Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

మురళీ గీతం...!!!

Inspirational

4  

మురళీ గీతం...!!!

Inspirational

ఎపుడైనా....

ఎపుడైనా....

1 min
23.3K


కష్టసుఖాల కడలిలో ఈదావా ఎపుడైనా

సలసల కాగే నీటిలో మరిగావా ఎపుడైనా...


కన్నీళ్ళ సాగరాలు మనలోనే భాగమైన

కురిసేటి కంటిచినుకు ఆపవచ్చా ఎపుడైనా ....


జీవితాన బాధలకు కృంగకోయి ఓ మనిషి!

సుఖాలన్ని తోడొస్తే వద్దంటావా ఎన్నడైనా....


బంధాలు బంధనాలు తెగిపోయే జీవితమే

బ్రతికినన్ని కొద్దిక్షణాలు ముడేయ్యవా నువ్వైనా...


ఛీత్కారాలు ఎదురైతే బాధేలా ఓ గీతం...!!!

సత్కారాలు వరించితే కాదన్నవా కలనైనా....


మురళీ గీతం...!!!

8374885700


Rate this content
Log in

Similar telugu poem from Inspirational