భార్యామణి
భార్యామణి
భార్యoటే దేన్నైనా భరించేది కాదు
ప్రతి వరంలోనూ మనల్ని దీవించేది
కష్టాల్లో ఆదుకునే వరమై వరించేది
కన్నీళ్లనీ తుడిచే హస్తమై ఆదుకునేది
బాధలన్నీ భరించి భర్త చిరునవ్వుకోసం
ఎదురుచూసేది
భర్త మౌనన్న్ని భరించలేదు
భర్త బాధని సహించలేదు
భర్త చిలిపిని భరిస్తుంది
పిల్లల అల్లరిని ఓర్చుకొంటుంది
కుటుంబం పరువుని కాపాడుతుంది
అన్నీ బాధల్ని గుండెల్లోనే దాచుకొంటుంది
పిల్లల్నీ అప్పుడప్పుడు దండిస్తుంది
భర్తని సహితం బెదిరిస్తుంది
తన అత్తింటిపోరుని భరిస్తుంది
అందరికీ అన్నం పెడుతూ ప్రేమిస్తుంది
ప్రాణంపోయేదాకా భర్తకే కట్టుబడి ఉంటుంది
కన్నీళ్లొచ్చినా కట్టుబాట్లని వదలకుండా ఉంటుంది
కడవరకు భర్తకి తోడు నీడగా అవుతుంది
చివరికీ ఓ కుటుంబన్నీ నిలుపుతుంది