Abhi Ram

Romance Drama

2.0  

Abhi Ram

Romance Drama

ఇష్క్ వాలా

ఇష్క్ వాలా

24 mins
1.5K


పొగ తాగడం ,మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ఈ కథలోని పాత్రలు ఎవరని ఉద్దేశించినవి కాదు ఇక్కడ వరకే సినిమాలా ఊహించుకోండి మిగిలింది కథ అనుకుని రాశా సినిమా తీయడం కోసం రాయలేదు..


విశాఖపట్నం రాత్రి 9:00:


అమ్మ నాకు అన్నం వడ్డించవే తెగ ఆకలేస్తుంది అంటూ గుమ్మంలోకి అడుగుపెడుతూ అరిచినట్టు చెప్పింది రీతు( విప్రో లో పని చేస్తుంది)


ఏంటి ఇంత లేట్ అయ్యింది??? అని గట్టిగా అడిగా.....


లేట్ అయిందా?? అయినా నువ్వు ఎందుకు అడుగుతున్నావు రా ???? అమ్మనాన్నే నన్ను ఏలాంటి క్వశ్చన్ అడగలేదు మరి నువ్వు ఎందుకు అడుగుతున్నావ్!!


అబ్బా నాన్న తర్వాత ఇంటికి పెద్దమనిషి నేనే కదా అందుకే అడిగా....


అవునా అయితే అరవకుండా నువ్వు మెక్కు.... ఆ విషయం నాకు చెప్పక్కర్లేదు.


అబ్బా వాడితో పోట్లాడాకుండా వెళ్లి కనీసం కాళ్ళ చేతులను కడుక్కొని రాపో అని అమ్మ చెప్పడం తో లోపలికి వెళ్ళింది 5 నిమిషాల తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది. అమ్మ ఏంటి లేట్ అయింది అని అడిగింది. ఇప్పుడు చెప్పు బంగారు చెల్లి ఇందాక అమ్మానాన్న అడగలేదు అన్నావు కదా ఇప్పుడు అమ్మ అడిగింది కదా చెప్పు.........


అది అమ్మ ఈరోజు ప్రాజెక్టు సబ్మిట్ చేయడానికి లాస్ట్ రోజు అందుకే అది కంప్లీట్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. అది సరే కానీ ఏమి కూర చేశావు అని ఆత్రుతగా అడిగింది. నాన్న ఆఫీస్ నుంచి వస్తా కుండ బిర్యాని తీసుకు వచ్చాడు అంటూ వడ్డించింది. హై కుండ బిర్యాని త్వరగా పెట్టు బాగా ఆకలి వేస్తుంది అని మరి వాడికి ఎం చేసావ్ వాడు నాన్ వెజ్ తినడు కదా. వాడికి ఏదో ఒకటి చేశాను లే నువ్వు ముందు తిను.


హే లూజు అమ్మ నాన్న తినేసారు మిగిలింది మొత్తం నీకే ఏం కంగారు పడకుండా నిదానంగా ఒక ఎముక కూడా ఉంచు మాక...


నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా!!! అమ్మ చూడమ్మా ఏమంటున్నాడో.


ఊరుకో శౌర్య.... అమ్మయ్య నాది కంప్లీట్ అయిపోయింది ఇక నేను వెళ్తున్నా....


అప్పుడే నిద్రపో మాక పాలు తీసుకు వస్తా....


నాకు వద్దు అమ్మ ఇప్పటికే చాలా ఎక్కువైంది... సరే అయితే ఫ్రిజ్లో వాటర్ బాటిల్ ఉంది నీళ్లు తీసుకెళ్ళు..


సోదరా ఒక్క నిమిషం రేపు మార్నింగ్ నేను కూడా జాగింగ్ కు వస్తా నన్ను నిద్ర లేపు.


ఏంటి నువ్వు జాగింగ్ గా సడన్గా నీలో ఈ మార్పు ఆ మార్పుకు కారణం ఏమిటో తెలుసుకోవచ్చా.


ఏమీ లేదు ఈ మధ్యన ఓవర్ వెయిట్ అయ్యాను అనిపించింది.


అయ్యో అలా అనిపించిందా అందుకు జాగింగ్ దీనికి నిద్ర దండగా రోజు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేయాల తిండి తగ్గించు చాలు.


నాకు ఉచిత సలహాలు అవసరం లేదు రేపు మార్నింగ్ నిద్ర లేపు చాలు.


సరేనండి సోదరి గారు ఇంకా నేను వెళ్లొచ్చా.....


ఉదయం 5:30గంటలకు


రీతు లెగు జాగింగ్ కి వస్తావా నన్ను వెళ్ళమంటావా?? ఆ వస్తాను ఫస్ట్ టైం ఎర్లీ గా నిద్ర లేస్తున్న చాలా బద్దకంగా ఉంది టెన్ మినిట్స్ టైం ఇవ్వు రెడీ అయి వస్తా.


సరే నేను బయట వెయిట్ చేస్తాను రా ....


అలాగే అన్నయ్య ...టెన్ మినిట్స్ తర్వాత రెడీ అయి బయటకు వచ్చింది. అదేంటి బైక్ మీద జాగింగ్ కి వెళ్ళేది ఇకనుంచి దగ్గరే కదా గ్రౌండ్.అంటూ బైకు ఎక్కింది ...బైక్ పోనిస్తూతూ అవును గ్రౌండ్లో పరిగెత్తే సరికి బాగా అలసిపోతాం గ్రౌండ్ దగ్గర నుంచి రావాలంటే ఇంకా ఓపిక ఎక్కడ ఉంటుంది...


అవును నీతో రోజు నీ తోక జాగింగ్ కి రాడ???


వాడికి నీకన్నా బద్ధకం ఎక్కువ వాడు ఆఫీస్ కి వెళ్లడానికే ఆపసోపాలు పడుతూ నిద్ర లేస్తాడు అలాంటిది పొద్దున్నే జాగింగ్ అంటే వాడికి చాలా కష్టం అలా మాట్లాడుకుంటూ గ్రౌండ్కి వచ్చాం..


అవును నువ్వు రన్నింగ్ చేస్తావా లేక నడుచుకుంటూ తిరుగుతావా అని అడిగా కానీ తనేమో ఎవరికోసం వెతుకుతున్నట్లు దిక్కులు చూస్తుంది... హలో రీతు... నేను ఇక్కడ మాట్లాడుతుంటే నీ కళ్ళు ఎవరికోసం వెతుకుతున్నాయో తెలుసుకోవచ్చా...ఎవరు అబ్బాయి.. అని వెటకారంగా అడిగా...


ఛా అబ్బాయి లేదు ఏమి లేదు మా ఫ్రెండ్ కూడా ఈ గ్రౌండ్ కే వస్తుంది తనకు నేను లావుగా అవుతున్న ఎలా తగ్గాలో చెప్పవే అనేసరికి ఉదయాన్నే రన్నింగ్, జాగింగ్ కానీ చెయ్ నేను గ్రౌండ్ కి వెళ్తున్నాను నువ్వు కూడా రా అని చెప్పింది అందుకని తన కోసం చూస్తున్న.


ఓ అది చెప్పు ఏంటబ్బా ఉన్నట్టుండి మా చెల్లెలు ఇంత మార్పు అని అనుకున్నా ఆ మార్పు కారణం నువ్వు కాదా? సరే ఇక్కడే తనకోసం చూడు నేను రన్నింగ్ చేసి వస్తాను చెప్పి అలా ఉషారుగా గ్రౌండ్ మొత్తం ఐదు రౌండ్లు చుట్టేసి రీతు దగ్గరికి వెళ్లా ఏమి ఇంకా మీ ఫ్రెండ్ రాలేదా అడిగి తన చేతిలోని వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగుతున్నా.. ఇంకా రాలేదు అంటూ చేతిలోని వాటర్ బాటిల్ లాగేసుకుంది. ఏ అలా తీసుకున్నావ్ ఏమి?? తెచ్చిన వాటర్ మొత్తం నువ్వే తాగేస్తే ఎలాగా నేను తాగాల్సిన అవసరం లేదా?.


అబ్బా నువ్వేం ఏం పరిగెత్తావు తాగడానికి ప్రశాంతంగా వచ్చి కూర్చున్నావు మరి నీకెందుకు నీళ్లు. అలా మాట్లాడుతూ పక్కకు చూసా పక్కన ఎవరు ఒక అమ్మాయి చూడ్డానికి దేవ కన్యలా చాలా బాగుంది తను మమ్మల్ని గమనిస్తుంది. గమనించడం చూసి ఎం కావాలి మీకు అని అడిగా?? రే అన్నయ్య తనే నా ఫ్రెండు సారా.


తను నీ ఫ్రెండ్ ఆ..? ఎప్పుడు చూడలేదు.!!!


ఆ విషయలు తర్వాత చెబుతా.. సారా ఎప్పుడొచ్చావ్ ఏమి అక్కడే నుంచొని ఉన్నావు అని రీతు అనడంతో దగ్గరికి వచ్చింది.


తనకి ఇతను మా అన్నయ్య శౌర్య అంటూ పరిచయం చేసింది.


హాయ్ అండి నవ్వుతూ పలకరించింది...


నేను హాయ్ అని తనని పలకరించా..


సరే జాగింగ్ మొదలుపెడతామని రీతుని అడిగింది.సరే మీ ఇద్దరు జాగింగ్ కి వెళ్ళేసి రండి నేను ఇక్కడ కూర్చుంటాను అని చెప్పడంతో ఇద్దరూ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్లి పోయారు.


