Dinakar Reddy

Drama Crime Thriller

4  

Dinakar Reddy

Drama Crime Thriller

కోటలోని యువరాణి

కోటలోని యువరాణి

1 min
617


కీర్తనా! ఆ ఊరు చివర పాడుబడిన కోటకి వెళ్ళకండి అంది వాళ్ళ నానమ్మ పిల్లలందరికీ జాగ్రత్తలు చెబుతూ.


నానమ్మా! నాకు ఇరవై దాటి మూడేళ్లయింది. ఇంకా భయపెడుతున్నావా అంది కీర్తన. రాకరాక ఊరు వచ్చి ఆ కోట గురించి ఎందుకు? అన్నాడు కీర్తన వాళ్ళ నాన్న


తన చిన్నప్పటి నుంచీ వింటోంది గంధర్వుల కోట గురించి. ఎన్నో సంవత్సరాల క్రితం మాట. రాజావారి కోటను గంధర్వులు చూశారట. ఆ కోటలోని రాజావారు వారిని శత్రువులని లోపలికి రానీయలేదు.


అది అవమానంగా భావించి గంధర్వులు ఆ రాజ్యపు యువరాణిని ఎప్పటికీ ఆ కోటలో ప్రేతంలా బతికే ఉండమని శపించారు. కూతురి శాపవిముక్తి కోసం రాజు చాలా ప్రయత్నాలు చేసి వయసు మీరి చనిపోయాడు.


ప్రేతంలా మారిన యువరాణి మణిశిఖ ఆ కోటలోకి వెళ్ళిన వారిని తనకు శాపవిమోచనం కలిగించమని అడుగుతుందట. అది సాధ్యం కాదు కాబట్టి వారిని అంతం చేసి తనకు బాటు తోడుగా చేసుకుంటుందని ఆ ఊరిలో అందరూ చెబుతారు.


కీర్తనకు ఆ కోట లోపలికి వెళ్ళాలి అనిపించింది. తను అందరూ నిద్రపోయాక బయటికి వచ్చింది. స్కూటీ తీసుకుని కోట వైపు వెళ్ళింది.


చల్లటి గాలి ఆమె వెనుక నుంచి కొడుతోంది. ఆమె కోటకు చేరువయ్యింది. ఆగు అనే గొంతు వినిపించడంతో ఆమె వెనక్కు తిరిగింది.


అక్కడ నానమ్మ ఉంది. కీర్తన భయంతో వణికిపోతూ అదీ అదీ అంటూ కింద పడిపోయింది.



Rate this content
Log in

Similar telugu story from Drama