ranganadh sudarshanam

Comedy Drama Inspirational

3.9  

ranganadh sudarshanam

Comedy Drama Inspirational

పులిహోర జీవితం

పులిహోర జీవితం

7 mins
36.5K


పులిహోర జీవితం(హాస్య కథ) ..................................... మూర్తి కి ముప్పై ఐదేళ్లు వస్తున్నాయి,ఇంకా పెళ్లి కాలేదని తల్లికి ఒకటే దిగులు. అలా అని మూర్తే మి.. అనాకారి కాడు, గవర్నమెంట్ ఉద్యోగం మంచి జీతం,మంచి నడవడిక, కానీ మనిషికి చాదస్తం పాలు కాస్తా ఎక్కువ, ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూసేగుణం,దాని కారంరణంగానే వచ్చిన సంబంధాలన్ని చిట్లిపోతున్నాయి. ఈ రోజు ఇరవై తొమ్మిదొవ పెళ్లి చూపులు, ఇదైనా ముడిపడేలా చూడమని మూర్తి తల్లి మొక్కని దేవుడు కట్టని ముడుపు లేదు. ఈ సారి మూర్తి కూడా కాస్తా మెత్త బడ్డాడు...తల్లి మేనమామ మూర్తిని నోరెత్త వద్దని గట్టిగా గడ్డి పెట్టడంతో పాటు ,కాస్త దూరపు బంధుత్వం కావడం, తాననుకున్నట్లు పెద్దగా చదువు సంధ్య లేని పల్లెటూరి  అమ్మాయి కావటంతో మూర్తి కూడా సరే నన్నాడు. మూర్తికి వాళ్లు, వీళ్లు చెప్పిన మాటలు విని, చెత్త చెదారం చదివి, పనికిరాని సీరియళ్లలో..అడోళ్ల పెత్తనాలు చూసి... పెళ్ళెంటే భయం పట్టింది..అమ్మో భార్య... అనే ఫీలింగ్ వచ్చింది.అందుకే ఓ పల్లెటూరి బైతు..పనికిరాని మొద్దును పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు చూసింది.. అలాంటి సంబంధమే కావటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు మూర్తి. అమ్మాయి..అందరికి టీ లు అందిoచింది. అమ్మాయిని చూడగానే మూర్తి ఫ్లాట్ అయిపోయాడు,చక్కని కుందనపు బొమ్మ లక్ష్మీ ,తెల్లని మేని ఛాయా,చక్కటి ముఖ వర్ఛస్సు, పెద్ద జడ..ఈ కాలం పిల్లల్లా కాక చక్కగా పాపిట తీసి నూనె రాసి దువ్విన జుట్టు,తలనిండా మల్లెపూలు,ముచ్చటగా కాటుక దిద్దిన చారేడిసి కళ్లు, తిలకంతో దిద్దిన అర్ధరూపాయి బిళ్ళంత బొట్టు,బుగ్గలకు గంధం,పసుపు రాసిన పాదాలు, ఘల్లు ఘల్లున మ్రోగే కాళ్లకు పెట్టిన గజ్జల పట్టీలు,పట్టు పరికిణి పై వేసుకున్న పొడవు చేతుల జాకెట్,ఒళ్ళు కనపడకుండా వేసిన వోణి తో.. బిగుసుకుపోయి అచ్చం పల్లె ముద్దబంతిలా, ముగ్ధ మనోహరంగా ఉంది లక్ష్మీ. "బాబు అమ్మాయిని ఏమైనా అడగాలనుకుoటే అడగండి" అన్నాడు అమ్మాయి తండ్రి.. మూర్తి తల్లి..మేనమామ హడలిపోయి "అడిగేది ఏమి లేదు అన్నారు ముక్త కంఠంతో" అవకాశం ఇస్తే మూర్తి అడిగే ప్రశ్నలకు ఈ సంబంధం కూడా చిట్లిపోవడం ఖాయం అనే భయంతో. కానీ అప్పటి దాకా అణిగివున్న అసలు మూర్తి బైటికి వచ్చాడు..