ఎవరు తను నేను ఎప్పుడు రీతుతో చూడలేదు కానీ తను నా మనసును బాగా నచ్చింది. తన డీటెయిల్స్ తెలుసుకుందామని అడిగా తర్వాత చెప్తాను అన్నది అలా ఇరవై నిమిషాలు తన గురించి ఆలోచిస్తున్నా వాళ్ల జాగింగ్ ముగియడంతో నా దగ్గరికి వచ్చారు సరే రీతు ఆఫీస్ కి వెళ్లేముందు నా రూమ్ కి రా ఇంకా వెళ్తాను అని చెప్పి సార వెళ్ళిపోయింది.


నేను తన గురించి తెలుసుకుందామని ఆత్రుతగా రీతును అడిగా... హలో ఏంటి తన గురించి తెలుసుకుందామని ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నావ్ నీ పప్పులేం ఉడకవ్ తనకి ఆల్రెడీ పెళ్లి అయింది అని బాంబు పేల్చింది. పెళ్లయిందా?? అయినా నాకు అలా అనిపించడం లేదు. మీ ఫ్రెండ్స్ మొత్తం నాకు తెలుసు కానీ ఈ అమ్మాయిని నీతో ఎప్పుడూ చూడలేదు సారా ఎక్కడ పరిచయమైంది.


అది నేను (9 నెలల క్రితం) బి.టెక్ కంప్లీట్ అయిన తర్వాత అమ్మమ్మ వాళ్ల (హైదరాబాద్) ఇంటికి వెళ్ళాం కదా అక్కడ మామయ్య ఖాళీగా ఉండడం దేనికి ఎదేనా కోర్స్ నేర్చుకోవచ్చు అనడంతో ఒక సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అయ్యా అక్కడ తనతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్తాం ఆరు నెలల్లో మంచి స్నేహంగా ఏర్పడింది కోచింగ్ అయిపోయిన తర్వాత విశాఖపట్నం వచ్చాను కానీ సారా అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తుంది కానీ 20 రోజుల క్రిత నాకు ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళు సంబంధం తెచ్చారు పూర్తి వివరాలు చెప్పకుండా నాకు ఆ పెళ్లంటే ఇష్టం లేదు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏదైనా సలహా ఇవ్వు అని అడిగింది.


నాకు ఎలాంటి సలహా ఇవ్వాలో తనకి ఎలా సద్ది చెప్పాలో అర్థం కాలేదు సరే విశాఖపట్నం వచ్చేయ్ ఇక్కడ ఏదో ఒక జాబ్ చేయొచ్చు అని చెప్పడంతో సరే రేపు వస్తాను అని ఫోన్ పెట్టేసి రెండు రోజుల తర్వాత విశాఖపట్నం వచ్చింది. తనని ఇంటికి తీసుకు వచ్చాను అప్పుడు నువ్వు ఆఫీస్ వర్క్ మీద బెంగళూరు వెళ్లావు. ఇంటికి వచ్చినప్పుడు తను ఎప్పుడు ఏడుస్తూ ఉండేది ఏం జరిగింది అని అడిగినా ఏ విషయం సరిగ్గా చెప్పేది కాదు అన్నం కూడా సరిగా తినేది కాదు రెండు రోజుల తరువాత కోలుకుని ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు అని చెప్పింది. పెళ్లి చేసుకున్నా అతను జోర్డాన్ చెందినవాడు జోర్డాన్ తీసుకు వెళ్తాను అని చెప్పారు వాళ్ల నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చాను అని చెప్పింది. అంతకుమించి ఎక్కువ అడిగితే ఇంకా బాధపడుతుందని తన గురించి ఏమీ అడగలేదు మూడు రోజుల తర్వాత మా కంపెనీలో తనని రిఫర్ చేశా టాలెంట్ ఉండడంవల్ల ఈజీగా జాబు వచ్చింది. ఈ గ్రౌండ్ పక్కనే పీజీలో ఉంటుంది సరే పద ఆఫీస్ కు టైం అవుతుంది వెళ్ళాలి అని రీతు అనడంతో.


ఏ నువ్వేనా ఆఫీస్ కి వెళ్ళేది నేను కూడా ఆఫీస్ కి (టెక్ మహీంద్రాలో రీతు ఆఫీస్ కి పక్కన మా ఆఫీస్) వెళ్లాలి అని ఇంటికి వచ్చాము.


ఇంటికి వచ్చి రెడీ అయి రాఘవ్ కు ఫోన్ చేశాను( ఒకే ఆఫీస్ అండ్ రీతు తోక అన్నది వీడినే) ఫోన్ లిఫ్ట్ చేసి రెడీ అయ్యాను వచ్చి పిక్ అప్ చేసుకో అన్నాడు సరే వస్తున్నా అని ఫోన్ పెట్టేసి వాడి ఇంటి దగ్గరికి వెళ్లీ మళ్లీ కాల్ చేశా వాడు ఫోన్ కట్ చేసి ఎదురుగా వచ్చాడు ఏంటి లేట్ త్వరగా రా అక్కడ నేను సెమినార్ ఇవ్వాలి.


వస్తున్నారా అంటూ బైక్ ఎక్కి,నీ సెమినార్ గురించి అలా ఉంచు ఈరోజు నాకు మేనేజర్ చేతిలో చివాట్లు తప్పదు


ఏంట్రా బాబు ఏమి చేసావు..?


ఏముంది ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయమన్నాడు టుడేస్ టైమ్ అడిగా ఈరోజు లాస్ట్ రోజు ఏమంటాడో ఏమో..?నిన్ను హెల్ప్ అడిగితే చేయనన్నావు.


అవున్రా నాది నాకు సరిపోతుంది మళ్లీ నీకేమీ హెల్ప్ చేయమంటావు. సరేలే నీకు ఏమైనా అవసరం వస్తుంది కదా అప్పుడు చెప్తా సరే త్వరగా పోనివ్వు.


రాఘవ్ ప్రతి ఒక్కరికి అవసరం వస్తుంది నేను రాదని చెప్పట్లేదు అలా మాట్లాడుకుంటూ ఆఫీస్ కి వచ్చాం.


ఆఫీస్ లోకి ఎంటర్ అవ్వగానే ప్యూన్ ఎదురుగా వచ్చి సార్ మిమ్మల్ని ఇద్దరినీ మేనేజర్ గారు రమ్మంటున్నారు.


వీడేంట్రా అప్పుడే వచ్చాడు అంటూ రఘు టెన్షన్ గా ఉన్నాడు వాడి మొహం చూస్తుంటే చిన్నప్పుడు స్కూల్లో హోంవర్క్ ఇస్తే చేయకపోతే ఎలా భయపడతాడో అలా ఉన్నాడు, ఒరేయ్ రఘు నిన్ను అంటే ప్రాజెక్ట్ వర్కు ఇచ్చాడు కాబట్టి రమ్మన్నాడు కానీ నేను ఎందుకు రా??.


ఏమో నాకేం తెలుసు నేను ఏమి మేనేజర్ కాదు,లోపలికి వెళితే తెలిసింది దేనికి రమ్మన్నాడు అనేది.


అబ్బో సరే పద అని రూమ్ దగ్గరికి వెళ్లి సర్ ...మే ఐ కమింగ్ అని ఇద్దరం ఒకేసారి అన్నాం.


కమింగ్....


గుడ్ మార్నింగ్ సార్...


వాట్ ఆర్ ద అప్డేట్ రఘువ్...


వాడేమో ఏం మాట్లాడకుండా నేల వైపు చూస్తున్నాడు..


రాఘవ్ i am asking you.. వాట్ ఆర్ ద అప్డేట్...


సార్ అదే వర్క్ లోనే ఉన్నాను కొంచెం టైం కావాలి..


రాఘవ్ ఈ ప్రాజెక్ట్ వర్క్ నీకు ఇచ్చి ఎన్ని రోజులైంది టు డేస్ బ్యాక్ టుడేస్ టైం కావాలంటే ఇచ్చా మళ్లీ ఇప్పుడు టైం కావాలి అంటున్నావ్ కరెక్ట్ గా చెప్పు ఎన్ని రోజులు కావాలి ఒకవేళ ఇప్పుడు అడిగిన టైం లో కంప్లీట్ చేయకపోతే ఏం చేయమంటావ్??.


అమాయకంగా సార్ 5 డేస్ ఇవ్వండి అన్నాడు..


సరే తీసుకో 5 డేస్ లోగా కంప్లీట్ రిపోర్ట్ నా టేబుల్ మీద లేకపోతే నువ్వు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అర్థమవుతుందా?? ఓకే సార్ కంప్లీట్ చేస్తాను. ఇంక నువ్వు వెళ్ళవచ్చు రాఘవ్.


ఓకే సార్.


శౌర్య నువ్వు ఈరోజు ఇవ్వవలసిన ప్రజెంటేషన్ 1 మంత్ తర్వాత బెంగుళూరులో ఇవ్వవలసి వస్తుంది ఈరోజు క్యాన్సిల్ అయింది..


ఓ అవునా సార్... వెళ్తాను సార్, may I go now?


ok శౌర్య..


ఇంకా ఎందుకోసం పిలిచాడు అనుకున్నా ఈ విషయం చెప్పడానికా అనుకుంటూ రాఘవ దగ్గరికి వెళ్లా అక్కడ వాడి మొహం బేలపోయి ఏదో ఆలోచిస్తున్నాడు, ఏంట్రా దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్ అని అడిగా... ఏమి ఉంది నువ్వు హ్యాపీ బట్ నాకు లోపల వాచిపోతుంది. టైం అడిగావు కదా అప్పుడు లోపు కంప్లీట్ చేద్దాంలే బాధ పడమాకు. ఇప్పుడు చేస్తున్నానన్న హెల్ప్ ముందే చేసుంటే వాడిచేత మాట పడే వాడిని కాదు కదా!!! అవును రా ప్రతిసారి ఎవరో ఒకరి మీద ఆధార పడతావా ఏమి???


