KANAKA .

Comedy Drama

4  

KANAKA .

Comedy Drama

పాపం సుధాకర్

పాపం సుధాకర్

3 mins
455


పాపం సుధాకర్ 


ఉగ్రరూపంతో ఊగిపోతున్న సుజాత... చేతిలో కాల్చిన అట్లకాడను పట్టుకొని భర్త కోసం ఎదురుచూస్తూ గుమ్మం ముందున్న అరుగు మీద కూర్చుంది.


ఆమె కళ్ళు ఎర్రని నారింజలా జీరాడి ఉన్నాయి...

ముఖం కోపంతో గుమ్మడికాయలా ఉబ్బి పోయి ఉంది ...

ఆమె వాలకం జాతరలో ఏదో తెలియని పూనకాన్ని అలుముకున్న జోగినిలా ఉన్నది...


సరిగ్గా అదే సమయంలో విజిలేసుకుంటూ వచ్చిన సుధాకర్, భార్య పూనకంతో ఊగిపోవడాన్ని గమనించి... 


బిక్కు బిక్కుమని వణికిపోతూ, దీని 

విపరీత పరిణామానికిగల కారణమేమిటీ... 


ఇప్పుడు ఏం జరగనుందనే ఆలోచనలో పడ్డాడు...


6 రోజుల వెనక్కి తిరిగి చూశాడు 

 

సుధాకర్ హుషారుగా తన స్నేహితుడికి ఫోన్ చేసి ఒరేయ్ నీ దగ్గర పాత మిలటరీ సరుకు ఏదో ఉందన్నావుగా అది అట్టుకొచ్చేయి, నువ్వు వచ్చేటప్పుడు ఆ మల్లిగాడిని కూడా తీసుకొని రా ఇద్దరు బేగున వచ్చేయండి నేను మంచింకి చికెన్ తెచ్చి బాగా మసాలా పట్టించి ఫ్రిజ్లో ఉంచుతాను...


మనం ఎంజాయ్ చేస్తూ, వంట చేస్తూ, ఆ మూవీస్ ని చూద్దాం.'


అంటూ చెప్పాడు సంతోషంగా...


అవతల నుండి  

ఫ్రెండు సుబ్బరాజు...


'ఒరేయ్, కొంచెం గ్యాప్ ఇవ్వరా నన్ను మాట్లాడనీరా ఎందుకు ఇవి ఇప్పుడు అన్నాడు.'


ఏమి అర్ధం కాక...


'నేనేమీ వినను మంచి మూడ్ లో ఉన్నాను రా...!


అన్నాడు కులుక్కుంటూ...


'అవునా, ఏంట్రా విషయం.'


అన్నాడు ఆత్రంగా సుబ్బరాజు...


'ఏమీ లేదురా, ఏమంటా కరోనా వచ్చి పడిందో మగాడికి స్వేచ్ఛ లేకుండా పోయింది, ఇదివరకు హాయిగా ఉదయం ఆఫీసుకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేవాళ్ళం ఇప్పుడు కొంపలోనే గడిచిపోయింది జీవితం ...


సరదాలు ,సంతోషాలు లేకుండా వయసు 30 యేళ్లు ముందుకు వెళ్ళిపోయింది వయసు..


మూడేళ్ల తర్వాత, ఒరేయ్ వింటున్నావా మా ఆవిడ మూడేళ్ల తర్వాత పుట్టింటికి వెళ్తుంది. ఈ స్వేచ్ఛాస్వాతంత్ర్యం పూర్తిగా అనుభవించాలిరా అందుకే బేగొచ్చేయండి...


సాయంత్రం ఏడు గంటలకి ట్రైను మీరు ఏడు గంటల ఐదు నిమిషాలకి వచ్చేయాలి. ఒక్క నిమిషం కూడా వృధా అవ్వడం నాకు ఇష్టం లేదు.'అన్నాడు పకపక నవ్వుతూ...


'సరే రా ఇప్పుడే, మనోడికి చెప్పి వెంటనే బయలుదేరుతాం.'


అన్నాడు సుబ్బరాజు ....


ఆ ఐదు రోజులు ఇంట్లో బాగా పబ్బులో ఉన్నట్లు ఎంజాయ్ చేశారు...


ఆరో రోజు ఇల్లంతా శుభ్రం చేసి ,ధూపం వేసి ఇల్లు దేవాలయం చేశాడు సుధాకర్ ...


వెంటనే ఆ విషయం గుర్తొచ్చి...


'అన్ని బానే మేనేజ్ చేశాను కదా!...


నా సుజాత తో

 "శ్రీమతి నువ్వే నా బహుమతి, నువ్వు లేని నా పరిస్థితి అధోగతి" 


అని స్టేషన్ దగ్గరే ఒక గులాబీ ఇచ్చి కవిత కూడా చెప్పానే... 


దానికి ఆనందపడి బాగా ముద్దులు ఇచ్చింది...


