Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ranganadh sudarshanam

Drama

4.5  

ranganadh sudarshanam

Drama

ఆ......దేవుడెంత ?

ఆ......దేవుడెంత ?

1 min
1.1K



ఏ జన్మ బంధమో...

రుణాను బంధమై, 

తల్లి గర్భాన పురుడు పోసుకుంది...

వేవిళ్ళతో తల్లికి వేదన మొదలైంది,

నెలలు గడుస్తున్నకొద్ది, అవస్థ ఎంత ఉన్నా ఆ తల్లి ఆనందం ముందు చిన్నబోయింది.

బొడ్డు పేగుతో బిడ్డకు జవం అందించి జీవం పోసింది,

బారమెంత ఉన్నా ,కడుపులో బిడ్డ కద లికలు చూసి మురిసి పోయింది.

పడుకున్నా, కూర్చున్నా, నిలుచున్నా పుట్టెడు వేదనను,

పుట్టబోయే బిడ్డ రూపాన్ని తలుచుకొని మురసి పోయింది.

మరణపు అంచులను తాకి మళ్ళీ అమ్మగా జన్మించింది.

ప్రాణాన్ని పణంగా పెట్టి నీకు జన్మ నిచ్చింది,

పంచ ప్రాణాలు దారపోసి నీకు ప్రాణం పోసింది.

ఎన్నెన్ని పాట్లు పడిందో నీకు పాలివ్వడానికి,

ఎన్ని పత్యాలు చేసిందో నీకు ఏ జబ్బు రావొద్దని.

నీకు సుస్తి చేస్తే తను పస్తులుంది,

నీకు జ్వరము వస్తే తను జాగారం చేసింది,

ఎందరు దేవుళ్ళకు మొక్కిందో, ఎన్ని ముడుపులు కట్టిందో నీ బాలారిష్టాలను బాపటానికి.

ఇటు నుంచి నువ్వు గుండెలమీద కాలితో తాన్నినప్పుడల్లా...

అటునుంచి ఆమె ముద్దుల మురిపాలు కుమ్మరించింది

నీ మలమూత్రలను ముక్కుమూసుకోకుండానే ఎత్తిపోసింది.

నీకు లాల.... పోసింది,లాలిపడింది,

ఉగ్గు పెట్టింది, ఊయలూపింది.

తన వడిని నీకు గుడి చేసి ఆడించింది,

తనకొంగును నీకు గొడుగు చేసి కాపాడింది.

నువ్వేడుస్తే..తనకు ముద్ద దిగ దు,

నువ్వేడుస్తే తనకు నిద్ర రాదు.

నిన్ను చూస్తేనే తనకు పొద్దుపొడుపు,

నిన్ను చూస్తూ....నే, తనకు రాత్రి విడుపు.

నిన్ను నడుముకి కట్టుకొని అంట్లు

తోమిoది,

ఒళ్ళో పెట్టుకొని వంటచేసింది.

నిన్ను గుఱ్ఱం ఎక్కించుకొని ఇల్లువూడ్చింది, ఎనుగుఎక్కించుకొని ఏడ్పుమానిపింది.

ఆ చందమామను రమ్మని నీకు బువ్వపెట్టింది,

ఆ చుక్కల బండి ఎక్కిస్తానని నిన్ను బుజ్జగించి o ది.

నువ్వు బడికి పోనని వెక్కి వెక్కి ఏడ్చావు..

నీ భవిష్యత్ ఎలా.. అని తను కుమిలి కుమిలి ఏడ్చింది.

ఆలి కి ప్రాణమైన తాళి ని కూడా అమ్మింది.

తన ఆరోప్రాణమైన నువ్వే మిన్న అనుకుంది.

అమ్మ త్యాగం ముందు మనమెంత ..అసలా...ఆదేవుడెంత..

ఎందుకంటే అమ్మ ఆదేవుడికి కూడా అమ్మే కనుక,

అమ్మ లేని..ప్రపంచo అసలుండదు కనుక....

..........భక్తి తో అమ్మలందరికి అంకిత.................



ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

More telugu poem from ranganadh sudarshanam

Similar telugu poem from Drama