vishnu priya chiruvella

Fantasy Thriller

4.1  

vishnu priya chiruvella

Fantasy Thriller

జిన్ ప్రపంచం _1

జిన్ ప్రపంచం _1

3 mins
358


హవిష్ ప్రియంవద కన్స్ట్రక్షన్స్ MD., చాలా డబ్బు పిచ్చి ఉన్నోడు.

అతనికి ఎదురు నిలిచి ఎవ్వరూ కూడా ముంబైలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చెయ్యలేరు. అతని మాటే శాసనం. ఏదైనా ప్రాజెక్ట్ వీళ్లు చెయ్యాలి అంటే వాళ్లే చేసి తీరాలి, వేరే ఎవ్వరైనా చేస్తే వాళ్ల ప్రాణాలు తీయటానికైనా వెనకాడని వాడు. హవిష్ కంపెనీకి ఒక పెద్ద ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చింది. దానికోసం మొహర్ కంపెనీ మరియు హవిష్ ఎంతో కాలంగా పోటీ పడుతున్నారు.


 హవిష్ ఆ ప్రాజెక్ట్ దక్కించుకోవటం కోసం ఒక ప్రాణం తీయటం ఎందుకని అన్నీ విధాలుగా మొహర్ కి ఆశ చూపించాడు కానీ మొహర్ మాత్రం ఆ ప్రాజెక్ట్ ని వదులుకునే పరిస్థితుల్లో లేడు.హవిష్ తను అనుకున్నది జరగకపోతే ఎదుటివారు అతనిలోని క్రూరమృగాన్ని చూడవలసి వస్తుంది.


ఆ కోపంతో హవిష్ మొహర్ని కిడ్నాప్ చేయించాడు. హవిష్ మంచి ముసుగులో ఉన్న రాక్షసుడు. అతనికి ఎదురు తిరిగిన వాళ్ళని మట్టుబెట్టి నామరుపాలు లేకుండా చేసెయ్యగలడు. అలానే మొహర్ని నామరుపాలు లేకుండా, అతని ఐడెంటిటీ అన్నదే లేకుండా చేసి అతనికి కావాల్సిన ప్రాజెక్ట్ సంపాదించుకున్నాడు.


అప్పుడే ఆఫీస్కి వచ్చిన హవిష్ని చూసి తన ఎంప్లాయిస్ అంతా లేచి నిలబడి విష్ చేశారు. మీతో నాకు సంబంధంలేదన్నట్టు తన పాటికి తను తన కేబిన్కి వెళ్లి కూర్చుంటాడు.


కేబిన్ లో కూర్చున్న హవిష్ రీమా కి కాల్ చేసి తన కాబిన్ కి రమ్మంటాడు.


రీమా హవిష్ గర్ల్ ఫ్రెండ్. అదికూడా ఎందుకంటే రీమా హవిష్ ఎన్ని తిట్టినా, అవమానించినా హవిష్ కాలికింద పడి వుండే ఓపిక అండ్ సిగ్గులేనితనం భూమిమీద కేవలం రీమాకి మాత్రమే ఉంది అని తనని గర్ల్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తాడు. మోస్ట్ హెడ్ వెయిట్ పర్సనాలిటీ అండ్ ఇగోఇస్ట్ అని హీరో హవిష్ ని చెప్పవచ్చు .


హవిష్ రీమా వచ్చాక కాళ్ళునొప్పిగా వున్నాయి పట్టమని అంటాడు. రీమా అలాగే చేస్తుంది. రీమాకి హవిష్ ట్రీట్ చేసే విధానానికి చాలా కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుని తన ప్లాన్ పూర్తయ్యేదాకా భరించక తప్పదు అని హవిష్ కాళ్ళు పడుతుంది.


