R UMA Devi

Drama

4  

R UMA Devi

Drama

నా చిన్ననాటి మధుర స్మృతి

నా చిన్ననాటి మధుర స్మృతి

1 min
518


1980 ల నాటి మాట. నేను హై స్కూల్ చదివేదాన్ని. రెండుపూటలా టూషన్, స్కూలుకు సగటున 12కిలోమీటర్ల నడక నాకు. రోజూ అంత దూరం నడవలేనని , సైకిల్ కొనివ్వమని మారాం చేసేదాన్ని. ఇంటి ఆర్ధిక పరిస్థితి అర్థం చేసుకునెంత జ్ఞానం అప్పటికి నాకు లేదాయే. అప్పుడే మాఇంటి దగ్గరలోనే కొత్తగా ఓ సైకిల్ షాప్ తెరిచారు. అందులో బూడిదరంగు సైకిల్ నన్ను ఊరించేది. రోజూ దాన్నిచూసి ఆశపడడం తప్ప అది కొనగలమని ఎప్పుడూ అనుకోలేదు. దాని ఖరీదు మా కుటుంబ నెల రోజుల పోషణ మరి. సెలవుల్లో అన్నయ్య వచ్చాడు. పుట్టినరోజు బహుమతి కొనిస్తానని బజారుకు బయల్దేరదీసాడు. నేను కొత్త బట్టలు కొనుక్కోవాలని సంబరంగా తయారయ్యాను. అన్నయ్య నేరుగా సైకిల్ షాప్కు తీసుకెళ్ళి నీకు నచ్చిన సైకిల్ తీసుకో అన్నాడు. నేను నమ్మలేకపోయాను. నిజంగానా అన్నయ్యా... మరి అంత డబ్బు...ఎలా.... అమ్మ కోప్పడుతుందేమో... అన్నాను సందేహంగా. అదంతా నీకు ఎందుకు? సైకిల్ తీసుకో అన్నాడు. ఒక్క అంగలో వెళ్లి, రోజూ నన్ను మురిపించే బూడిదరంగు సైకిల్ తీసుకున్నాను. నా ముఖంలో సంతోషాన్ని చూస్తూ, బాగా చదువుకోవాలి అని తల మీద తట్టి ప్రేమగా హెచ్చరించాడు. తను పొదుపుచేసిన డబ్బులుపెట్టి నాకు ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందాన్ని కొనిచ్చాడు. ముప్పై ఏళ్ళు అయినా నేనా సంఘటన మర్చిపోలేను.



Rate this content
Log in