ఇంకా అంతే ఎవరు చెప్పిన వినడని.. తల్లికి అర్ధమైంది..ఇక ఈ సంబంధం కూడా కృష్ణార్పణం అనుకోని తల పట్టుకుంది. మూర్తి కాలు పస పసమని తొక్కింది తల్లి.. ఎంత తొక్కినా ఒకపట్టాన వినాడే... పూనకం వచ్చినవాడిలా ..మూర్తి గొంతు సవరించుకొని తన ప్రశ్నలు మొదలు పెట్టాడు. ఈ సంబంధం కూడా గోవిందా.. గోవిందా అను కున్నాడు మేనమామ. మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా? అన్నాడు మూర్తి గంభీరంగా. అంటే ఏంటoటా.... అని అమాయకంగా ముఖం పెట్టింది లక్ష్మీ ..తనకు అలాంటిదేమి తెలియనట్లు... హమ్మయ్య అనుకొని... "గుడ్" అన్నాడు మూర్తి. "మీకు వాట్సాప్ చాటింగ్ తెలుసా"..? అడిగాడు మూర్తి. అదేంటబ్బా అన్నట్లు మొఖం పెట్టి.."ఎప్పుడు వినలేదండి" అంది లక్ష్మి.. కళ్ళు టప టప లాడిస్తూ. "మీకు టీవి లో ఏ సీరియల్ అంటే ఇష్టం.. ? దానిని బట్టి ఆమె స్వభావాన్ని తెలులుకోవాలని మూర్తి ఆరాటం. "శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్...NTV భక్తి చానల్ అప్పుడప్పుడు పాత సినిమాలు మాత్రమే చూస్తానండి" అంది లక్ష్మి. మూర్తికి మహదానందమేసింది. "పిజ్జాలు..బర్గర్లు ఎప్పుడైనా తిన్నావా అడిగాడు మూర్తి. దీనిద్వారా బజార్లకు వెళ్లే అలవాటు ఉందా లేదా అని తెలుసుకోవాలన్నది మూర్తి ఆలోచన. "ఏంటో... అలాంటి పేర్లేవి తెలియవoడి అవి పళ్లా.. కాయల.. స్వీట్సా" అంది లక్ష్మీ అయోమయంగా.. మూర్తికి ఎగిరి గంతేయలనిపించినా.. బాగుండదని బలవంతంగా ఆపుకున్నాడు. "నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? లాగి లెంపకాయ కొట్టాలనిపించింది లక్ష్మికి కానీ అంతలోనే సర్దుకొని "ఆ..ఆ...ఉన్నారండిఎదురింటి రెండో తరగతి బుజ్జిగాడు,పక్కింటి నాలుగోతరగతి చంటిగాడు వున్నారు" అని నాలుక కరుచు కుంది లక్ష్మి సిగ్గుపడుతూ.. మూర్తి తృప్తిగా లేచి నిలబడి తనకు అన్నివిధాల నచ్చిన సంబంధం దొరికినందుకు చాలా సంతోషపడ్డాడు... ఈ సంభందం నాకు డబుల్ ఒకే.. అన్నాడు మూర్తి.. ఆనందంగా. కానీ....ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఏ క్రోకడయిల్ ఫెస్టివల్ అని మూర్తికి తెలియదుగా.. పాపం. మూర్తి తల్లి, బంధువులంతా ముసిముసిగా నవ్వుకున్నారు మూర్తిని చూసి. మొత్తానికి అందరికి నచ్చడాలు..నిశ్చయ తాంబూళాలు, పెళ్లి అన్ని చక చక  జరిగి పోయాయి. మూర్తి తల్లి మొక్కులు చెల్లించుకోవడానికి తీర్థయాత్రలకు వెళ్ళివస్తానని.. బయలు దేరింది. కొత్త సంసారం..కొత్త కాపురం .. సౌందర్యరాసి లాంటి భార్య అందునా కోరినా దొరకని ఏకాంతం..దొరికినందుకు ఉప్పొంగిపోయాడు మూర్తి. పాపం ఇప్పుడే కథ లో..