రేయ్ శౌర్య ఒకటి చెప్పు నువ్వు నాకు ఎన్ని సార్లు హెల్ప్ చేసావు రా, ఫస్ట్ టైం ఏదో కొంచెం హెల్ప్ చేయమంటే ప్రతిసారి నువ్వే నా వర్క్ చేసేలా లెవల్ ఇస్తున్నావ్.


సాయంత్రం 6 గంటలకు:


హలో రాఘవ్ ఆఫీస్ టైమింగ్స్ కంప్లీట్ అయ్యి వన్ అవర్ అయింది ఏదో హెల్ప్ చేస్తానని చెప్పినందుకు ఈ రోజు ఇక్కడే కూర్చో పెడతావా ఏమి??, నావల్ల కాదు వెళదాం పదా.


సరే నువ్వు వెళ్తూ ఉండు నేను వస్తానని చెప్పడంతో గ్రౌండ్ ఫ్లోర్ వెళ్లి బైక్ మీద కూర్చుని రాఘవ కోసం వెయిట్ చేస్తున్నా. 2నిమిషం తర్వాత వచ్చి బైకు ఎక్కాడు. ఏమయ్యా రాఘవ్ గారు ఎక్కడికైనా వెళ్దామా లేకపోతే డైరెక్టుగా ఇంటికేనా అంటూ బైక్ స్టార్ట్ చేశా.


అరవకుండా ఇంటికి పద ఎక్కడికి అవసరం లేదు కానీ.


సరే అంటూ కొంచెం దూరం వెళ్ళగానే బైక్ ఆగిపోతున్నట్లనిపించింది. ఏంట్రా బైక్ ఆగిపోయింది సందేహంగా అడిగా.


ఏమోరా నాకేం ఏమి తెలుసు?


అదేంట్రా నిన్న 200 పెట్రోల్ కొట్టించా నిన్న నైట్ బైక్ను బయటకు తీసుకెళ్ళింది నువ్వేగా ఎక్కడ తిరిగావు రా? బయటికి వెళదామని బైక్ తీస్కోవచ్చా కానీ బయటకు మా తమ్ముని పంపించాను వాడు ఎక్కడ తిరిగాడో మరి.


ఒరేయ్ రాఘవా ఎంత పని చేశావురా దగ్గరలో పెట్రోల్ బంకు కూడా లేదు ఇప్పుడు మూడు కిలోమీటర్లు నెట్టుకుంటూ పోవాలా నావల్ల కాదు నువ్వే తీసుకో అని బైక్ వాడి చేతికి ఇచ్చి నెట్టుకు రమ్మన్న, అలా జాలీగా నడుచుకుంటూ వస్తున్నాం ఇంతలో ఎదురుగా స్కూటీ వచ్చి ఆగింది.


హే శౌర్య ఏమైంది నడుచుకుంటూ వస్తున్నావు అని వాయిస్ వినిపించింది.


ఎవరై ఉంటారు అని స్కూటీ వైపు చూసా ఆ స్కూటీ రీతు ది కానీ తను రీతుల లేదు స్కార్ఫ్ కట్టుకోవడం వల్ల సరిగా అర్థం కావట్లేదు నేను సరిగ్గా రెస్పాండ్ అవ్వక పోయేసరికి హెల్మెట్ ,స్కార్ఫ్ తీసింది. తను సారా...నేను ఆశ్చర్యంతో అలానే చూస్తూ ఉండిపోయా,ఏమైందని మళ్ళీ అడిగింది.


అది పెట్రోల్ అయిపోయింది...


అవునా సరే అయితే స్కూటీ ఎక్కు పెట్రోల్ బంకు దగ్గర పెట్రోల్ తీసుకుని రావచ్చు..


అలా అడిగేసరికి స్కూటీ ఎక్కల వద్దా అని సందేహిస్తున్న.


అయ్యో ఏమైంది అలా చూస్తున్నారు ఎక్కండి మళ్ళీ అడిగింది.


మీకు ఎందుకు అండి శ్రమ..


ఇందులో శ్రమ ఏముంది, ఏం సరిగా డ్రైవ్ చేస్తానా ? లేదా ? అని డౌట్ గా ఉన్నారా ఏం పర్లేదు నేను బాగానే డ్రైవ్ చేస్తాను...


అయ్యో అలా ఏం లేదు అదే మీకెందుకు శ్రమ అని ఆలోచిస్తున్నాను....


ఏం పర్లేదు ఎక్కండి జాగ్రత్తగానే తీసుకెళ్తాను...


సరే అని స్కూటీ ఎక్కాను, అవును రీతు స్కూటీ మీరు తీసుకువస్తున్నారు రీతు ఎక్కడికి వెళ్లింది...


రీతునా రేపు ఆఫీస్ వర్క్ మీద హైదరాబాద్ వెళ్లాలి అందుకని చిన్న షాపింగ్ చేయడం కోసం తను తన కోలిక్ కొంచెం ఎర్లీగా వెళ్లారు...


అదేంటి మీరు వెళ్లలేదా???


లేదు వాళ్ళిద్దరూ ఒకే టీం నేను వేరే టీం...


ఓ అలానా!!! అలా మాటల్లో పెట్రోల్ బంకు వచ్చాం స్కూటీ దిగి భయ్యా కాలి లీటర్ బాటిల్ ఉంటే అందులో పెట్రోల్ కొట్టావా అని అడిగా తన దగ్గర ఆల్రెడీ ఫీల్ చేసిన బాటిల్ ఉంటే ఇచ్చాడు, అమౌంట్ పే చేసి స్కూటీ ఎక్కాను.


సారా ఏమి మాట్లాడకుండా డ్రైవ్ చేస్తుంది నాకు ఏమో పెద్దగా పులిహోర కలపడం రాదు నేను కూడా సైలెంట్ గా ఉండిపోయా


ఇంతలో రాఘవ దగ్గరికి వచ్చాం ఏరా నెట్టు రాకుండా అలానే లే స్టాండ్ వేసుకుని ప్రశాంతంగా కూర్చున్నావు.


అబ్బా చా నువ్వు పెట్రోల్ కి వెళ్లావు అని తెలిసి కూడా నెట్టుకు రావాలా!!


సరే తీసుకొని ఫిల్ చెయ్ అని రఘుకి ఇచ్చా సరే నేను వెళ్తానని సారా అన్నది..


ఒక్క నిమిషం అంటూ దగ్గరికి వెళ్లా థాంక్స్ అని అడుగుదామా వద్ద అన్నట్టుగా చూసా.తను ఏంటి అని అడిగింది. రెండుసార్లు పరిచయానికే ఫోన్ నెంబర్ అడిగితే అడ్వాంటేజ్ తీసుకున్నాను అని అనుకుంటుందా అని మనసులో సందేహం?? సరే అడుగుదాం ఇవ్వాలనుకుంటే ఇస్తుంది లేకపోతే సారీ అంటుంది అంతే కదా అని కొంచెం మొహమాటం గా ఫోన్ నెంబర్ అడిగా...


ఓ ఫోన్ నెంబర్ కే నా అంత మొహమాట పడుతున్నారు అంటూ నెంబర్ చెప్పి ఇంకా వెళ్ళనా అని అడిగింది.


ఒకే ఒకే టేక్ కేర్....అన్నాను


తను వెళ్లగానే రేయ్ శౌర్య ఎవరుతను అని అత్యుత్సాహంగా రాఘవ్ అడిగాడు...


తను సారా రీతు వాళ్ళ ఫ్రెండ్ అండ్ ఆఫీస్ కొలిక్.


అవునా నేను ఎప్పుడు రీతు తో చూడలేదే. నేను ఈరోజు చూసా ఉదయం జాగింగ్ లో రీతు పరిచయం చేసింది.


అంటే తను రోజు జాగింగ్ కి వస్తుందా అయితే నేను రేపు జాగింగ్ కి వస్తాను రా ?.


ఓ ఆగు తనకు మ్యారేజ్ అయింది అంట... రీతు చెప్పింది. మ్యారేజ్ అయిందా!! రేయ్ తను చాలా బాగుంది...


అవును కదా నా మనసులో కూడా అదే ఫీలింగ్ వచ్చింది పరిచయం చేసినప్పుడు కానీ మ్యారేజ్ అయింది అనేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను.


ఏంట్రా అప్పుడే ప్రేమ పుట్టిందా ఏమి?? one సైడ్ ప్రేమిస్తే ఓకే పెళ్లంటే కష్టం కదరా.. తనకు పెళ్లి అయింది అన్నావ్ కదరా అప్పుడు సెకండ్ మ్యారేజ్ కి తను ఒప్పుకోదు కదరా ఎలా పెళ్లి చేసుకుంటావు?


అది నిజమే కానీ తను మ్యారేజి ఏ పరిస్థితుల్లో చేసుకుందో మనకు తెలీదు కానీ తనకి మ్యారేజ్ అంటే ఇష్టం లేదు అందుకే వాళ్ళ ఫ్యామిలీనీ అతన్ని వదిలేసి వచ్చింది... అలా మాట్లాడకుండా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి నిద్రపోయా....


ఉదయాన్నే 5:30గంటలకు


నా మైండ్ కి తనకు పెళ్ళయిందని అర్థం అవుతున్నా మనసుకు మాత్రం తనని చూడాలని,మాట్లాడాలని అనుకుంటుంది అందుకని తన కోసం రీతు హైదరాబాద్ వెళ్లడంతో నాతో జాగింగ్ కి రాలేదు తనని చూడొచ్చు అని రోజుకు కన్నా కొంచెం ముందే జాగింగ్ కి వచ్చి గ్రౌండ్ మొత్తం నాలుగు రౌండ్లు వేసి తన కోసం బెంచి మీద కూర్చుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ విందామని గూగుల్ మ్యూజిక్ ఓపెన్ చేసి నాకు ఇష్టమైన సాంగ్ ఎక్కడ ఎక్కడ ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి.. సాంగ్ ప్లే చేశా వింటూ తనకోసం ఎదురుచూస్తున్నా పదినిమిషాల తర్వాత ఎదురుగా వస్తుంది తనను చూసి జాగింగ్ చేస్తున్నట్టు దగ్గరికి వెళ్లి హాయ్ గుడ్ మార్నింగ్ అని పలకరించా...


