Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Thriller

4.5  

Eevani Ravisankara Sarma

Thriller

అతనిరాక కోసం !

అతనిరాక కోసం !

1 min
335


మనసున్నవాడు కాబోయే పతిదేవుడు ;

రోజూ ఆనందమే ముఖంలో చూస్తాడు .


కన్నవారి అభిమతమంటే చాలా గౌరవం ;

సింధూరం దిద్దుటకు వస్తాడు నాకోసం .

అభిరుచి  పట్టువస్త్రాలను  ధరించటం ,

పూలతో అలంకరింపజేయుట ప్రియం ;

వజ్రవైఢూర్యాలనే బహూకరించే గుణం .


చదువుసంధ్యలలో ఒక ఉన్నత శిఖరం ;

తెలివితేటలు బాల్యం నుంచీ గొప్ప వరం .

ఎప్పుడు పలికినా మధురమైన మాటలే ;

జీవితానికి ఆభరణం ఆత్మీయతాభావమే .


చూపులకు చక్కనైన రూపము కలవాడు ;

నిజంగా ముద్దొచ్చే నిండు చందురుడు ,

కళ్ళముందే మెదలి నన్ను మురిపిస్తాడు .

ముచ్చటైన పదాలతో లేఖలు వ్రాస్తాడు ;

ప్రేమను అక్షరాలుగా మలచి కురిపిస్తాడు .


రెక్కలగుర్రంపై మేఘాలలో వినోదవిహారం ;

తోడుగా నిలిచి దారిని చూపే స్వభావం .

నాకోసం వస్తాడు నను వలచిన నావాడు ;

తన హృదయరాణిగా స్వీకరించువాడు .

*** # *** # ***



Rate this content
Log in

Similar telugu poem from Thriller