యుద్ధకాండ ప్రారంభం అవుతుందని తెలియని పూర్ మూర్తి. "లక్ష్మి ..లక్ష్మి..." అంటూ బైక్ స్టాండ్ వేసి హెల్మెట్ తీసి వాకిట్లో నుంచున్నాడు మూర్తి "ఆ..ఇదిగో వస్తున్నానండి" అంటూ మెష్ డోర్ తీసి బైటికి వచ్చి బైక్ కు తగిలించి ఉన్న సరుకుల సంచిని తీసుకుంది లక్ష్మి. "అన్నట్టు.. నువ్వు చెప్పిన సరుకులన్ని ఉన్నాయేమో చూసుకో" అంటూ బాత్ రూంలోకి వెళ్ళాడు మూర్తి. "ఆ..ఆ..అలాగే నండి" అంది లక్ష్మీ సంచిని తీసుకుంటూ.. బాత్రూమ్ లెట్రిన్ పరిస్థితి చూసి చిర్రెత్తిన మూర్తి కోపంగా "లక్ష్మీ "...అంటూ గట్టిగా అరిచాడు..."నేకేం చెప్పాను టాయిలెట్..బాత్ రూమ్ క్లిన్ చేయమని చెప్పానా..లేదా...ఏంటీ దరిద్రం "అంటూ గట్టిగా అరుస్తూ ముఖం చిట్లించాడు మూర్తి. ఆ అరుపుకు పరుగున వచ్చిన లక్ష్మీ .. "ఏమైందండి అంది". అమాయాకంగా ముఖం పెట్టి "ఏంటా..చూడు టాయిలెట్ బాత్ రూమ్ ఎలా తగలడ్డాయో".. అంటూ లక్ష్మి చేయి పట్టి లాగి చూపించాడు మూర్తి. "ఒక్క నిముషమండి" అంటూ.. నింపాదిగా ఇంట్లోకి వెళ్లి చేతిలో హార్పిక్ బాటిల్ టాయిలెట్ క్లినర్ తో ప్రత్యక్షమైంది లక్ష్మి. తన బెదిరింపుకు భయపడి దారిలోకి వచ్చినందుకు..తన మాటమీద ఉన్న గౌరవానికి లోలోన సాంతోషిస్తూ.. "ఊ.. కానియ్" అన్నాడు హుకూమ్ జారీ చేస్తూ..మూర్తి "అదికాదండి..... ఇది హార్పిక్ అంది లక్ష్మి" అమాయకంగా మొఖం పెట్టి "అవును అది హార్పిక్, ఇది క్లీనర్ ,అవి నీళ్లు చాలా.. అలా గుడ్లప్పగించకుండా శుభ్రం చేయి" అన్నాడు మూర్తి కోపంగా "మరే నండి.. ఇది టీవీలో మొగబ్బాయి అబ్బాస్ వాడి చూపించాడు..అంటే ఇది మొగవాళ్ళు చేసేదండి పైగా వెంకటేష్ గారు కూడా మోగాళ్లే ఈ పని చేయాలని చెప్పారు టీవీ లో మీరు చూశారుగా" . అంది లక్ష్మీ అమాయకంగా "ఓహో మంచి ప్లాను మేదే ఉన్నవన్న మాట అందుకేనా హార్పిక్ తేoడి...., హార్పిక్ తేండి... అని నొక్కి నొక్కి చెప్పింది...హమ్మ ...హమ్మ.. ఎంత గుండెలు తీసిన బంటువే " అన్నాడు మూర్తి ఆవేశంగా.. "అయ్యోరామ.. నాకేం తెలుసండి ఆ టీవి వాళ్ళు అలాగే చెప్పారుగా" అంది ఏడుపు మోఖం పెట్టి లక్ష్మీ. "చాల్లే ...ముందా ఆ ఏడుపు ఆపి తగలడు" అన్నాడు మూర్తి. "అది కాదండి,త్వరగా కానివ్వండి టాయిలెట్ కoపు కొడుతుందని ,ప్రొద్దుట నుండి నేను ఆ పని కానివ్వలేదు..మీరెప్పుడొస్తారా ఎప్పుడు శుభ్రం చేస్తారా..ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఎదురు చూస్తున్నానండి" అంది లక్ష్మీ కడుపు నొక్కుకుంటూ... "ఛీ.. ఛీ... అప్పటినుండి వచ్చే దుర్వాసన నీ దగ్గర్నుండా...వాక్..