ఇన్ని గొప్ప విశేషాలున్న హవిష్ కి ఒక మెంటల్ ఇల్నెస్ కూడా ఉంది అదే క్లెప్టోమేనియా. అతనికి చిన్నప్పటినుంచి డబ్బు మీద అమితమైన ఇష్టం ఉండటం వల్ల ఎవరి వాలెట్ కనిపించినా క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు కనిపించినా అతని పనితనం చూపిస్తాడు. అది కంట్రోల్ చెయ్యటానికి హవిష్ పేరెంట్స్ ప్రియంవద, జానకి రామ్ గార్లు ఎన్ని హాస్పిటల్స్లో చూపించినా ఎటువంటి ఉపయోగం లేకపోయింది.


ప్రియం వద కన్స్ట్రక్షన్స్ కంపెనీలో ఒక స్పెషల్ రూల్ ఉంది, అదేంటంటే ఆ ఆఫీస్లో పని చేసే ఏ ఒక్కరూ వాళ్ళ వాలెట్స్ తీసుకురాకూడదు., వాలెట్స్ ఆఫీస్ బయటనే వదిలి రావాలి. షాపింగ్ మాల్స్ లో లగేజ్ పెట్టడానికి బయట కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ఆ కంపెనీ లో ఎంప్లాయిస్ వాలెట్స్ భద్రపరచడం కోసమని ఏర్పాటు చేశారు.

(క్లెప్టోమేనియా అంటే అవసరం ఉన్నా లేకపోయినా ఒక వస్తువు నచ్చితే వాళ్ళు దాన్ని దొంగిలించకుండా ఉండలేకపోవటం.)






హీరోయిన్ ఇంట్రో ఇవ్వాలి అంటే హీరోయిన్ ఫాదర్ గురించి ఇంట్రో ఇవ్వాలి.

హీరోయిన్ ఫాదర్ గురించి ఇంట్రో ఇవ్వాలి అంటే జిన్ ప్రపంచం ఇంట్రో ఇవ్వాలి.

జిన్ ప్రపంచం ఇంట్రో ఇవ్వాలంటే చాటర్ బాక్స్ జిన్ రావాలి.


సాధారణంగా జిన్లు రెండురకాలు మంచి జీనీలు చెడ్డ జీనీలు.


ఆ రెండు రకాల జీనీల కోసం రెండు ప్రపంచాలుంటాయి.


ప్రతీ మంచి చెడు జినీలలో మళ్ళీ నాలుగు రకాల జీనీలుంటాయి. భూతం జినీ, గాల్లో ఎగిరే జీనీలు, మనిషి రూపంలో, రాక్షస రూపంలో ఉన్న జీనీలు.


మంచి జినీ ప్రపంచంలోకి, చెడు జీనీ ప్రపంచంలోకి రెండు ప్రపంచాలకి వెళ్ళగలిగే ఏకైక జీనీ చాటర్ బాక్స్ జీనీ.


మనకి నారదుడు ఎలా ఐతే అన్నిలోకాలు చుట్టి రాగలడో జిన్ ప్రపంచాలు రెండింటిని అండ్ భూమిని కూడా చుట్టి రాగల ఏకైక జిన్ చాటర్ బాక్స్ జిన్.

చాటర్ బాక్స్ జిన్ జిన్ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు.


వెల్కమ్ టు జిన్ వరల్డ్ ::

జిన్ ప్రపంచం భూమి కింద ఉన్న జిన్ లోకంలో ఉంటుంది.

అందరికన్నా ముందు గాడ్ జిన్ జుబైర్ మొట్టమొదటి జిన్ గా పరిగణించబడ్డాడు. ప్రతీ జిన్ మంచిదైనా, చెడ్డదైనా గాడ్ జుబైర్ ఆదేశాలని పాటించాల్సిందే.

గాడ్ జిన్ జుబైర్ అందరి గాడ్ లలా కాదు జనరల్ గా గాడ్ అంటే మంచి కోరినా, చెడు కోరినా మంచే చేస్తారు.

కానీ గాడ్ జిన్ మాత్రం మంచి కోరితే మంచి చేస్తాడు, చెడు కోరితే చెడు చేస్తాడు.

విషయమంతా ముందు ఎవరు కోరుకుంటారు అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది.