హాయ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే వచ్చావా...


అవును ఇప్పుడే ఒక రౌండ్ వేసాను నువ్వువు కనిపించావు...


ఓ అవునా సరే పద..


తనతో ఎలాగైనా ఇంప్రెస్ గా మాట్లాడి తనకి దగ్గర అవ్వాలి అని మనసులో అనుకుంటూ అవును నీది హైదరాబాద్ హా???


హే నీకు ఎలా తెలుసు...?


అది నీ గురించి రీతీను అడిగితే చెప్పింది..


నా గురించి రీతిను ఎందుకు అడిగావు??


నీ గురించి తెలుసుకుందామని అడిగా..??


నా గురించి తెలుసుకోవడం దేనికి..?


ఈ అమ్మాయి ఏంటిరా ఇంత అమాయకంగా ఉంది ఒక అబ్బాయి ఒక అమ్మాయి గురించి ఎందుకు తెలుసుకుంటాడు


ఆ మాత్రం కూడా తెలియదా అంతేలే పెళ్లయిందని తన గురించి తెలుగు కోవాల్సిన అవసరం లేదు అనుకుంటుందేమో.


హలో శౌర్య ఏమి ఆలోచిస్తున్నావు...?


అయ్యో టాపిక్కు ఎక్కడికో వెళ్తుంది వెంటనే డైవర్ట్ చేయాలి అని అనుకొని, అదే నిన్న మార్నింగ్ రీతు నిన్ను పరిచయం చేసింది కదా ఎవరు తను అని జస్ట్ ఫార్మల్ గా అడిగా.


ఓ అవునా...


అవును సారా ఈ రోజు వీకెండ్ కదా ఏంటి స్పెషల్...??


స్పెషల్ ఏం లేదు ఆఫ్టర్నూన్ వరకు ఆఫీస్ ఉంది తర్వాత పిజి వచ్చి రిలాక్స్ అవడమే... ఏం నువ్వు ఏమైనా ప్లాన్ చేసుకున్నావా...?


అయ్యో ప్లాన్ ఏమీ ఉండదు బోరింగ్ లైఫ్ రాఘవను అడిగాను బయట వెళ్దామని వాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో బయటకి వెళ్తున్నాడు సో నేను ఫ్రీ నే మాకు కూడా ఈ రోజు ఆఫ్ డే నే....


రాఘవ అంటే నిన్న నీ తోటి బైక్ను నడిపించుకుంటూ వస్తున్నాడు అతనే నా ??.


అవును అతనే.


అయితే నువ్వు కూడా రాఘవ తోటి బయటికి వెళ్ళచ్చు కదా....?


మామూలుగా తన ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు నన్ను invite చెయ్యడు నేను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకునే వాన్ని కాదు ,అలా 20 నిమిషాలు మాట్లాడుతూ నడిచిన తర్వాత ఇంకా వెళ్దాము టైం అవుతుంది అనడంతో ..


సరే వెళ్దాం అవును ఎలా వెళ్తావ్... నేను డ్రాఫ్ చేయనా అని అడిగా..??


పర్వాలేదు పక్కనే పేజీ నడుచుకుంటూ వెళ్తాను...


ఓకే ఓకే మళ్ళి కలుద్దాం..


సరే bye అని చెప్పేసి వెళ్ళిపోయింది..


నేను ఇంటికి వచ్చి రెడీఅయి రాఘవని పికప్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళే వర్క్ లో బిజీ అయిపోవడంతో టైం చాలా త్వరగా గడిచిపోతుంది ఇంతలో రాఘవ్ నా క్యాబిన్ వైపు తొంగి చూసి ఏంటి సార్ బిజీగా వర్క్ చేస్తున్నారు...??


ఏముంది రా బాబు నువ్వంటే తోపువి నీకు ఏ వర్కు ఇచ్చినా పూర్తి చేస్తావ్ నాకు నీ అంత టాలెంట్ లేదు అందుకే చిన్న చిన్న గా చేసుకుంటున్నా.


కొంచెం తగ్గించు మరి ఓవర్ అయింది ఎవరికి ఎంత టాలెంటు ఉంటుందో అందరికీ తెలుసు అది సరే ఈరోజు నైట్ పార్టీకి వస్తావా..


ఏంట్రా రాఘవ్ కొత్తగా నన్ను పిలుస్తున్నావు పార్టీకి ఆశ్చర్యంగా అడిగా!!!!...


పిలిచినప్పుడు రావడం నేర్చుకో రా అంతేగాని ఈ వెధవ క్వశ్చన్స్ అన్నీ అవసరమా??


సరేనండి టైం చెప్పండి వస్తా..?


మా ఫ్రెండ్స్ ఇంకా ప్లేస్ డిసైడ్ చేయలేదు నైట్ టైం, ప్లేస్ ఫోన్ చేసి చెబుతామన్నారు అప్పుడు చెప్తా


సరే సరే, ఆ విషయం అలా పక్కన పెట్టు కొంచెం సలహా ఇవ్వరా?? ఏంటి నువ్వు సలహా అడుగుతున్నావా దేని గురించి ??


అదేరా సారా గురించి...?


ఏంటి సారా గురించా..!!! తన గురించి నేను ఏమి సలహా ఇవ్వగలను.


నా మనసులోని ఫీలింగ్ తనకు చెప్పాలనుకుంటున్నా అది ఎలా చెప్పాలో మంచి సలహా ఇవ్వు ??


ఏముంది సింగిల్ గా ఉన్న ప్లేస్ కి తీసుకువెళ్లి నీ ఫీలింగ్ గురించి చెప్పు.


తనకి నాతో రావడం ఇష్టం లేకపోతే..??


ఏముంది తను ఉన్న ప్లేస్ కే నువ్వు వెళ్లి చెప్పు, అవును తను ఫోన్ నెంబర్ ఇచ్చింది కదా ఫోన్ లో చెప్పు.....


ఫోన్ లో నా ఫీలింగ్ సరిగా ఎక్స్ప్రెస్ చేయలేను డేర్ గా తన కళ్ళలో చూస్తూ నా ఫీలింగ్స్ చెప్పాలి అప్పుడే తనకు నా ఫీలింగ్ అర్థమవుతుంది కానీ అధైర్యం రావట్లేదు.


అలాంటప్పుడు నీకెందుకురా ఆ సాహసం అయితే ఈ రోజు హాఫ్ డే కదా రెస్టారెంట్కో, పార్లర్లకో ఎక్కడికైనా బయటికు వస్తుందేమో అడుగు..


ఒక్క నిమిషం ఇప్పుడే వాట్సప్ లో మెసేజ్ చేస్తా.


హాయ్ అని మెసేజ్ పంపించా వెంటనే హాయ్ అని రిప్లై ఇచ్చింది, ఎక్కడున్నావ్ అని అడిగా?? ఇప్పుడే మినర్వా రెస్టారెంట్ కి వచ్చా ఏదేనా తినేసి రూమ్ కి వెళ్దామని.అవునా నేను వస్తున్న టెన్ మినిట్స్ లో అక్కడ ఉంటా అని మెసేజ్ చేసి ......


రే తను మినర్వా లో ఉందంట నువ్వు ఇంటికి వెళ్ళు నేను తనని మీట్ అయి వస్తా అని చెప్పి హడావుడిగా వెళ్తున్నా.. రే రే అంటూ రాఘవ పిలుపు వినిపిస్తోంది అయినా ఖాతరు చేయకుండా మినర్వా బయల్దేరా ఇంతలో మేనేజర్ ఎదురుగా వచ్చాడు ఏంటి శౌర్య హడావిడిగా ఉన్నావ్ ఎక్కడికి వెళ్తున్నావ్ అని సోది విషయాలు అడగడం మొదలు పెట్టాడు మనసులో వీడేంటి ఏంట్రా బాబు ఇప్పుడు తగులుకున్నాడు ఆఫీస్ టైమింగ్స్ అయిపోయింది కదా ఇంటికి వెళ్తున్నాడు అని అనుకోవచ్చు కదా!! అది సార్ కింద ఇంపార్టెంట్ పర్సన్ వెయిట్ చేస్తున్నాడు మీట్ అవుదాం అని వెళుతున్నాను సార్!!


ఓకే ఓకే వెళ్ళు...


నీ యబ్బ అడగాలి కాబట్టి అడిగావు లేకపోతే నీకెందుకురా ఆఫీస్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా అని తిట్టుకుంటూ బైక్ దగ్గరకు వచ్చా ఇంతలో సారా నుంచి ఫోన్ వచ్చింది బైక్ డ్రైవ్ చేస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నా ఎక్కడ ఉన్నావు శౌర్య ఇప్పుడే వస్తాను అన్నావు 15 నిమిషాల నుంచి వేటింగ్ చేస్తున్నా.


వస్తున్న వస్తున్న ఆల్మోస్ట్ రీచ్ అయిపోయా ఫోన్ కట్ చేసే లోపు మినర్వా వచ్చింది బైక్ పార్క్ చేసి లోపలికి ఎంటర్ అయి తన ఎక్కడ ఉందని చూసా తను నన్ను చూసి చెయ్యి ఊపింది నేను తనను చూసి తన దగ్గరికి వెళ్లి కూర్చుని ఇంకా ఏమి ఆర్డర్ ఇవ్వలేదా అని అడిగా.


లేదు నీ కోసమే వెయిట్ చేస్తున్నా...


