Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ranganadh sudarshanam

Tragedy

4.5  

ranganadh sudarshanam

Tragedy

రాముడు లేని సీత

రాముడు లేని సీత

3 mins
552



సీత.... సీతా...అంటూ రామారావు గారి పిలుపు వినగానే చేతిలో ఉన్న ముగ్గు చిప్పను పక్కనపెట్టి,ఉన్నపళాన ఆ....వస్తున్నానండి ...అంటు భర్త గదిలోకి వెళ్ళింది సీత.

ఏ దో చెప్పాలనే లోపే..... రామారావు గారికి దగ్గుతెర అడ్డు వచ్చి ...ఆయాసంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు.

ప్రదానోపాధ్యాయుడిగా సర్వీసులో ఉన్నప్పుడే రామారావు గారికి బైపాస్ సర్జరీ అయింది. దానికి తోడు బీపీ,డయబెటిక్ ఉండడంతో, ఆరోగ్యం కరంటు తీగమీద సర్కస్ ఫీట్లా నడుస్తుంది.

సీత గ్లాసులో నీటిని నోటికి అందించి, గుండెలపై మర్దనా చేసింది..కాస్త ఉపశమనo పొందాక ఎలా ఉందండి ...అంది సీత.

రాత్రి నుండి గుండెలో మంటగా ఉంది.. సీత.... ఊపిరాడటం లేదు..అంటూ బాదతో అమ్మా... అంటూ మూలిగాడు..

సరే లేండి.. మా తమ్ముడిని రమ్మంటాను.. హైదరాబాద్ బయలుదేరుదాం అంటూ కళ్లనీళ్లు ఒత్తుకుంటు బైటికి వచ్చింది సీత.

రామా రావు గారిని హాస్పిటల్లో అడ్మిట్ చెసారు..పరీక్షలన్ని పూర్తి అయ్యాక పరిస్థితి విషమంగా ఉంది.... ఎని హౌ వియ్ డు అవర్ బెస్ట్..డోంట్ వర్రీ అన్నాడు డాక్టర్...

సీత.. కంట గోదావరి ఉప్పొంగింది..ఒరేయ్ తమ్ముడు పిల్లలిద్దరికి వెంటనే ఫోన్ చేసి రమ్మనురా..అంది..సీత.

హలో..హలో...ఒరేయ్..ఆదిత్య మావయ్యను రా ..

..ఆ..ఆ...చెప్పు మావయ్య...

నానా కు సీరియస్ గా ఉంటే హాస్పిటలో చేర్పించాము ..ICU లో ఉన్నాడురా...వాడు విశ్వాస్ కు కూడా ఫోన్ చేసాను.. అమ్మ బాగా ఏడుస్తుందిరా.. మీరు వెంటనే బయలు దేరండి..అన్నాడు.

వెంటనే అంటే ఎలా మావయ్య..అమెరికా మన పక్క వూరు కాదుగా..తమ్ముడితో మాట్లాడి

...బయలుదేరుతాం ..అన్నాడు

ఆదిత్య, విశ్వాస్ ఇద్దరు ఫ్లైట్ దిగి సరాసరి హాస్పిటల్ కు వచ్చారు.

వాళ్ళను చూడగానే సీత బావురుమంటూ ఏడ్చింది...

అమ్మా ...కంగారుపడకు మెమొచ్చాముగా దైర్యంగా ఉండు అంటూ.. కొడుకులిద్దరు తల్లిని ఓదార్చారు...

తండ్రిని చూసి వచ్చి, రౌండ్స్ తరువాత డాక్టర్ను కలిశారు.

డాక్టర్ పెదవి విరిచి క్రిటికల్ గా

ఉంది, బాడీ రెస్పాన్డ్ కావటం లేదు... నాలుగైదు రోజులు గడిస్తే గొప్పే అనిపిస్తుంది..చూద్దాం అన్నాడు.

రోజు డాక్టర్ని కలుస్తూనే ఉన్నారు.. ఆరోజు డాక్టర్ని ఆదిత్య అడిగాడు, డాక్టర్ నాలుగైదు రోజులే అన్నారు ఇప్పుడెలా ఉంది..

ఇప్పుడు కాస్త బెటర్ అనిపిస్తుంది... మీరొచ్చాక కొంత మార్పు కనపడుతుంది, మా మెడిసిన్ కన్నా, ఇప్పుడతనికి మీ రిచ్చే మనోదైర్యమే ఎక్కువ అవసరం..ఇలాగే ఉంటే..మరో రెండు రోజుల్లో దిశ్చార్జ్ చేద్దాము, కానీ మీరు హైద్రాబాద్ లొనే ఉండండి, టూ డేస్ కు ఒకసారి చెకప్ కు రావాలి, పదిహేను రోజుల్లో పూర్తిగా కూలుకోవచ్చు అన్నాడు.

పదిహేను రోజులా..... అన్నాడు విశ్వాస్.

నాట్ ఎగ్జాక్ట్లీ ,ఇట్ మే బి టేక్ మోర్ ...ఆన్నాడు డాక్టర్.