వాక్.. "అంటూ టాయిలెట్ గబ గబా క్లిన్ చేసాడు మూర్తి. అలా చేసి చేయగానే అందులో దూరింది లక్ష్మి "హమ్మయ్య లక్ష రూపాయలు దొరికినట్లుందండి.. ప్రాణానికి ఎంత హాయిగా ఉందొ" అంటూ ప్రశాంత వదనంతో ఇంట్లోకి వచ్చింది లక్ష్మీ. "చాల్లే సంబడం..దీనికేమి తక్కువలేదు,ఇoతకు ఏమైనా చేశావ తినడానికి లేదా అన్నాడు మూర్తి.. "ఆ..ఆ.. చక్కగా.. వెరైటీగా పులిహోర చేశానండి" అంది లక్ష్మి ఉత్సాహంగా.. పులిహోర... రుచి తలుచుకోగానే నోట్లో నీళ్లు ఊరాయి మూర్తికి. "అబ్బా .....ఆకలి దంచేస్తుంది.. ఏది త్వరగా పెట్టు" అన్నాడు మూర్తి. "మరి నువ్వు తిన్నావా అన్నాడు మూర్తి"...లక్ష్మీతో "లేదండి భర్త భోంచేసిన కంచంలో తినాలని మా అమ్మ చెప్పింది...అందుకే తినలేదండి" అంది లక్ష్మి పతిభక్తితో పరవశిస్తూ... "అది ధట్స్..గుడ్...అలావుండాలి భార్యంటే... గుడ్ లక్.."అంటూ ఏది పులిహోర అన్నాడు..మూర్తి. పులిహోర చూడగానే "ఇదేంటే నీ బొంద ఇలా తగలడింది ...వెరైటి..వెరైటీ అన్నావుగా ఏం...తగలేసావే ఇందులో నీయమ్మా...కడుపు మాడ" అన్నాడు మూర్తి కోపంగా. "మరేనండి..... నిమ్మకాయకు బదులు వంద నిమ్మకాయల శక్తి ఉంటుందని వీల్ పౌడర్, కొద్దిగా విం..అదేనండి అంట్లు రుద్దే సోప్ కొద్దిగా వేసాను,పసుపు చందనం గుణాల కలయిక సంతూర్ అంటారుగా అందుకే కొంచం సబ్బుముక్క వేసాను, మీ టూత్ పేస్టులో ఉప్పుoదా.. అంటారుగా అందుకే ఉప్పు బదులు కాల్గెట్ టూత్ పేస్ట్ వేసాను, ఘాటుకోసం కాస్త డాబార్ రెడ్ పౌడర్ వాడాను".... ఇంకా..మాట పూర్తి కాకుండానే... "నీ బొంద... నీ బొక్కలు... నీయమ్మ, మనుషులను చంపడానికి పుట్టావటే... ఎదో పల్లెటూరి పిల్ల చదువు తక్కువైతే చెప్పినట్లు వింటుందని వెతికి వెతికి చేసుకుంటే..నా కొంప ముంచావు కదే,నా జీవితం నాశనం చేసావు కదే", అంటూ పులిహోర కంచాన్ని విసిరి కొట్టి ఒంటిమీది గుడ్డలు చింపుకొని,జుట్టు పీక్కుంటు.."ఒరేయ్ మూర్తి నీకు తగిన శాస్తి జరిగిందరా"... అంటూ పెళ్ళు పెళ్ళున చెంపలు వాయించుకున్నాడు,పక్కనే ఉన్న చెప్పు తీసుకొని టపా టపా మని కొట్టు కున్నాడు మూర్తి ఆవేశంగా.. "ఇంకానయం ఉగాది పచ్చడిలో మార్గో సబ్బు,మ్యాంగో,ట్యామ్రిండ్.. చాక్లేట్లు....టీ పెట్టమంటే తబలా..వాయిoచండి..వాహ్... తాజ్ అనండి అని,  థ మ్ సప్ కోసం నన్ను సముద్రంలో దూకమని... వామ్మో..వామ్మో నువ్వెక్కడ దొరికావే...నా ప్రాణానికి"... హమ్మ హామ్మ..అంటూ ఆయాసపడ్డాడు మూర్తి. "ఏవండి...ఇదిగో ఇప్పుడే చెపుతున్నా నన్ను ఇబ్బంది పెట్టారో ?...జాగ్రత్త నేను డైరెక్టుగా..టీవీలో వచ్చే..రోజాగారి రచ్చబండకో,జీవిత గారి బ్రతుకు జట్కాబండికో,సుమలత గారి సంసారం ఒక చదరంగం కో మిమ్ములను ఈడుస్తాను...