మొదట నేను గమనించలేదు తను హాఫ్ శారీలో ఉంది, ఆ శారీలో చూస్తే నా మతి పోయింది, సారా నీకు ఒక విషయం చెప్పనా శారీలో చాలా బాగున్నావ్.


థాంక్స్!!!!!


సర్ ఆర్డర్ అంటూ మెనూ చేతికిచ్చాడు మెనూ ఓపెన్ చేసి చూస్తే ,చికెన్, మటన్, మటన్ తందూరి ,కబాబ్, ఇలా అని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి అబ్బా ఇప్పుడు ఎలా? నాకు ఇష్టం లేకున్నా నాన్ వెజ్ ఆర్డర్ చేసి ఎలాగో అలా మేనేజ్ చేద్దామని అనుకుంటే ఈరోజు సాటర్డే నాన్ వెజ్ అసలు తినకూడదు అనుకుంటూ మెనూ తన చేతికి ఇచ్చి నువ్వు ఆర్డర్ చెయ్ అని చెప్పా.


తను మెనూ వెనక్కితిప్పి one చాక్లెట్ మిల్క్ షేక్ అండ్ one cup cappuccino విత్ honey అండ్ ఎక్స్ ట్రా మిల్క్ అని ఆర్డర్ చెప్పింది.


తను నాకు ఇష్టమైనది ఆర్డర్ చేసింది అలా ఆర్డర్ చేసే సరికి ఆశ్చర్యమేసింది, అవును ఆ ఐటెం నాకు ఇష్టమని నీకు ఎలా తెలుసు??


ఒకసారి మాటల మధ్యలో రీతు చెప్పింది నువ్వు నాన్ వెజ్ తినవు అని చెప్పింది అప్పుడు నీ టెస్ట్ లు కూడా చెప్పింది అలా గుర్తుంది.


అవును నువ్వు ఏం తిన్నావా??


నిజం చెప్పాలి అంటే కబాబ్ తిందామని వచ్చా కానీ నువ్వు వస్తానని ఫోన్ చేశావు కదా అందుకే ఇది ఆర్డర్ ఇచ్చా.


ఓ అవునా ఒక నిమిషం ఇప్పుడే వస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లే...


హలో excuse me...


చెప్పండి సార్..


ఇందాక ఆర్డర్ ఇచ్చాను కదా దాంతోపాటు రెండు ప్లేట్లు కబాబ్స్ తీసుకురండి..


ఓకే సర్..


అలా ఆర్డర్ చెప్పి టేబుల్ దగ్గరికి వెళ్ళా సారా ఎవరో అమ్మాయితో మాట్లాడుతుంది నన్ను చూసి శాన్వి తను శౌర్య హే ఆగు నీ హస్బెండ్ ఏ కదా?? హే కాదు కాదు రీతు వాళ్ళ అన్నయ్య!! ఓ సారీ సారీ అయినా నువ్వు ముస్లిం కదా తన పేరు శౌర్య అని చెప్పావ్ అప్పుడైనా అర్థం చేసుకోవాల్సింది, సారీ అండి,


థాంక్యూ అని చిన్నగా అన్నా...


ఏంటి.....?


ఆ పర్లేదు అన్నాను...!


శౌర్య తిను శాన్వి మా ఆఫీస్లొ కొలీగ్ అండ్ నా టిం మెట్...


హాయ్..


హాయ్ మీరు రీతి వాళ్ళ అన్నయ్యనా!!!! మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు ఎక్కడ వర్క్ చేస్తారు..


ఈ అమ్మాయి ఏంట్రా బాబు అంత కుతూహలంగా అడుగుతుంది అనుకొని నేను tech మహేంద్ర లో చేస్తున్నా.


అంటే మా ఆఫీస్ పక్కనే...


అవును మీరేం తింటారు ఆర్డర్ చేసి వస్తాను అని కనుక్కొని అక్కడికి వెళ్లి ఆర్డర్ చేసి మళ్ళీ వచ్చి కూర్చున్నా.. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు నేను వచ్చి కూర్చోవడం చూసి శాన్వి శౌర్య if you don't mind మీ నెంబర్ ఇస్తారా... ?


ఓ స్వారీ నా ఫోన్ మిస్ అయింది కొత్త నెంబర్ తీసుకున్న తర్వాత రీతుకు చెపుతాను నా నెంబర్ ఇవ్వమని, తనకు డౌట్ రాకూడదని ఆ ఫోన్ స్విచాఫ్ చేసి షూ లో పెట్టా అనుకోకుండా నా చూపు సారా వైపు వెళ్ళింది తను విచిత్రమైన పేస్ తో నన్ను చూసింది.


ఓ అవునా..?


ఇంతలో ఆర్డర్ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టాడు...


అదేంటి కబాబ్ తీసుకొచ్చావు నేను ఆర్డర్ ఇవ్వాలి కదా...??


మేడం సార్ ఇచ్చారు అందుకే తీసుకు వచ్చాను..


నీ మనసుకు తినాలనిపించింది కదా దానికి నేను కారణం కాకూడదు అందుకే నేనే ఆర్డర్ చేసాను నేను దీంతో మేనేజ్ చేస్తున్నాను నువ్వు తిను...


సరే అని తల ఊపింది...


వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ తింటున్నారు నేను మాత్రం తనను చూస్తూ cappuccino ను sip చేస్తున్న నేను సారాని చూడటం తను గమనించింది నేను చూస్తున్న కూడా నన్ను ను అప్పుడప్పుడు గమనిస్తూ శాన్వి తో మాట్లాడుతుంది అలా 15 నిమిషాలు తర్వాత తినడం కంప్లీట్ అయింది ఏ సారా ఇప్పుడు ఒకసారి మా ఇంటికి రావా ప్రాజెక్ట్ లో కొంచెం డౌట్ లు ఉన్న క్లారిఫై చేదువు అని శాన్వి అడిగింది... ఇప్పుడా నాకు కుదరదు ఈవినింగ్ వస్తాను... ఈవినింగ్ బయటికి వెళ్ళాలి ఇప్పుడు రావా ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్..... ఒక్క నిమిషం బిల్లు పే చేసి వెళ్దాం ఆ పర్లేదు సారా నువ్వు వెళ్ళు నేను పే చేస్తాను..


వద్దులే శౌర్య నేను పే చేస్తాను....


నువ్వే వెళ్ళు నేను ప్లే చేస్తాను...


సరే అయితే మళ్ళీ కలుద్దాం...


శాన్వి కూడా మళ్ళీ కలుద్దాం అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోయారు నేను బిల్ పే చేసి శాన్విని తిట్టుకుంటూ ఇంటికి వచ్చా.


సాయంత్రం 5 గంటలకు


నిద్ర పోతూ ఉంటే అమ్మ వచ్చి నిద్ర లేపి రేయ్ శౌర్య ఈ ఫోన్ 10 నిమిషాల నుండి మోగుతూనే ఉంది ఫోన్ దగ్గర పెట్టుకోవచ్చు కదా హాల్లో పెట్టకపోతే..?ఎవరా అని చూస్తే రాఘవ్ చాలా సార్లు ఫోన్ చేశాడు ఇప్పుడు కూడా చేశాడు ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడు అంటూ చేతికిచ్చింది లిఫ్ట్ చేసి హలో చెప్పరా అన్నా ?? నీ యబ్బ ఎంత సేపు నుంచి రా ఫోన్ చేసేది ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా??


విషయం చెప్పరా....


అదే సార ఉంది కదా తను10 నిమిషాల క్రితం నేను మా ఫ్రెండ్స్ ఆర్కే బీచ్ రోడ్నా వెళ్తుంటే అక్కడ తను స్కూటీ పార్క్ చేస్తా చూసా ఆ విషయం చెప్పడం కోసం పది నిమిషాల నుంచి ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయలేదు....


అవునా స్వారీ రా నిద్ర పోతున్న ఇప్పుడు బయలుదేరుతున్న ఫోన్ కట్ చేసి హడావుడిగా బైక్ తీసుకొని ఆర్కే బీచ్ దగ్గరకు వచ్చి తను ఎక్కడ ఉందని వేతకడం స్టార్ట్ చేసి పదిహేను నిమిషాల వరకు వెతుకుతూ ఉన్న నాకు 100 మీటర్ల దూరంలో జనాలకు దూరంగా ఏకాంతంగా ఎగసి ఎగసి పడుతూ తీరాన్ని చేరడానికి తెగ ఊవ్విరులు ఊరుతున్న అలలు చూస్తూ సముద్రపు ఒడ్డున కూర్చుంది, తన దగ్గరికి వెళ్లి హాయ్ అన్నా.


హాయ్ శౌర్య నువ్వేంటి ఇక్కడ..?


సరదాగా బీచ్ చూద్దామని వచ్చాను..


అవునా అని సందేహంగా చూసింది..


నేను రాఘవ రోడ్డుమీద వెళ్తుంటే నువ్వు బీచ్ లో కి వెళ్లడం చూసా 15నిమిషాలు మంచి చూస్తున్న ఏకాంతంగా కూర్చున్నావ్ కంపెనీ ఇద్దామని వచ్చా అవును నువ్వు ఏంటి ఒంటరిగా,సైలెంట్ గా కూర్చుని అలలు వైపు చూస్తూ ఉన్నావు అడిగా దానికి సముద్రం అలలతో చూడడానికి గంభీరంగా ఉన్నా వాటిని అలానే చూస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.


ఇలా ఎంతసేపని చూస్తూ ఉంటావు సరదాగా నీళ్లలోకి వెళ్ళచ్చు కదా అని అడిగా.. అమ్మో సముద్రంలో కా నాకు సముద్రం అంటే భయం.


ఎందుకు భయం నేనున్నా కదా??


అయినా కూడా నాకు భయం..


