t. s.

Tragedy Classics

3  

t. s.

Tragedy Classics

నువ్వు కావాలి

నువ్వు కావాలి

1 min
360


శుభోదయం సూర్య దేవా నులి వెచ్చని వేకువవై రా...

"నువ్వు కావాలి" నన్ను మేల్కొల్పడానికి.

గంగమ్మ తల్లి చల్లని నదివై ప్రవహించు...

"నువ్వు కావాలి" నన్ను పవిత్రంగా చేయడానికి.

అన్నపూర్ణేశ్వరీ దేవి నన్ను ఆశీర్వదించు...

"నువ్వు కావాలి" నా ఆకలి తీర్చడానికి.

ఊపిరి నిచ్చే పవనమా వింజామర వీచు...

"నువ్వు కావాలి" నా శ్వాస నిశ్వాసలకి.

ఓ జీవితమా స్వేచ్ఛ విహంగమై ఎగురుమా...

"నువ్వు కావాలి" ఈ బంధనాల నుండి విముక్తి ఇవ్వడానికి.

వెన్నెల వెలుగై వచ్చిన చంద్రమా...

"నువ్వు కావాలి" ఈ రాత్రి వసంతాల జోల పాడటానికి.

దూరమైన ఓ ప్రేమా తిరిగి చూడు నా జీవితంలోకి...

"నువ్వు కావాలి" మరణించిన నా మనసును జాగ్రదావస్థలోకి తీసుకురావడానికి.

ఓ యమ పాశమా స్వాగతం నీకు...

"నువ్వు కావాలి" నిద్ర రాని ఈ కళ్ళకి శాశ్వతంగా వీడ్కోలు పలకడానికి.



Rate this content
Log in

Similar telugu story from Tragedy