ఆట్టే..నా సంగతి తెలియదు మీకు, నాకు గాని తిక్కరేగిందో.. మీ బతుకు బస్టాండ్ అవుతుంది జాగ్రత్త..జాగ్రత్త" అని వేలు చూపించుకుంటూ .. ఏడుస్తూ..ఉన్నపళాన వెళ్లి పోయింది లక్ష్మి. ఇంతలో ఇంట్లోకి వచ్చిన మూర్తి తల్లి పరిస్థితి చూసి ,"ఏంట్రా పిచ్చి మూర్తి ఏం జరిగిందిరా నాన అంది". తల్లిని చూడగానే తన్నుకొచ్చిన దుఃఖoతో...తల్లి వడిలో తలపెట్టి జరిగినదంతా చెప్పి బోరు బోరున వెక్కిళ్లు పెట్టి ఏడ్చాడు మూర్తి. "అమ్మా... నా జీవితం నాశనం అయింది..ఆ చాదస్తపుది నాకెక్కడ దాపురించిందే, ఓ చదువు లేదు, సంధ్య లేదు, మచ్చుకైనా .. సంస్కారం లేదు..ఏదేదో.. ఊహించి బ్రతుకు నాశనం చేసుకున్నానే..నువ్వెంత చెప్పినా వినకుండా ఇలా చేసినందుకు, ఆ దేవుడు..ఆదేవుడు.. నాకు తగిన గుణపాఠం చెప్పడే".. అంటూ బ్యార్ మన్నాడు మూర్తి. తల్లి చిరు నవ్వు నవ్వి.."ఓరి నా వెర్రి నాగన్న అమ్మ ఉండగా అలా జరుగనిస్తుందా.. నాన, నీకు గుణపాఠం నేర్పాలనే,లక్ష్మీ అలా చేసింది,అనవసరమైన విషయాలు బుర్రలో పెట్టుకొని, పెళ్ళాం చదువుకుంటే మాట వినదని,సీరియళ్లు చూస్తే చెడిపోతుందని, భర్తను లెక్కచేయదని, ఎవరో చెప్పిన మాటలు నమ్మావురా..అందుకే నీకు తెలిసొచ్చేలా చేయడానికే మేమంతా ఈ కథ నడిపాము". "నీ మంచితనం..నీ అమాయకత్వం నీ పద్దతులన్ని చెప్పి లక్ష్మిని పెళ్లికి ముందే ఒప్పించాము,నీ తిక్క ప్రశ్నల సంగతి, నీ అతి చాదస్తాన్ని కూడా ముందే చెప్పామురా,అన్ని తెలిసే లక్ష్మి ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకుందిరా..నా కోడలు లక్ష్మి... మహా లక్ష్మీరా...అది పల్లెటూరులో పుట్టినా చదువుల తల్లిరా...గ్రూప్ టూ..లో టాపార్ రా అది, రేపో ....మాపో దానికి మంచి ఉద్యోగం కూడా రాబోతుందిరా .. అది పల్లెటూరిదే కానీ, తెలివితక్కువది కాదురా..సీరియళ్లు చూస్తుంది కాని, వాటిలో ఏది మంచో ఏది చేడో తెలియని అమాయకురాలు కాదురా"... "అదిగో చూడు నిన్ను చూసి ఎలా నవ్వుతుందో".. అంది అమ్మ నవ్వుతూ... గోడ వారుగా నిలబడిన లక్ష్మిని చూసి మూర్తి ఆశ్చర్య పోయాడు...చక్కగా ముస్తాబైన లక్ష్మి అచ్చం లక్ష్మీ దేవిలా ఉంది. గోడకు ఆనుకొని ఒక కాలు గోడకు ఆనించి ఒక కాలిపై గోడకు చేర వాలి నిలబడిoది.. బంగారు రంగు పట్టీలు వ్రేలాడే గోరింటాకు పండిన పాదాలు మలి సంధ్య మందారాల్లా కనిపిస్తున్నాయి, రెండు వ్రేళ్లకు పెట్టిన సన్నని గజ్జల మెట్టెలు ..గోళ్లకు వేసిన నెయిల్ పాలీష్..అబ్బా లక్ష్మి బాపు బొమ్మలా తళుక్కున మెరిసింది. ఒక్క సారి అలా తల పైకెత్తాడు మూర్తి..