కొంచెం బలవంత పెట్టగా పైకి లేచి నాతో సముద్రం వైపు నడవసాగింది ఇంతలో అలలు తన వైపు రావడం చూసి ఒడ్డున ఆగిపోయింది సరే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తాను అని చెప్పి కొంచెం లోపలికి వెళ్లే తనను చూస్తున్న తను మాత్రం తీరాన్ని తాకుతున్న అలలను తన దగ్గర రానీయకుండా ముందుకు వెనక్కి పరిగెత్తుతూ సంతోషంగా ఉంది ఏప్పుడు మూడి గా ఉండే తను అలా సంతోషంగా ఉండడం చూడలేదు, తన దగ్గరికి వెళ్లి కొంచెం చొరవ తీసుకుని చేయి పట్టుకొని సముద్రం లోపలికి తీసుకువెళ్లే తను మాత్రం భయం భయంగానే లోపలికి వచ్చింది అప్పుడే ఒక పెద్ద అల వచ్చింది భయంతో గట్టిగా నన్ను హత్తుకుంది తను అలా కౌగిలించుకునే సరికి లోపల తెలియని స్పందన కలిగింది కానీ అడ్వాంటేజ్ తీసుకున్నాను అని అనుకుంటుందని తన తలను రెండు చేతులతో పైకి అని తన కళ్ళలో కళ్ళు పెట్టి చూసి విల్ యు మ్యారి మీ అన్నా ఆ మాట వినగానే ఒక్కసారిగా నాకు దూరంగా జరిగింది ఏమి మాట్లాడకుండా వెళ్లిపోతుంది హే సారా ఏం చెప్పకుండా అలా వెళ్ళిపోతే ఏం అర్థం చేసుకోను ఏదో ఒకటి చెప్పు పోవాలి కదా ఇష్టం ఉందన...? ఇష్టం లేదన్న...?


మరుసటి రోజు జాగింగ్ చేసిన తన కోసం వెయిట్ చేశా ఎంతసేపు రాకపోయేసరికి ఇంటికి వెళ్లా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు మెసేజ్ పెడితే రిప్లై లేదు అలా తను రిప్లై ఇస్తుందని ఫోన్ చేతులు పట్టుకుని సాయంత్రం వరకు తిరుగుతూ ఉన్న ఇంతలో రీతు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేయగా అన్నయ్య స్టేషన్ లో ఉన్నాను వచ్చి పిక్ చేసుకోవా అని అడిగింది సరే వస్తున్నా అని స్టేషన్ కి వెళ్లి రీతు దగ్గర ఉన్న లగేజీని తీసుకుని కార్ లో పెట్టా.


రే అన్నయ్య కార్ తెచ్చావు ఏమి బైక్ తీసుకురావచ్చు కదా? ఏమి కారు నిన్ను ఇంటికి తీసుకు వెల్లదా?? కారు అయితే ఏమి? బైక్ అయితే ఏమి ?సరే కానీ నువ్వు డ్రై చెయ్ అంటూ కీస్ తన చేతికిచ్చి తన చేతిలో ఉన్న మొబైల్ తీసుకున్నా. హలో నా మొబైల్ తో నీకు ఏం పని రా?.


నా దాంట్లో డేటా బ్యాలన్స్ కంప్లీట్ అయిపోయింది నెట్ బ్రౌజ్ చేసుకోవాలి అందుకు.


అవునా!!!


సరే కానీ నువ్వు పద అని కార్ బ్యాక్ సీట్ లో కూర్చున్నా.


అదేంట్రా అన్నయ్య కారు వెనుక సీట్లో కూర్చున్నావు ముందు సీట్లో కూర్చోవచ్చు కదా??


అబ్బా ఇరిటేషన్ తెప్పించకుండా నువ్వు పదవే??


ఏంటి ఈరోజు అంత తింగరగా బిహేవ్ చేస్తున్నావ్?


అలాంటిది ఏమీ లేదు కానీ నువ్వు పద అని చెప్పి ఫోన్ వాల్యూం తగ్గించి వాట్సప్ ఓపెన్ చేసి సారా కాంటాక్ట్ వెతికి హాయ్ అని మెసేజ్ పెట్టా తను వెంటనే రిప్లై ఇచ్చింది, ఎక్కడున్నావ్ ఇప్పుడే ఇంటికి వచ్చాను ఒకసారి కలుస్తావా అని అడిగా?? లేదు అబ్బా ఇప్పుడు మూడ్ లేదు రేపు ఆఫీస్ లో కలుద్దాం అని చెప్పింది అప్పుడు నాకు అర్థమైంది నన్ను అవైడ్ చేస్తుందని , మెసేజీలు డిలీట్ చేసి ఫోన్ రీతు చేతికి ఇచ్చి తన గురించి ఆలోచిస్తున్నా ఇంతలో ఇంటికి వచ్చాం.


తను నా జీవితం లోకి రావాలని కోరుకుంటున్న అలాంటిది తనను అవాయిడ్ చేసినంతమాత్రాన తనని పట్టించుకోకూడదా ??తను నాకు నచ్చింది కాబట్టి వెంటనే నచ్చింది అని చెప్పేసాను కానీ తను ఉన్న పరిస్థితి కొన్ని రోజులు వేచి చూడాలని పించింది అందుకని తనను అవాయిడ్ చేస్తున్నా పట్టించుకోకూడదు అనుకుని నిద్రపోయా


మరుసటి రోజు నేను రీతు జాగింగ్ కి వెళ్ళాం అప్పుడు తను వచ్చింది ఒంటరిగా ఉన్నప్పుడు తనతో మాట్లాడదామని అనుకున్న కాని కుదరలేదు అలా మౌనంతో చూపులతో కొన్ని రోజులు గడిచాయి తన ఫోన్ కి నా విషయానికి రిప్లై ఇవ్వు అని మెసేజ్ పెట్టడం మర్చి పోయే వాడిని కాదు.


ఆఫీసులో ఉండగా ఫోన్ కి మెసేజ్ రావడంతో ఎవరా అని ఫోన్ చూసా సార దగ్గర్నుంచి మెసేజ్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఆర్కే బీచ్ దగ్గర కలవు అని ఉంది, అలా తనకి నుంచి మెసేజ్ వచ్చేసరికి దీనికై ఉంటుంది అనే సందేహం కన్నా తన దగ్గర్నుంచి మెసేజ్ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యా ఎప్పుడు 5 గంటలు అయిందా అని టైం చూస్తూ కూర్చున్నా.


గంట ముందే పర్మిషన్ తీసుకొని 4 గంటలకల్లా అక్కడ వాలి పోయా తన కోసం ఎదురు చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్న తను ఏం చెబుతుంది? ఎందుకు నన్ను పిలిచింది? అయినా ఆర్కే బీచ్ కి ఎందుకు రమ్మన్నది? ఇంతకీ నేను ప్రపోజ్ చేసిన ప్లేస్ కాబట్టి సెంటిమెంట్ గా ఇక్కడే నాకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటుందా ??ఇలా సందేహంతో మైండ్ మొత్తం రన్ అవుతుంది 5:15 అవుతున్న ఇంకా రాలేదు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావ్ కనుక్కుందామని ఫోన్ తీశా అప్పుడే ఎదురుగా వచ్చి నుంచుని,నాకు మ్యారేజ్ అయింది అని తెలుసు కదా?? మరి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టి రిప్లై కావాలంటే ఏం తమాషాలు చేస్తున్నావ్ అని కోపంగా అడిగింది?


అదే ఏముంది ఈ రోజుల్లో అబ్బాయిలు, అమ్మాయిలు రిలేషన్స్ లోకి ఎంత త్వరగా వెళ్తున్నారు నచ్చకపోతే అంత త్వరగా బయటికి వస్తున్నారు పెళ్లి అయినా వాళ్ళు కూడా నచ్చకపోతే మళ్లీ పెళ్లి చేసుకున్నారు వాళ్ళు నచ్చకపోతే ఇంకో పెళ్లి చేసుకున్నారు ఇలాంటి కొందరి వల్ల వివాహ బంధం మరి దిగజారిపోయింది వాళ్ళతో నీకు పోలిక లేదు జరిగిన పెళ్లి నచ్చకపోవడంతో వాళ్ల నుండి దూరంగా వచ్చావు నా దృష్టిలో అది పెళ్లి కాదు అందుకే నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నా.


ఒక విషయం చెబుతాను ఆ విషయం విన్న తర్వాత నీవు ఒపీనియన్ చెప్పు?


నువ్వు ఏ విషయం చెప్పినా నేను కన్విన్స్ అవును నీ జీవితంలోకి రావాలి అనేది ఒకటే నా మనసులో ఉంది.


ఏదో విషయం కాదు నా జీవితంలో జరిగిన దాని గురించి అంటూ గతం గురించి చెప్పసాగింది...


జీవితంలో ప్రతి అమ్మాయికీ ఏదో ఒక దశలో వేధింపులు ఎదురవుతూనే ఉంటాయి. ఒక్కోసారి మనకు తెలీకుండానే మనల్ని ఎదుటివాళ్లు వేధిస్తుంటారు. కానీ చాలా మంది అమ్మాయిలు దాన్ని గుర్తించలేరు" నేను గుర్తించలేని వ్యక్తి వల్ల మోసపోయాను, నీచుడు చేసిన పనికి నాకు షాది జరగకపోయినా జరిగిందంటూ చెప్పుకొని బతకవలసిన అవసరం వచ్చింది.