ఇద్దరు ఒకరి ముఖo ఒకరు చూసుకొని బైటికి వచ్చరు.

బాధ్యతగా కొడుకులిద్దరు దగ్గరే ఉండి, తండ్రి ని చూసుకోవడం, సీతకు కొండంత దైర్యాన్ని ఇచ్చింది. కొడుకులను చూసి గర్వాంగా ఫీల్ అయింది.

ఆ రోజు దగ్గరగా ఉన్న ఒక లాడ్జ్ లో రూమ్స్ బుక్ చేసుకొని రామారావు గారిని షిఫ్ట్ చేశారు..

ఆ రాత్రి అందరూ పెందలకడనే

భోజనాలు ముగించి పడుకున్నారు.

ఆదిత్య, విశ్వాస్ ఇద్దరు కారిడార్ లో మాట్లాడుకుంటున్నారు.

అరేయ్... విశ్వాస్ నాపరిస్థితి నీకు తెలుసుగా మొన్ననే కంపెనీ మారానురా, ప్రాజెక్టు మధ్యలో ఉంది..వదిన

ఒంటరిగా బై టికీ వెళ్ళలేదు, పిల్లల చదువు..ఇబ్బందిగా ఉందిరా...నువ్వు ఉండరా,... నేను వెళతాను అన్నాడు.

లేదురా అక్కడ నా పరిస్థితి బాగాలేదురా.. హోమ్ లోన్, కార్ లోన్, పిల్లలు,ఫీజులు అంతా ఇబ్బంది గా ఉందిరా..అన్నాడు విశ్వాస్.

నీనప్పుడే అన్నాను నువ్వెళ్లారా.. నేను పరిస్థితిని బట్టి వస్తానని చెప్పా... విన్నావు కాదు..అప్పుడేమో సీరియస్ రా.... డేసులోనే అయిపోతాడు,

పదకొండవ రోజు కాగానే మనదారిన మనం వెళ్లొచ్చన్నావు.. ఇప్పుడు చూడు...అన్నాడు విశ్వాస్

అరేయ్ అంతా నామీదికి నెట్టకు... అమ్మను తీసుకొచ్చు కుంటాను..ఇంటీపని అమ్మ చూసుకుంటుంది, రమ్యను జాబ్ చేయించొచ్చని వచ్చావు కదరా.. అన్నాడు ఆదిత్య.

అరేయ్ మనం ప్రాక్టీకల్ గా మాట్లాడుకుందాము...ఇప్పుడు కాకపోతే మరో నెల.. రెణ్ణెళ్ళు మనిషన్నాకా తప్పదు కదరా..అదేదో ఇప్పుడే అయితే మన ఇబ్బందులు పోతాయిరా అన్నాడు విశ్వాస్.

అరేయ్...అమ్మా.. నానా వింటార్రా.. షూ..... మెల్లగారా..అన్నాడు ఆదిత్య.

సీత ..కొడుకుల మాటలు విని నిర్ఘాంత పోయింది..ఆ కన్నతల్లి గుండె బద్దలైంది.

ఆరి దుర్మార్గులారా ..మీరు ఇలాంటి కొడుకులని తెలిస్తే..ఎప్పుడో పోయేదాన్నీ..ఇంకా బ్రతికితే , మీ నుండి ఇంకా ఏమేమీ  

వి నాల్సి వస్తుందో నని భయం వేస్తుందిరా..అనుకొని మెల్లగా లేచింది... భగవంతుడా ఈ మాటలు వారి చెవిన పడకుండా చేయి , అని మనసులో ప్రార్ధించింది.

గుండెను రాయిచేసుకొని భర్త పక్కనే ఉన్న టాబ్లేట్లు సగం తీసుకొని మింగబోయింది ...భర్త చేయి అడ్డుగా రావడంతో ..కంగారుగా మీకే టాబ్లేటు వేద్దామని వచ్చానండి అంది.

పిచ్చిదాన నేను అంతా విన్నాను..సగం ముందే నేను మింగాను.. ఇవన్నీ నీకే... అంటుండగా కళ్లనుండి న్నీళ్లు జల జలా రాలాయి.

టాబ్లేట్లు మింగి భర్త పాదాలకు నమస్కరించింది సీత..

రామారావు సీతను దగ్గరికి రమ్మన్నట్లు సైగ చేసాడు... సీత నుది టిపై చివరిముద్దు పెట్టి కనులు వాల్చాడు...సీత అలాగే రామారావు ఎదపై వాలిపోయింది.

ఆది గాడు కావాలనే ఈ రూమ్ ముందు మాట్లాడాడా?అనుకున్నా డు విశ్వాస్.

విశ్వాస్ గాడు కావాలనే గట్టిగా మాట్లాడాడా? అనుకున్నాడు ఆదిత్య.

ఏ దైనా ఇద్దరి లక్ష్యం ఒకటే..అనిపించట్లే.......

లో గుట్టు పెరుమాళ్ళ కెరుక...

.....సమాప్తం......



Rate this content
Log in

Similar telugu story from Tragedy