Kadambari Srinivasarao

Inspirational

4.3  

Kadambari Srinivasarao

Inspirational

ఫలించిన ఆశ

ఫలించిన ఆశ

2 mins
506


వాసుకు వాళ్ళ పెద్దకొడుకు ప్రదీప్ ను ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా చూడాలని కోరిక. చిన్నప్పటినుండి ఒక ప్రణాళిక ప్రకారం మంచి ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ లో చదివించాడు.


ఎస్.ఎస్.సి. పరీక్షల్లో 9.8 గ్రేడింగ్ పాయింట్లలో ఉత్తీర్ణత సాధించిన కొడుకును చూసి అబ్బురపడి, ఒక చక్కటి కాలేజ్ లో ఇంటర్మీడియట్ జాయిన్ చేసాడు. ప్రదీప్ బాగానే చదువుతున్నట్లు వారాంతపు పరీక్షల రిపోర్ట్ చూసి, తనకొడుకు తప్పక జె.ఈ.ఈ. అడ్వాన్స్ లో మంచి ర్యాంక్ పొంది, ఐఐటీ లో చేరి ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడని వాసు మురిసిపోయాడు

********************************

ప్రదీప్ 2వ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు బాగా వ్రాసి , ఒకవైపు అడ్వాన్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. పరీక్ష వ్రాసే రోజు రానే వచ్చింది. తన కొడుకు పరీక్ష ముందురోజు తెల్లవార్లు మేలుకొని చదవడం వల్ల కొంచెం అలసటగా కనిపిస్తున్నాడు. వాసుతన కొడుకును పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్లి జాగ్రత్తలన్నీ చెప్పి లోపలికి పంపాడు.


పరీక్ష మొదలయింది. మొదట ఫిజిక్స్ పేపర్ చూసి నెర్వస్ అయ్యి , సరిగా పేపర్ వ్రాయలేకపోయాడు. మొత్తానికి ఏదోఒకలా పరీక్షముగించుకుని బయటకు వచ్చి, "పేపర్ ఎలా వ్రాసావ్?" అని అడిగిన తండ్రికి బేలగా ముఖం పెట్టి , "పేపర్ బాగరాయలేక పోయాను నాన్నగారు" అని చెప్పడంతో వాసు డీలా పడిపోయాడు.


వెంటనే ప్రదీప్ "నాన్నగారు ఎంసెట్ ఉందిగా బాగా ప్రిపేర్ అయి అందులో మంచి ర్యాంక్ సంపాదిస్తా" అని చెప్పి తండ్రికి నచ్చజెప్పాడు.

"సరేలే నీకు ఏది ప్రాప్తమో!" అనుకుంటూ బైక్ స్టార్ట్ చేసాడు. ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు. 


ఇంటికి చేరిన కొడుకుని చూడగానే వాళ్ళ అమ్మ వసుధ "నాన్న ఉదయమనగా ఇల్లు వదిలేసావు. ఆకలౌవుతుందా! కాళ్ళు కడుక్కొని వచ్చేయ్! అన్నం పెడతాను" అనగానే,

వాసు "ముందు పరీక్ష ఎలా వెలగబెట్టాడో నీ పుత్రరత్నాన్నడుగు" ఇంకా వాసు మాటలు పూర్తయ్యాయో లేదో, అర్ధం గ్రహించిన వసుధ "ఉండండీ! మీరు మరీనూ.. పిల్లడు ఎంత ఆకలితో వచ్చాడో! అంటూ,

పళ్ళెంలో భోజనం పెట్టి ," మీ నాన్న అలాగే అంటారు గానీ ముందు నువ్వు తిను" అని ప్రేమగా తల నిమిరింది.


భోజనం పూర్తయ్యాక ,"అమ్మా, నేను ఈ పరీక్ష బాగా వ్రాయలేకపోయానమ్మ.. ఎంసెట్ ఉందిగా! బాగా ప్రిపేర్ అవుతాను". అని అంటాడగానే, "నాకు తెలుసు నాన్న నువ్వు తప్పక మంచి ర్యాంక్ తెచ్చుకుంటావుగానీ, ఎండనుబడి వచ్చావు. వెళ్లి కాసేపు పడుకో" అంది వసుధ

********************************

ఎంసెట్ పరీక్షకు హాజరయ్యి బాగా వ్రాశాడు ప్రదీప్. "నాన్నగారు పరీక్ష బాగా వ్రాసాను. మంచి ర్యాంకు వస్తుంది", అని అంటూండగా, 

"సరేలే! రిజల్ట్ రానీ చూద్దాం " అన్నాడు తండ్రి.


వారంలో రిజల్ట్ వచ్చాయి. అనుకున్నంత మంచి ర్యాంక్ రాకపోయినా అనుకున్న కాలేజ్ లో మాత్రం సీట్ వచ్చింది, కానీ అనుకున్న బ్రాంచ్ లో మాత్రం కాదు. మొత్తానికి నాలుగేళ్లు గడిచిపోయాయి. ఈ.ఈ.ఈ. బ్రాంచ్ అవడంవల్ల క్యాంపస్ సెలెక్షన్స్ లో కూడా సాఫ్ట్వేర్ జాబుకు సెలక్ట్ కాలేకపోయాడు ప్రదీప్.


రాత్రుళ్ళు కష్టపడి సాఫ్ట్వేర్ కు సంబంధించిన ఆన్లైన్ కోర్సులు చేసి మొత్తానికి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్ గా సెలెక్ట్ అయ్యి

తండ్రి దగ్గరకు వెళ్లి జాబ్ వచ్చిన విషయం చెప్పి సర్ప్రైజ్ చేసాడు ప్రదీప్.


వాసు ప్రదీప్ వెన్నుతట్టి, "నాకు తెలుసు నువ్వు సాధిస్తావని" అంటూండగా.." నా చిన్నప్పటినుండి మీరు నామీద పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకోవాలని... మొత్తానికి సాధించాను నాన్నగారు "అని కొడుకు అంటూంటే.. తండ్రి వాసు తను అనుకున్నది ఫలించినందుకు గర్వంతో పొంగిపోయాడు.

*********************************


Rate this content
Log in

Similar telugu story from Inspirational