జిన్ ప్రపంచంలో రెండు జిన్ ప్రపంచలున్నాయి ఒకటి జెహర్స్ వరల్డ్

ఇంకోటి దివాస్ వరల్డ్


మొట్టమొదటిగా మనం జెహర్ కింగ్ గురించి చెప్పుకోవాలి.


జెహర్స్ వరల్డ్ :::

చెడు జిన్ ప్రపంచం మహారాజు జెహర్, మహారాణి నైనా.


నైనా ఒక సాధారణ భూలోకవాసి. పేదరికం వల్ల చాలా కష్టాలు పడి జిన్ గాడ్ జుబైర్ని ప్రసన్నం చేసుకుని జిన్ కింగ్ ఐన జెహర్ ని పెళ్లి చేసుకునేందుకు వరం పొందింది.


నైనాకి జిన్ గాడ్ గురించి జిన్ వరల్డ్ గురించి ఎలా తెలిసిందనేది నైనా వచ్చినప్పుడు తెలుస్తుంది.


గాడ్ జుబైర్ ఆదేశం మేరకు కింగ్ జెహర్ నైనాని పెళ్లి చేసుకుంటాడు. గాడ్ మాట వినకుంటే తనకి తన ప్రపంచంలో స్థానం ఉండదు అని బలవంతంగా నైనాని పెళ్లి చేసుకుంటాడు జెహర్ .

సాధారణంగా జెహర్ చెడు జిన్ అవ్వడంవల్ల భార్యని ప్రేమించలేకపోతాడు.


ఫుల్ మూన్ రోజు జెహర్ మరియు నైనాలకు ట్విన్స్ పుడతారు. ఒక అబ్బాయి ఖతిర్, ఒక అమ్మాయి దివా.


ఖతిర్ లక్షణాలు అన్నీ జిన్ లానే ఉండటం, అతని వ్యక్తిత్వం తండ్రి జెహర్కి దగ్గరగా ఉండటం వల్ల జెహర్కి తన సుపుత్రుడు ఎక్కడ అతని కింగ్ స్థానాన్ని కొట్టేస్తాడని అసూయ కలిగింది.కన్న కొడుక్కే రాజరికం దక్కితే తట్టుకోలేని క్రూరుడు జెహర్.


దానికోసం జెహర్ తన శక్తులని పెంచుకోవటానికి సాధారణ మనిషిని అంతంచేసి జిన్గా మార్చి తనలో కలుపుకుని తన శక్తిని పెంచుకోవాలి, ఖతిర్ని తనకన్నా ఎదిగిపోకుండా రాజు కాకుండా నేనే జిన్ కింగ్ గా ఎప్పటికి ఉండాలి అని అనుకున్నాడు.


అందుకోసం ఒక మనిషిని జిన్ గాడ్ జుబైర్ కి బలి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి భార్య నైనాను జిన్ గాడ్కి బలి ఇస్తాడు . తద్వారా నైనా ఒక జిన్ గా మారి కింగ్ జెహర్ లో కలిసిపోతుంది. ఇప్పుడు జెహర్ నైనా ఇద్దరూ ఒకరే.

ఈ విధంగా నైనాతో కలిపి లక్షా పద్నాలుగువేల ఆత్మల్ని తన ఆదీనంలో పెట్టుకుని అతని దగ్గర ఉన్న బంగారు దీపాలలో బంధించి పెట్టాడు. ఏ దీపంలో ఎవరి ఆత్మ ఉందో , అది ఏ పనులను సాధించాడానికి ఉపయోగపడుతుందో కేవలం కింగ్ జెహర్ కు మాత్రమే తెలుసు. అతని అవసరానికి తగ్గట్టు కావలసిన జిన్ ని దీపం నుంచి విడుదల చేసి అవసరం తీరాక మళ్ళీ అదే దీపంలో బంధించేస్తాడు.



కొనసాగుతుంది..







Rate this content
Log in

Similar telugu story from Fantasy