Dinakar Reddy

Drama

3.4  

Dinakar Reddy

Drama

తప్పేనా?

తప్పేనా?

1 min
475


నా మాట విను.ఇలా పొద్దస్తమానం ఆఫీసుల చుట్టూ తిరగడమెందుకు?

ఓ రెండు వేలు కొట్టు.ఇలా నీ బర్త్ సర్టిఫికేట్ నీ చేతుల్లో పెడతా అని ఓ ఏజెంటు ఉపదేశం చేశాడు.

లేకుంటే అప్లికేషను తీసుకొని వ్రాసి,తహసీల్దారు ఆఫీసులో సంతకం చేయించుకొని తరువాత దాన్ని తీసుకొని ఆర్డీవో ఆఫీసులో ఇవ్వాలట.

మొత్తం పని జరగడానికి ఓ ఇరవై రోజుల పైనే పట్టేట్లుంది.


వేరే మార్గం ఉందేమో అని ప్రయత్నించాను.

ఎందుకూ.నేను ఈ ఊళ్లోనే పుట్టాను.కావాలంటే హాస్పిటల్ రికార్డ్స్ చూడండి అన్నాను.

బాబూ.అవన్నీ ఇప్పుడు చూడాలంటే కష్టం అని హాస్పిటల్లో అన్నారు.

నాకు చాలా అవసరం ఆ సర్టిఫికేట్.జేబులోంచి రెండు వేయి రూపాయల పచ్చ నోట్లు తీసి అతని చేతిలో పెట్టాను.

ఆ రోజు సాయంత్రానికల్లా బర్త్ సర్టిఫికేట్ నా చేతిలో ఉంది.


అప్పుడు తప్పు చేశానా అని ఆలోచించే సమయం లేదు.

కానీ నా మనసు ఇప్పటికీ సర్ది చెప్పలేకుంది ఆ విషయంలో.


Rate this content
Log in

Similar telugu story from Drama