ది ఇయర్ 'గా నిలిపాయి.

ఆ తర్వాత ఆమె స్వంతంగా చాలా యాప్ లను తయారు చేసింది.



2019 లో స్టార్ ప్లస్ లోని 'టెడ్ టాక్స్ ఇండియా సీజన్ -2 లో షారూక్ ఖాన్ వ్యాఖ్యాతగా వున్నప్పుడు గీతాంజలి స్పీకర్ గా వచ్చింది.అప్పుడు షారూక్ ఖాన్ మాట్లాడుతూ 'మన భవిష్యత్తు నీ చేతుల్లో వుంది 'అని ప్రశంసించారు.


గీతాంజలి 'టైమ్స్ కిడ్ అఫ్ ది ఇయర్' గా ఎంపిక అయ్యాక ప్రముఖ హాలివుడ్ నటి ఏంజలీనా జోలి ఆమెను ఇంటర్వూ చేసి 

ఆమె పరిశోధనలను ఎంతో కొనియాడారు .



అవార్డులు : టెక్నో వేషన్ గర్ల్ ఛాలెంజ్ లో ప్రపంచ ఫైనలిస్ట్ గా ఎంపిక అవటం,

జాతీయ స్థాయిలో టి సి ఎస్ ఇగ్నైట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ద్వారా 'హెల్త్ పిల్లర్' అవార్డు అందుకోవటం,

'టెడ్ 'నయీబాత్ ఇండియా అవార్డు గెలుచుకోవటం,

2017 లో అమెరికా యంగ్ సైంటిస్ట్ గా అవార్డు అందుకోవటం,

షాంఘయి మీడియా గ్రూప్ 'యురేకా 'ఫైనలిస్ట్ అవార్డు అందుకోవటం,

ఆమె అమెరికా జాతీయ స్టెమ్ స్కోట్ అఫ్ ది ఇయర్ గా ఎంపిక అవటం,

యునిసెఫ్ లో సభ్యురాలవటం,

ఫోర్డ్స్ ఇగ్నైట్ నెట్ వర్క్ లో భాగస్వామి అవటం గీతాంజలి కృషికి ప్రతిభకు తార్కాణాలు.


అలాగే గీతాంజలి ఎన్నో అంతర్జాతీయ వేదికలపై వ్యాసనాల మీద,స్త్రీ పురుషుల వ్యత్యాసాలమీద చిన్న తనంలోనే ప్రసంగాలిచ్చి తన ప్రతిభను చాటుకొంది.



గీతాంజలికి భారతీయ సాంప్రదాయం అంటే చిన్నప్పటి నుండి చాలా గౌరవం.

ఆమె భారతీయనృత్యాన్ని అభ్యసిస్తున్నది.

పియనో కూడా చాలా చక్కగా వాయిస్తుంది.

ఆమె స్విమ్మింగ్ లో కూడా చాలా ప్రతిభ కనబరుస్తూ ఉన్నది.

ఆమె తన తొమ్మిదేళ్ల వయసులో వ్రాసిన' పిబి ఎస్ ' జాతీయ రచనలపోటీలో రెండవ బహుమతి గెల్చుకొంది.

ఆమె 2018 లో కిడ్ రిపోర్టర్ మరియు ప్రింట్ సంక్షోభం ఫై ఎన్నో కథనాలు వ్రాసింది.


చిన్న వయసులోనే శాస్త్రవిజ్ఞాన పరిశోధనలు చేస్తూ ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న గీతాంజలి మన భారతీయ సంతతికి చెందిన బాలిక అవటం మనకి గర్వకారణం.

మనకు స్ఫూర్తి కలిగించే గీతాంజలి వంటి బాలబాలికలు ఈనాడు ఎంతో అవసరం.

ఆమె విజయాలను అభినందిస్తూ, ఆమె ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుందాము.


Rate this content
Log in

Similar telugu story from Children