Narra Pandu

Drama Romance Tragedy

4  

Narra Pandu

Drama Romance Tragedy

నా కలల దేవత

నా కలల దేవత

1 min
263


ఓ నా కలల కవిత

నా వాక్యాలే నీ వయ్యారి వాలుజడలై

నా నానార్ధాలే నీ నాజుకూ నడువంపులై

నా పర్యాయపదాలే నీ పరువపు ఎదసీమలై

నా రచనలే నీ రవికాంచని రసరమ్యలై

నా యతిప్రాసలే నీ యవ్వనపు పొంగులై

నా వర్ణనలే నీ వయస్సు హంగులై

నా ఆలోచనలే నీ అణువణువునా అందాలై

నా పదాలే నీ హృదయపు ప్రతిధ్వనులై

నా కవిత్వాలే నీ కలువ కనులకు చూపులై

నా మాటలే నీ మనస్సుకు దారులై

నాకోసం కదిలివచ్చిన నా కలల కవిత

నాకోసం దిగివచ్చిన నా దేవకన్య

నా కలల కావ్యాకన్యక

స్వాగతం సుస్వాగతం

నర్ర పాండు✍️



Rate this content
Log in

Similar telugu story from Drama