అమ్మ జిజియా నాన్న అబ్దుల్ చెల్లెలు పర్వీన్ నాన్నకు లేని వ్యసనం లేదు మామయ్య ఫ్యామిలీకీ సపోర్ట్ ఇచ్చారు


నాకైతే చదువుకోవడం చాలా కష్టం కానీ చదవడం చాలా ఇష్టం ఆ ఇష్టాన్ని అర్థం చేసుకొని మామయ్య సహాయంతో డిగ్రీ ఫైనల్ ఇయర్ కి వచ్చా అప్పుడే ఒక చిన్న సంఘటన వల్ల ఒక వ్యక్తి నా జీవితంలోకి వస్తాడు అనుకోలేదు అది డిగ్రీ ఫైనల్ ఇయర్ రోజు లాగే కాలేజీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి బస్టాప్ లో వెయిట్ చేస్తున్న మా ఏరియా కి వెళ్లే ఏ బస్సు చూసిన ఫుల్లుగా ఉన్నారు వీకెండ్ అవడంవల్ల ఫుల్ గా ఉన్నారు అనుకుని కొంచెంసేపు వెయిట్ చేసి వెళ్దాం అనుకుని అలా ఉండి పోయా కానీ పది నిమిషాలు అవుతున్నా అన్ని బస్సులు అలాగే ఉన్నాయి సరే చేసేదేమీ లేదు ఈసారి ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కి వెళ్దాం అనుకున్న అప్పుడే బస్సు రావడంతో బస్సు ఎక్కా ఆ బస్సులో ఎక్కువగా మగవాళ్లే ఉన్నారు రద్దీగా ఉందన్న వంకతో చాలామంది పక్కన నిలబడటానికీ, తాకడానికీ ప్రయత్నించారు మనసులో రోజు బురఖా వేసుకొని వచ్చేదాన్ని కానీ ఈరోజు బురఖా వేసుకుని ఉంటే బాగుండు అని ఫీల్ అయ్యా అప్పుడే ఒక అతను వచ్చి పక్క నుంచున్నాడు మొదట నాకు ప్రొడక్షన్ ఇస్తున్నాడు అనుకున్నా డ్రైవర్ బ్రేక్ వేయడం వల్లొ గానీ లేక కావాలని చేశాడో తెలియదు కానీ మీదపడ్డాడు కోపంతో చంప కేసి ఒకటి ఇచ్చి కిందకు దిగి వేరే బస్సు ఎక్కి ఇంటికి వచ్చా మరుసటి రోజు ఆ వ్యక్తిని కాలేజీలో చూసా తను దగ్గరికి వచ్చి స్వారీ నిన్న జరిగిన దానికి నేను కావాలని అలా చేయలేదు డ్రైవర్ బ్రేక్ వేయడం వల్ల అలా యాక్సిడెంటల్ గా జరిగిపోయింది అని చెప్పి నా పేరు యూసఫ్ అని చెప్పాడు అప్పటి నుంచి నాకు దగ్గరవడానికి ప్రయత్నించేవాడు కొన్ని రోజులు గడిచాక ఒకరోజు నా దగ్గరికి వచ్చి నిన్ను చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాను అని చెప్పాడు సారీ అని చెప్పి తన ప్రపోజల్నీ తిరస్కరించా నాకు ఇష్టం లేదని చెప్పినా కూడా పట్టించుకోకుండా నా వెనక తిరిగేవాడు అప్పుడే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా అయిపోవడంతో ఇంటి దగ్గర ఉన్న మామయ్య జాబ్ కోసం ట్రై చేయక పోయావా అని అడిగాడు అప్పుడు మావయ్య డిగ్రీ బేస్ మీద జాబు అంటే కొంచెం తక్కువ సాలరీ వస్తుంది సాఫ్ట్వేర్ కోర్సుకు నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పా ఎంత అవుతుంది అది నేను చూసుకుంటా నువ్వు సాఫ్ట్వేర్ కోర్స్ చేయమని చెప్పడంతో కోర్సులో జాయిన్ అయ్యా నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ కోర్స్ వెళ్లేదాన్ని అప్పుడే రీతు పరిచయమైంది తక్కువ టైంలో నన్ను బాగా అర్థం చేసుకుంది తనే.


ఒకరోజు ఇనిస్ట్యూట్ నుంచి ఇంటికి వస్తుంటే విధి చివర మళ్లీ యూసఫ్ కనిపించాడు ఎదురుగా వచ్చి అడ్డుగా నిలబడి నీ ప్రేమ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నా నువ్వు ఏమో తప్పించుకుని తిరుగుతున్నావ్ నేనంటే ఇష్టం లేదా ఇంకా ఎవరైనా ప్రేమిస్తున్నావా?.


చూడు యూసఫ్ నన్ను ప్రేమిస్తున్నానని ఇబ్బంది పెట్టమాకు ఇలా ఇబ్బంది పెడితే మా మామయ్యకి చెప్పాను అని చెప్పి ఇంటికి వెళ్లే అప్పటివరకు సాఫీగా సాగుతున్న నా జీవితం అప్పుడే మలుపు తిరిగింది మామయ్య యాక్సిడెంట్ లో చనిపోయాడు దాంతో అప్పుడు వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగిన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు లోనయింది నాన్న జల్సాలకు డబ్బులు కరువయ్యాయి అతి కష్టమైన రీతు సహాయంతో కోచింగ్ కంప్లీట్ చేసి జాబ్ టైల్స్ లో ఉండగా అప్పుడే ఒక బ్రోకర్ పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు వాడు నాన్నకు మంచి ఆఫర్ ఇచ్చాడు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే 2 లక్షలు ఇస్తామని ఆశ చూపారు దానికి అబ్బు ఒప్పుకున్నాడు.


ఒకరోజు ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చా ఇల్లంతా హడావుడిగా ఉంది.


అమ్మి kya hoga( ఏమైంది హడావుడిగా ఉంది)


మీ అబ్బు చెప్పాడు నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్లు వస్తున్నారని అందుకే హడావుడిగా ఉంది నువ్వు వెళ్లి రెడీ అవ్వు.


ఏంటి అప్పుడే నాకు నికానా!!!! అమ్మి బాబాతో నువ్వేనా మాట్లాడు నాకు ఇప్పుడే పెళ్లి వద్దని ప్లీజ్ అమ్మి కొంచెం కన్విన్స్ చెయ్.


మీ అబ్బు తో నా నాకు అంత ధైర్యం లేదు ఆ అబ్బాయిది జోర్డాన్ అంట, ఆ అబ్బాయి మీ అబూకు రెండు లక్షలు ఇస్తాడని చెప్పాడంట అని చెప్పింది అది కాకుండా నెలకు 10000 పంపిస్తామని చెప్పాడంట,సరే ఇప్పుడు నువ్వు రెడీ అవ్వు తర్వాత చూద్దాం అంటూ త‌యారు చేసింది.


తర్వాత చూడడానికి ఏముంది అమ్మీ.....


త్వరగా రెడీ చేసావా వాళ్ళు రానే వచ్చారు అంటూ అబ్బు లోపలికి వచ్చాడు.


రెడీ అయింది అండి ఇప్పుడే తీసుకు వస్తున్నా మీరు పదండి అని చెప్పి తీసుకునివెళ్లి వాళ్ల దగ్గర కూర్చుని పెట్టింది వాళ్ళలో ఒకరు భేటీ ఏక్ బార్ దేక్ హునే tera khoo pasand hai..( ఒకసారి చూడు అబ్బాయి నీకు నచ్చాడా) అని అడిగాడు నేను మాట్లాడకుండా కూర్చుండిపోయా రెండు రోజుల్లో నికా చేసుకుంటాం వీసా కోసం నా సర్టిఫికెట్స్ జిరాక్స్ అడిగి తీసుకెళ్లారు.


వాళ్ళ వెళ్లిపోయిన తర్వాత అబ్బా నేను ఇప్పుడే ఈ షాదీ చేసుకొను.


అతన్ని పెళ్లి చేసుకోను అనడానికి సమస్య ఏంది? ఖచ్చితంగా షాదీ చేసుకోవాలి.


సమస్య ఏమీ లేదు అతను ఈ కంట్రీ వాడు కాదు ఎక్కడి నుంచో వచ్చాడు పేపర్లలో, టీవీల్లో చూస్తూనే ఉన్నాం కదా ఇక్కడ అమ్మాయిల జీవితాల‌తో అరబ్ దేశాల మ‌గ‌వారు చెల‌గాటం ఆడుతున్నారు. డ‌బ్బు కోసం కొంద‌రు పేద ముస్లింలు త‌మ కుమార్తెలను అర‌బ్ ధ‌న‌వంతుల‌కు క‌ట్ట‌బెడుతున్నారు పెళ్లి చేసుకుని ఆ కంట్రీ తీసుకెళ్లి అక్కడ వాళ్లని పని మనుషుల కన్నా హీనంగా చూస్తూ హింసిస్తున్నారని చూస్తున్న అంతెందుకు నిన్న మీ దోస్త్ పఠాన్‌ అమీర్‌ ఖాన్‌ చెబుతున్నారు కదా వాళ్ల కూతుర్ని దుబాయ్ ఉన్న షేక్ కిచ్చి షాది చేశారు తను అక్కడ తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నానని, ఇక్కడి నుంచి తీసుకెళ్లకపోతే చనిపోతానంటూ షేక్‌ ఇంటి నుంచి పారిపోయి వేరే వారి దగ్గరకు వెళ్లి అక్కడి నుంచి వాట్సప్‌ ద్వారా వీడియో సందేశాన్ని కుటుంబీకులకు పంపింది అని చెప్పారు కదా ఇలా అన్ని తెలుసు కదా అయినా షాదీ చేసుకోమంటున్నారు.


అవి అన్ని కుదరదు నువ్వు షాదీకి రెడీగా ఉండు.