 ఇప్పుడేమో గుద్దులు ఇచ్చేలా కూర్చుంది ఏమిటబ్బా...! ఎక్కడ తప్పటడుగు వేసాను చెప్మా...'


అనుకొని పిల్లిలా అడుగులో అడుగు వేసి పెరట్లోకి వెళ్లి వంటగది కిటికీలోనుంచి హాల్లోకి తొంగి చూశాడు...


అంతే! కొయ్య బొమ్మలా అయిపోయాడు కళ్ళు రెండు తేలేసి టీవీ వైపు చూశాడు...


టీవీలో తన బొమ్మ చూసి మురిసిపోవాలో, లేదా ఆ అయిదు రోజులు తాను చేసిన పనులు కళ్ళ ముందు సినిమాలా కనిపిస్తుంటే ఏడవాలో అర్థం కాలేదు....


భార్య లేదని అనుభవించిన స్వేచ్ఛ అంతా ఇలా కళ్ళ ముందు బొమ్మలా కనిపిస్తుంటే, ఏడుపు ముఖంతో భార్య దగ్గరికి వెళ్లి...


'నీ ఉగ్రరూపం వెనక రహస్యం అర్థం అయింది సుజి ...

నువ్వు లేవు కదా...'

అని నసుగుతూ బుర్ర గోక్కొని...


'కొంచెం తీర్థం పుచ్చుకున్న మాట వాస్తవమే..'

అన్నాడు చిన్నగా...


ఆ మాటకి గుడ్లు ఉరిమి చూసి, చేతిలో ఉన్న ఎర్రగా కాల్చిన అట్లకాడను చూపిస్తూ...


'ఈరోజు మీ పిర్ర మీద వాత పెట్టాల్సిందే. అప్పుడే కోపం చల్లారుతుంది...


హామ్మ , హామ్మ ఏమేం చేశారూ చూడాలి అంటే సిగ్గు వేసింది ...


మందు కొట్టి ఒకరి మీద ఒకరు పడి నాగిన్ డాన్స్లు 


ఒకరి పొట్ట ఒకరికి తగిలించి స్టెప్పులు, 

ఒకరి నోటిలో మందు ఇంకోడు పొయ్యటం 

వాంతులు , విరోచనాలు దేవుడా ...


వంటగదిని పెంటగది చేశారు...

 బెడ్ రూమ్ ని రొమాన్స్ రూమ్ చేశారు.'


అంటూ గుండెలు బాదుకుని చెప్పింది సుజాత ....


జరిగింది జరిగినట్టు పూస గుచ్చినట్లు చెప్పేసరికి ఏమైందో అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు సుధాకర్ ...


'ఈ దరిద్రం చూడ్డానికా నా డబ్బంతా వృధా చేసి సీసీ కెమెరాలు కొన్నాను అన్నాది కోపం తో ఊగిపోతూ ....


లాభం లేదు రండి ,...

మీరు నా దగ్గరికి రావాల్సిందే నేను వాత పెట్టాల్సిందే....

నేను మీ మాట వినే పరిస్థితి లేదు ...


మీ పిర్ర మీద వాత పడే వరకు నా పూనకం తగ్గదు.:


అంటూ పరిగెడుతున్న సుధాకర్ వెనక రగులుతున్న అట్ల కాడతో జుట్టు విరబూసుకున్న శివంగిలా పరుగు పెట్టింది సుజాత ....


ఆమె నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుతూనే ఉన్నాడు ....


'ఓలమ్మో , సీసీ కెమెరాలు ఏమిటే...'

అన్నాడు ఆశ్చర్యంగా ....


'నేను లేకపోతే ఉండలేను అన్నారు కదా, ఆ ఉండలేని తనం ఏంటో చూద్దామని సీసీ కెమెరాలు కొని బెడ్రూంలో, వంటగదిలో, హాల్లో పెట్టాను.'


అంటూ ఆమె కూడా అతని వెనకాల పరిగెడుతూనే చెప్పింది...


'ఓరి దేవుడా! అమెజాన్లో షాపింగ్ చేస్తున్నానండి అంటే ఏదో చీరలు కొనుక్కొని నా ముందు సింగారించుకుంటావు కదా, ముద్దుగా చూసుకుందాము అని నా ఏటీఎం కార్డు ఇచ్చాను..


నువ్వు చేసిన పని ఇదా??'

పరిగెడుతూనే బుగ్గలు నొక్కుకుంటూ... అన్నాడు .....


'హా... మీరు చేసే యవ్వారం తెలుసుకోవాలని ఇల్లంతా సీసీ కెమెరాలు పెట్టించాను బాగా దొరికారు అన్నది,వెంబడిస్తూనే ....


'ఓరి, భగవంతుడా! మా మగవాళ్లకు స్వేచ్ఛ, స్వాతంత్రం లేదా...!'


అంటూ అట్ల కాడ వేడి చల్లారే వరకు రై ....రై అని పరుగు పెడుతూనే ఉన్నాడు...

పాపం సుధాకర్ ....


రచన 

KANAKA ✍️



Rate this content
Log in

Similar telugu story from Comedy