Dinakar Reddy

Comedy Drama

3  

Dinakar Reddy

Comedy Drama

కల కాదు కదా..

కల కాదు కదా..

1 min
2


అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ప్రవాస్ క్లాసులోకి రాగానే పిల్లలు లేచి నిలబడి నమస్కారం చేసారు.


ఇంత వినయం వీరికెక్కడ నుంచి వచ్చిందో అని ఆశ్చర్యపోయి బోర్డు వైపు తిరిగి పాఠం చెప్పడం మొదలు పెట్టాడు. మామూలుగా తను వెనక్కు తిరగ్గానే గోలగోలగా మాట్లాడుకునే పిల్లలు ఇవాళ ఇంత శ్రద్ధగా పాఠం వింటున్నారు.


ప్రవాస్ ఆనందానికి అంతులేదు. తనకు ఈ యేడు ఉత్తమ ఉపాధ్యాయ బిరుదు వచ్చినంత సంబరపడ్డాడు.


ఆ ఆనందంలో అడుగు ముందుకేయబోయి కింద పడ్డాడు. కళ్ళు తెరిచి చూస్తే తను కుర్చీలోంచి పక్కకు పడ్డానని అర్థమైంది. పిల్లలెప్పుడో బయటికి వెళ్లిపోయినట్లున్నారు.


ఖాళీ గోడలకు పాఠం చెప్పడం కన్నా ఇలా కుర్చీలో కూర్చొని నిద్రపోవడం మంచిదని అనుకున్నాడు ప్రవాస్.


అతని కల తొందరగా నిజమైతే బాగుణ్ణు అని అనుకున్నాయి ఆ క్లాసు గోడలు.


Rate this content
Log in

Similar telugu story from Comedy