నో వే papa మే హుస్సే shaadi nai karunge బస్.( సమస్య లేదు నేను పెళ్లి చేసుకోను)


నువ్వు నో అన్నా ఈ షాది జరుగుతుంది జిజియా(అమ్మ) ఈ రెండు రోజులు ఇంటి నుంచి బయటకు వెల్ల నీకు అంటూ గదిలో పెట్టి డోర్ వేశాడు అప్పుడే రీతు కి ఫోన్ చేశా తన సలహా మీద అమ్మి సహాయంతో ఇంట్లోంచి బయటకి వచ్చేసా రోడ్డు మీద లగేజ్ తీసుకుని ఆటో కోసం ఎదురు చూస్తూ ఉన్న మధ్యాహ్నం టైం వల్ల ఎంతసేపటికి ఆటోలు రావట్లేదు బస్సులు కూడా స్టేషన్ వైపు వెళ్లే బస్సులు రావడం లేదు సరే అని కొంచెం సేపు ఎదురు చూసాను ఇంతలో కారు వచ్చి ఆగింది కార్ల ముస్తఫా హాయ్ సార ఎక్కడ వరకు నేను డ్రాప్ చేయనా??. వీడు ఏంట్రా బాబు నేను ఎక్కడికి వెళ్తాను అనేది నా కన్న వీడికే బాగా తెలుసనుకుంటా ఎక్కడికి వెళితే అక్కడ ఉంటున్నాడు అని అనుకొని ఆ పర్లేదు నేను ఆటోలో వెళ్తాను.


సారా నన్ను లవ్ చేయమని అడగలేదు డ్రాప్ చేస్తాను అని అడిగా ఇందులో ఇబ్బంది ఏమైంది కారు ఎక్కచు కదా?


ఎక్కనా...? వద్ద...? అలా కొంత సేపు సందిగ్ధంలో పడిపోయా కొంచెంసేపు చూసినా ఆటో రాలేదు సరే అని కారు ఎక్కి కూర్చున్న థాంక్స్ సార కారు ఎక్కి నందుకు.. అలా మాట్లాడుతూ కారు నడుపుతున్నాడు కొంచెం సేపు తరువాత వాటర్ తాగుతావా అని కారులోని బాటిల్ చేతికి ఇచ్చాడు మొదట మొహమాటానికి వద్దు అని చెప్పిన ఎండలో నిలబడటం వల్ల వాటర్ దప్పిక అయ్యాయి దాంతో బాటిల్ తీసుకున్న కొంచెం తాకే సరికి వాటర్ టెస్ట్ డిఫరెంట్ గా ఉంది ఏంటి వాటర్ టెస్ట్ డిఫరెంట్ గా ఉన్నాయి?? అది వెదర్ హాట్ గా ఉంది కదా ఎనర్జీ కోసం ఎనర్జీ పౌడర్ మిక్స్ చేసి ఉంది.


ఓ అవునా అని సందేహించకుండా తాగేశా, కొంచెం సేపు తరువాత కళ్ళు మసకలు కమ్మాయి ఏం జరిగిందో అర్థం కాలేదు స్పృహ కోల్పోయాను.


నా ఒంటిపై పెట్రోల్ పోసినప్పుడు మెలుకువ వచ్చింది నిప్పంటించే సమయంలో ఎలాగో విడిపించుకుని బయటపడ్డా స్పృహ లో నుంచి బయటికి రావడం కొంచెం లేట్ అయి ఉంటే నిప్పంటించి సజీవదహనం చేసేవాడు


అలా తప్పించుకునేందుకు సంతోషించాలో స్పృహ లో లేనప్పుడు ఏం జరిగిందో గుర్తులేదు కానీ ఏం జరిగిందో, ఎలా జరిగిందో అర్థం చేసుకోగలను ఆ లైంగిక ఎమోషనల్ హింస నాపై ఎంత ప్రభావం చూపిందంటే, నాలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చి,ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే నాకు ఆత్మహత్యే శరణ్యం అనిపించి ఆత్మహత్య చేసుకుందామని రైల్వే ట్రాక్ మీద నడుస్తున్న ఆ బాధలో నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు రైలు వచ్చే సమయానికి ఒక లేడీ పక్కకు లాగింది నిజానికి ఆమె లేడీ కాదు ఇజ్రా నా అవతారం, బట్టలు పరిస్థితిని చూసి ఏం జరిగి ఉంటుందో అర్థమవుతుంది ఇంత చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవాలి అని అడిగింది.


అవును శీలమే పోయినప్పుడు ఈ జీవితం ఎందుకు మరి??.


నీలాంటి అనా ఆలోచన పని చాలా తప్పు???


నిజానికి దేశంలో రోజు ఎంతోమంది మహిళలు అత్యాచారానికి గురి అవుతున్నారు దానికే ఆత్మహత్య పరిష్కారమైతే ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్యలే ఉండేవి, ఇలాంటి టైమ్ లోనే మనోనిబ్బరంతో ధైర్యంకూడగట్టుకొనీ జీవితంలో ముందుకు సాగాలీ అనింది తన మాటలు కొంచెం ధైర్యం కలిగించాయి తన వెంట తీసుకు వెళ్లి డ్రెస్ తీసిఇచ్చి కొంత అమౌంట్ ఇచ్చి ట్రైన్ ఎక్కించింది అలా విశాఖపట్నం వచ్చా మొదట్లో ఆ ఆలోచన కొంచెం బాధ కలిగించింది దాంతో రాత్రంతా నా కంటికి నిద్ర పట్టేది కాదు 2 రోజుల తర్వాత కొంచెం మామూలు మనిషిని అయ్యా రీతు చాలా సార్లు అడిగేది ఏం జరిగిందో చెప్పమని నన్ను రేప్ చేశారు అనే విషయం దాచి పెట్టి పెళ్లి చేసుకోవడం కన్నా పెళ్లి చేసుకోకుండా ఉంటే సరిపోతుంది కదా పెళ్లి ఒకటే జీవితం అనుకోలేదు అందుకే పెళ్లి అయిందని అబద్ధం చెప్పాను.


ఓ పెళ్లి కాలేదా నీకు అయితే ఇంకా మంచిది నన్ను పెళ్లి చేసుకో


ఏం పెళ్లి చేసుకుని ఆదర్శ వంతుడు అనిపించుకోవాలని అంటున్నావా??


ఆదర్శ వంతుని అవ్వడం కాదు నిన్ను ప్రేమిస్తున్నాను నీతో బతకడం కోసం పెళ్లి చేసుకుంటానంటున్న మొదటిసారిగా నిన్ను చూసినప్పుడు నాకు బాగా నచ్చావు కానీ పెళ్లి అయిందని ఒక విషయం నన్ను ఆపింది తర్వాత ఏ పరిస్థితుల్లో పెళ్లి అయింది విషయం తెలిసిన తర్వాత నువ్వు నా జీవితంలోకి రావాలనుకున్న....మనకు ఒకరిని చూడగానే వీళ్లు మన జీవితంలో లేకుంటే అసలు బతకడమే వృథా అనిపించేస్తుంది మొదట నిన్ను చూడగానే అనిపించిన ఫీలింగ్.


సరే సరే శౌర్య ఒక కండిషన్ నా గురించి మొత్తం చెప్పి మీ ఇంట్లో వాళ్లని ఒప్పించు పెళ్లి చేసుకుందాం ఓకేనా...? అని చెప్పి వెళ్ళిపోయింది.


నేను ఇంటికి వచ్చి సారా గురించి ఇంట్లో వాళ్ల ముందు తెచ్చా సారా గురించి మొత్తం చెప్పి వాళ్ళు ఏం చెప్తారు అని ఎదురుచూస్తున్న ఇంతలో నాన్న నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావ్ అది నీ మనసుకు సంబంధించింది కాబట్టి నేను ఒప్పుకుంటున్నా కానీ నీవల్ల మీ చెల్లి వివాహం నేను ఎలా చేయాలి మీ కొడుకు ఇలా చేశాడని బంధువులందరూ హేళనగా చూస్తారు అప్పుడు తనకి ఎలా పెళ్లి అవుతుంది తన జీవితం నాశనం అయిపోయినట్టే కదా??.


ఒకటి చెప్పు నాన్న తను మన ఇంట్లోకి రావడానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా??.


అయినా శౌర్య ఆ అమ్మాయి విషయంలో ఉన్నతంగా ఆదర్శవంతంగా ఆలోచించావు తనతో జీవితం పంచుకున్నది నువ్వే అలాంటిది నీకు ఎలాంటి ఇబ్బందులు లేనప్పుడు మాకు ఏమి ఉంటాయి కానీ మీ చెల్లి విషయమే ఆలోచిస్తున్నా.


ఇందులో ఆదర్శం ఏమి లేదు నాన్న మొదటిసారి చూసినప్పుడు తను నాకు నచ్చింది ఇంకా చెల్లి పెళ్లి విషయం అంటారా వదిలేయండి తన మతం, ఆచారాల గురించి ఎలాంటి పట్టింపులు లేవు కదా? చెల్లి పెళ్లి జరిగిన తరువాత వివాహం చేసుకుంటాను.


అలా అయితే మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు.


నా ఫ్యామిలీ మెంబర్స్ సార తో వివాహానికి ఒప్పుకునే సరికి సారాను PG నుండి ఇంటికి షిఫ్ట్ చేశా దాంతో మా ఇద్దరి మధ్య బంధం బలపడింది సంవత్సరం తర్వాత రీతు మ్యారేజ్ కావడంతో నేను కూడా సారాన్ని వివాహం చేసుకున్నాను 2 సంవత్సరాల తర్వాత బాబు పుట్టాడు అప్పుడు నాకు డౌట్ వచ్చింది వీడికి పెళ్లి చేయడానికి మా కాస్ట్ లో అమ్మాయిని ఇస్తారా అని ?? తర్వాత మనసులో నాకు దొరికిన విధంగా వాడికి ఏదో ఒక విధంగా దొరికిందిలే.



Rate this content
Log in

More telugu story from Abhi Ram

Similar telugu story from Romance