నెమళ్ళ బార్డర్ ఉన్న పింక్ కలర్ ఉప్పడా పట్టు సారితో, చూడ ముచ్చట గొలిపే ..చూపరులను కట్టిపడేసేలా నాజూకైనా బొట్టుతో..వదులుగా వేసిన వాలుజాడను ముందుకు వేసుకొని సుకుమారమైన వేళ్ళతో అంత కన్నా సుకుమారంగా అల్లుతూ..కవ్విస్తున్నట్లుగా ఓరగా చూసింది లక్ష్మి. మెల్లిగా లేచి రెండడుగులు వేసి లక్ష్మి కి దగ్గరగా వెళ్ళాడు మూర్తి ఉబికి వస్తున్న ఆనంద బాష్పలను..తూడ్చుకుంటూ.. "నన్ను క్షమించండి" అంటూ...వచ్చి మూర్తి బాహువుల్లో వాలిపోయింది లక్ష్మి. లక్ష్మిని అలాగే పొదవి పట్టుకొని.."అయాం.. సారి లక్ష్మి" అన్నాడు మూర్తి ఆర్ధత నిండిన గొంతకతో.. "అమ్మాయి పల్లెటూరిదైన..పట్టణానిదైన చదువున్నా లేకున్నా..ఏది మంచో ఏది చెడో తెలుసుకునే సంస్కారం ఉంటే చాలండి.. మీరనుకున్నట్లు కొంతమంది ఉండొచ్చు కానీ అందరూ అలా కాదండి...ఎంత ఓర్పు లేకుంటే తాగే భర్తలను,వ్యసన పరులైన భర్తలను,రోజు హింసించి వేధించే భర్తలను భార్యలు వదిలి వేయకుండా వారిని ఎలాగైనా మార్చాలని తపించే స్త్రీ మూర్తులె oదరో ఉన్నారండి .. అందరూ మీరనుకున్నట్లు ఉంటే సమాజం ఎప్పుడో అధోగతి పాలయ్యేది..మంచి చెడు ఎప్పుడూ పక్క పక్కనే వుంటాయండి, కానీ చెడుకు ప్రచారం ఎక్కువ, అందుకే అది అందరికి తెలుస్తుంది... మంచిని అందరూ మరచి పోతారు. మనుషులం నైజం కూడా చెడునే ఎక్కువగా మాట్లాడుకుంటారండి అదే మన దౌర్భాగ్యం" అంది లక్ష్మీ. "అవును లక్ష్మి నువ్వన్నది ముమ్మాటికీ నిజం..ఒకవైపే ఆలోచించాను తప్ప మరోవైపు చూడలేక పోయాను.. కాదు కాదు నీలా అందంగా చెప్పే వారు లేక తెలులుకోలేక పోయాను..సారి లక్ష్మి... వెరీ వెరీ సారి" అన్నాడు మూర్తి పశ్చాత్తాపం నిండిన హృదయంతో.. మెల్లగా మూర్తి నడుమును గిల్లింది లక్ష్మి చిలిపిగా..కవ్విస్తూ.. ఏయ్ దొంగా..అంటూ మెడను పంటితో నొక్కాడు మూర్తి. అమ్మా అంటూ...గట్టిగా విడిపించుకొని దూరం వెళ్ళింది లక్ష్మి. ఒరేయ్ ఆకలన్నావుగా ఇదిగో నీకోసం లక్ష్మి చేసి పక్కన పెట్టిన పులిహోర ఇది తిందువురా అంది మూర్తి తల్లి. అమ్మచేత..లక్ష్మి చేసిన పులిహోర తింటూ అబ్బా ఇంత బ్రహ్మాoడమైన పులిహోర ఎప్పుడు తినలేదంటూ.. లొట్టలేసుకుంటూ తృప్తిగా తిన్నాడు మూర్తి. "అదేరా...పెళ్ళాం బెల్లం తల్లి అల్లం అంటారందుకే..ఇన్నాళ్లు చేసిపెట్టిన అమ్మ చేదయిందిరా".. అంది అమ్మ వేళాకోళం చేస్తూ.. "ఆ మాత్రం లౌక్యం లేకుంటే..ఎలా అత్తయ్య" అంది లక్ష్మి.. నవ్వుతూ.. మూర్తి సంతోషంగా... నవ్వుకున్నాడు. ..సమాప్తం.. మీ...రంగనాధ్ ఇల్లందు..9866265630


Rate this content
Log in

Similar telugu story from Comedy