krishna snrv

Others

4  

krishna snrv

Others

పేద శివ భక్తుడు (మొదటి భాగం)రచన - snrv---------

పేద శివ భక్తుడు (మొదటి భాగం)రచన - snrv---------

2 mins
7



ఒక ఊరిలో రాజబాబు అనే ఒక జమీందారు ఉండేవాడు. అతనికి కమల అనే పెళ్లీడుకొచ్చిన 

కూతురు ఉంది. తల్లి లేని కారణంగా బాగా గారాబంగా పెంచి పెద్ద చేశాడు. శివయ్య కథలు, మహిమలు చెప్పి శివ భక్తురాలీని చేశాడు. కమల శివ భక్తురాలు కావడంతో మరొక శివ భక్తుడిని పెళ్లి చేసుకుంటానని, అలాంటి వాడిని వెతకమని చెబుతుంది. 


రాజబాబు : అమ్మా కమల.. నువ్వు శివ భక్తురాలువని మరో శివ భక్తుడిని పెళ్లి చేసుకుంటానని అనడం మంచిది కాదు తల్లి ! 


కమల : నాన్న.. నేను వేరే ఎవరిని పెళ్లి చేసుకోను. ఒక శివ భక్తుడిని మాత్రమె పెళ్లి చేసుకుంటాను. మీరు అందగాడిని, డబ్బున్న వాడని, మంచి మర్యాద తెలిసిన వాడని ఇలా ఎవరిని తీసుకొచ్చిన వాళ్ళు శివ భక్తుడై ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటాను. లేదంటే ఇలాగే మీ కళ్ళ ముందు శివ పూజ చేసుకుంటూ మీ కూతురిగానే ఉండిపోతాను. 


రాజబాబు : అప్పుడు రాజబాబు తన కూతురికి పెళ్లి చేయలేక పోయాడని అందరు నన్ను తిట్టడానికా తల్లి !


కమల : మీరు ఎలా అర్థం చేసుకున్న నాకొచ్చిన ఇబ్బంది ఏమి లేదు నాన్న. మీరే స్వయంగా వెళ్లి నాకు కావాల్సిన శివ భక్తుడిని వెతకండి. పెళ్లి చేయండి. 


రాజబాబు : నీకు చిన్నప్పటి నుంచి ఆ పరమ శివుడి కథలు చెప్పి తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తుంది. 


కమల ; ఆ తప్పు దిద్దుకోవడానికైన నాకు శివ భక్తుడినిచ్చి పెళ్లి చెయ్ నాన్న ! ఇప్పుడు నాకు శివ పూజకు వేళయింది. 


అని చెప్పేసి తన దగ్గరి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో రాజబాబు తన కారులో ఊర్లన్ని తిరుగుతూ.. అక్కడక్కడ సేద తీర్చుకుంటూ శివ భక్తుడి గురించి ఆరా తీస్తుంటాడు. చివరకు గంగాపురమనే ఊరిలో కేశవుడు అనే పరమ శివ భక్తుడు ఉన్నాడని తెలుసుకుని అతని ఇంటికి వస్తాడు. 


కేశవుడు చాల పేదవాడు. ఉండటానికి చిన్న మట్టి ఇల్లు మాత్రమె ఉంది. కూలీ పనులకు వెళ్తుంటాడు. పొలం పనులకు వెళ్తుంటాడు. ఎవరైనా పశువుల కాపరిగా వెళ్ళమన్న వెళ్తుంటాడు. అలా వచ్చిన డబ్బులతోనే జీవిస్తూ తన ఇష్టమైన దేవుడు ఆ శివయ్యను పూజిస్తూ ఉంటాడు. అతని పేదరికం నచ్చకపోయినా పేద శివ భక్తుడు కావడంతో అతనితో మాట్లాడి ఒక రోజున మంచి ముహూర్తంలో కేశవుడికి కమలకు పెళ్లి చేస్తాడు. 


కమల జీవితం ఏమవుతుంది?  


ఇంకావుంది..


Rate this content
Log in