Dinakar Reddy

Comedy Drama

2.7  

Dinakar Reddy

Comedy Drama

మా వీరేశంగాడి ఇడ్లీ పురాణం

మా వీరేశంగాడి ఇడ్లీ పురాణం

1 min
219


ఏమైనా ఇడ్లీని చాలా తక్కువ అంచనా వేశాన్రా అన్నాడు వీరేశం. ఏమైందిరా అని అడిగాను మా వాణ్ణి సోది చెబుతాడని తెలిసినా.

వీరేశం నేనూ చిన్నప్పట్నుంచీ సావాసగాళ్ళం. మరిక సోది వినక తప్పదు కదా. ఇక వాడు మొదలెట్టాడు. 


వెంకూ. ఏ రోజైనా పెసరట్టు ఉప్మా లేకుండా ఒప్పుకుంటామా మనం. లేదు కదా. అదే కడుపులో గుడగుడా అని విరేచనాలు అయ్యాయి అనుకో. అప్పుడు ఇడ్లీయే కదా మనల్ని రక్షించేది.


నోరు హితువు తప్పి ఏదీ రుచించనప్పుడు, జ్వరం వచ్చి విడిచి మళ్లీ మన శరీరమనే బండి ట్రాక్ ఎక్కే వరకూ ఇడ్లీయే కదా ఆర్తత్రాణపరాయణి. 


సరే లేరా. అని మా వీరేశాన్ని ఆపబోయాను. వాడు గ్రాంథికంలో మాట్లాడాడు అంటే ఇక ఆపడం కష్టం.


అది కాదురా. ఇడ్లీని జాతీయ ఉదయాహారం అని ప్రకటించాలి అన్నాడు వాడు. అసలు మధ్యాహ్నం కూడా ఇడ్లీ లో పెరుగు వేసుకుని తింటే. ఇడ్లీ ఉప్మా చేసుకుంటే సినిమాలోలాగా.


చంద్రహారం తెలుసు పూల హారం తెలుసు. ఈ ఉదయాహారం ఏమిట్రా అని తల పట్టుకున్నాను. 


వెంకూ. ఏమిట్రా నువ్వు. టిఫిన్ ని తెలుగులో చెప్పా. అంతే. అర్థం చేసుకో. అసలు ఇడ్లీ వాయనాలు ఇప్పిద్దామని మా ఆవిడతో చెప్పాను అని అన్నాడు.


ఒరేయ్. నీ పైత్యం పెరిగింది కానీ. ఇంక ఆపరా బాబూ అని వాడి చేతులు పట్టుకున్నాను.


బార్ మూసేస్తున్నాం. ఇక బిల్ తెమ్మంటారా అని అడిగాడు వెయిటర్. ఇడ్లీ దొరుకుతుందా అని అడిగాడు మా వీరేశం. బాగా ఎక్కిందనుకుని వెయిటర్ మజ్జిగ తెచ్చి ఇచ్చాడు. నేను బిల్ కట్టి మా వీరేశాన్ని లాక్కుని బయటకు వచ్చాను.


Rate this content
Log in

Similar telugu story from Comedy