Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#WriteWithPride

SEE WINNERS

Share with friends

మనందరికీ తెలుసు, జూన్ నెల LGBTQ అంటే లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్ హక్కుల కోసం ఐక్య రాజ్య సమితి ప్రకటించిన నెల.1969 లో ఐక్య రాజ్య సమితి అమెరికా లో నెలకొన్న గే హక్కుల, సహజీవనం, వివాహ హక్కుల పోరాట ఫలితం గా జూన్ ను ప్రైడ్ నెల గా బిల్ క్లింటన్ అధ్యక్షుడు గా ఉన్న కాలంలో ప్రకటించింది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కూడా ఈ పోరాటానికి మద్దతు ఇచ్చిన వారిలో ఉన్నారు. 

స్టోరీ మిర్రర్ ప్రేమ, సౌభ్రాతృత్వం, ఎల్ జీ బీ టీ సమూహాల హక్కుల కోసం

#WritewithPride పోటీ నిర్వహిస్తోంది.

మీరు ఈ పోటీ లో మీరు ఈ పోరాటం లో చూసిన, విన్న అనుభవాల గురించి రాసే అవకాశం.

అంశాలు

*సంప్రదాయ విరుద్ధంగా కలిసి ఉన్న ఎల్ జీ బీ టీ జంట విజయ గాథ గురించి రాయండి.కథ/కవిత

#TogetherWe Rise

*కుటుంబ, సమాజ అంగీకారం పొందిన ఎల్ జీ బీ టీ వ్యక్తుల కథ/కవిత

#ReflectionsOf Pride

*సంప్రదాయాలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఎల్ జీ బీ టీ వ్యక్తుల వివాహ కథ.కథ/కవిత

#FreedomtoLoveAndMarry

నియమాలు

*పోటీలో పాల్గొనే వారు కేవలం ఎల్ జీ బీ టీ ప్రైడ్ అంశం మీద మాత్రమే కథలు, కవితలు పంపవల్సి ఉంటుంది.

*రచయితలు తమ స్వీయ రచనలు పోటీ కి పంపాలి. కాపీలు, అనుకరణలు అనుమతించ బడవు. కాపీ రచనలు పంపితే , రుజువు చేయబడితే, రచయిత ప్రొఫైల్ బ్లాక్ కూడా చేసే అధికారం స్టోరీ మిర్రర్ కు ఉంది.

*ఒక్కొక్కరు ఎన్ని రచనలు అయినా పంపవచ్చు. పదాల సంఖ్య పరిమితి లేదు. వచన కవిత ఐతే ఆరు లైన్లు మించి ఉండాలి. హైకూ, నాని లాంటివి రాసేవారు ఒకటి కన్నా ఎక్కువ రాసి ఒకే కవిత గా పంపాలి.

*పోటీ లింక్ లేకుండా పంపినవి, ఈమెయిల్ లేదా హార్డ్ కాపీ ద్వారా పంపిన రచనలకు పోటీలో అనుమతి లేదు.

*పోటీ కి ఎటువంటి రుసుము లేదు.

విభాగాలు

కథ, కవిత

భాషలు

ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, గుజరాతీ, బెంగాలీ, ఒరియా, మరియు మరాఠీ

బహుమతులు

*ఇచ్చిన అన్ని అంశాలపై రచనలు పంపిన టాప్ 2 రచయితలకి పుస్తకం బహుమతిగా అందజేయబడుతుంది.

*అన్ని భాషల లో టాప్ 30రచనలతో ప్రతి విభాగం లో ఈ_ బుక్ విడుదల చేయ బడుతుంది.

*విజేతల ఎంపిక ఎడిటర్ స్కోర్ ద్వారా జరుగుతుంది.

రచనలు పంపవలసిన కాలం:

18 జూన్ 2022 నుండి 18 జూలై 2022 వరకు

ఫలితం విడుదల:

18 ఆగస్ట్ 2022

సంప్రదించండి

ఈమెయిల్:

neha@storymirror.com

ఫోన్:

+91 9372458287/022-49240082

వాట్సప్:

+91 84528 04735