Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

జీవశాస్త్రబ్రహ్మ హరగోవింద

జీవశాస్త్రబ్రహ్మ హరగోవింద

2 mins
26


*జీవశాస్త్రబ్రహ్మ హరగోవింద్ ఖొరానా*


టీచర్ :పిల్లలూ!ఈ రోజు మీకు జీవ రసాయన శాస్త్రంలో D N A.తో మొక్కల పెంపకంలోనూ, వ్యవసాయంలోనూ చాలా మార్పులు సంభవించాయి. జంతువుల్లో, మొక్కల్లో క్లోనింగ్ కు కూడా ఈ పరిశోధనలే మూలకారణం. "


పిల్లలు :టీచర్!DNA. మనుషుల్లో ఉంటుంది కదా!జంతువుల్లో కూడా ఉంటుందా?

టీచర్ :"DNA. జీవులన్నింటిలోనూ ఉంటుంది.రకరకాల బాక్టీరియాల గురించి కూడా తెలుసుకోవచ్చు.మొదట మనం ఈ పరిశోధనలకు పితామహుడైన మన భారతీయ జీవ రసాయన శాస్త్రవేత్త అయిన హరగోవింద్ ఖొరానా గురించి తెలుసుకొందాం!"


పిల్లలు :అలాగే!చెప్పండి టీచర్!"


టీచర్ :హరగోవింద్ ఖొరానా నేటి పాకిస్తాన్ లోని రాయపూర్ గ్రామంలో గణపతి రాయ్ ఖొరానా మరియు కృష్ణదేవి దంపతులకు 1922 జనవరి 9 వ తేదిన జన్మించాడు. తల్లితండ్రులకు ఐదుగురి సంతానంలో హరగోవింద్ ఆఖరివాడు.అతను ప్రాథమిక విద్యానంతరం పంజాబ్ లోని ముల్తాన్ టౌన్ లో దయానంద ఆంగ్లో -వేద పాఠశాలలోమెట్రిక్యులేషన్ పూర్తిచేశాడు. తరువాత లాహోరులోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో 1943లో బి.ఎస్సిని , మరియు 1945లో ఎమ్. ఎస్సిని అభ్యసించాడు.తరువాత అమెరికాలోని లివర్ పూల్ విశ్వవిద్యాలయంలో 1945 నుండి 2948 వరకు పరిశోధనలు చేసి పి.హెచ్. డి. పట్టా పొందాడు. తర్వాత రెండు సంవత్సరాలు స్వీట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో పరిశోధనలు సాగించాడు.


పరిశోధనలు :


1951 - 52 లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రొటీన్స్, న్యూక్లిక్ ఆమ్లములకు సంబంధించిన పరిశోధన మొదలుపెట్టాడు.1952లో కెనడాలోని విస్కాన్సిన్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేరి పని చేశాడు.ఆ తరువాత 1970 లో మాసుచెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో బయాలజీ ప్రొఫెసర్ గా చేరాడు.2007 లో అక్కడి నుండి పదవీవిరమణ చేశాడు.


ప్రయోగశాలలో జీవాన్ని కృత్రిమంగా సృష్టించటం కొఱకు DNA. మీద పరిశోధన చేసి "కృత్రిమ జీన్ "ను సృష్టించగలిగాడు. ఈ ఆవిష్కరణ జెనటిక్ ఇంజనీరింగ్ అనే నూతన శాస్త్ర అధ్యయనానికి దారితీసింది. ప్రతి అమినో ఆమ్లపు నిర్మాణక్రమం మూడుn న్యూక్లియోటైడ్ల అమరికతో జన్యువులలో పొందుపరుచబడి ఉందని ఖొరానా కనుకున్నాడు. కృత్రిమ DNA. ను కనుక్కొన్నాడు. DNA ముక్కలను అతికించు DNA లైగేస్ అనే ఎంజైమ్ ను కనుగొన్నాడు. ఈ పరిశోధనల మూలంగా ఆధునిక జీవశాస్త్రంలో ఒక విప్లవం వచ్చింది. అందుకే జెనటిక్ ఇంజనీరింగ్ కు హరగోవింద్ ఖొరానాను పితామహునిగా కీర్తిస్తారు. ఆయనకు అమెరికా పౌరసత్వం ఉంది.


ఫిజియాలజీ లేదా మెడిసిన్ కోసం 1968 లో వైద్యశాస్త్రంలో తన సహచర ప్రొఫెసర్లు అయిన మార్షల్ W. నిరెన్ బర్గ్ మరియు రాబర్ట్ W.హోలీ తో నోబుల్ ప్రైజ్ ను పంచుకొన్నారు. అంటే నోబుల్ ప్రైజ్ ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు వచ్చింది. వీరి పరిశోధన జన్యుకణం గురించి తెలిసికోవటంలో కీలకపాత్రపోషించింది.ఖొరానాకు "జీవశాస్త్ర బ్రహ్మ "అనే పేరు తెచ్చిపెట్టింది.


పురస్కారాలు :


గైరిందర్ ఫౌండేషన్ ఇంటర్ నేషనల్ అవార్డు.

లూయిసా గ్రాస్ హార్ విట్జ్ ప్రైజ్.

అల్బెర్ట్ లాస్కర్ అవార్డు.

పద్మవిభూషణ్ అవార్డు.


జెనటిక్ ఇంజనీరింగ్ కు ప్రాణం పోసిన హరగోవింద్ ఖొరానా తన 89 వ ఏట 2011వ సంవత్సరం నవంబర్ 9 న అమెరికాలో మసాచుసెట్స్ లో తన స్వగృహంలో మరణించాడు.


నాడు ఖొరానా తాతగారు చేసిన పరిశోధనల ఫలితమే ఈ రోజు వైద్య, వ్యవసాయ, జంతుశాస్త్ర రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు దారితీసింది. కాబట్టి మీరు బుద్దిగా చదువుకొని ఉన్నతమైన పరిశోధనలు చెయ్యాలి. కేవలం డిగ్రీలు పూర్తిచేసి ఉద్యోగాల్లో స్థిరపడటం మాత్రమే కాకుండా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేషమైన పరిశోధనలు చెయ్యాలి. అప్పుడే నూతనమైన విషయాలు ఇంకా కనుక్కోవటానికి అవకాశం ఉంటుంది. వాటి వలన మానవ జీవనం ఇంకా సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుంది."


పిల్లలు :అలాగే టీచర్!


**     **     **    **     **  **    **    **


Rate this content
Log in

Similar telugu story from Inspirational