Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Romance

4.5  

Eevani Ravisankara Sarma

Romance

ఇంకా రాలేదు !

ఇంకా రాలేదు !

1 min
466


నా ప్రియుడు ఇంకా ఇంటికి రాలేదు .

వస్తే రాగానే నాకేసే గూటిలోని పక్షిలా చూస్తాడు .

తనదృష్టిని నామీదకు సారించి

ప్రేమగా క్షేమసమాచారాలు ఆరా తీస్తాడు .

ముఖంలో జాబిలి కనిపిస్తే

హాయిగా నిట్టూర్పును కనబరుస్తాడు .

ఓల్టేజ్ తగ్గిన బల్బులా డిమ్ముగా కనిపిస్తే

ఏమైందేమైందని కలవరపడుతూ

మెసేజ్ వెంట మెసెజ్ తెగ పెడతాడు .

ఆ ఆరాటం చూసీచూడగానే

నా అలక చిటికెలో పైకెగిరిపోతుంది .

ఎప్పుడూ ఎదురుగా కనిపిస్తూ ఉంటే

చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది .

సముద్రతీరంలో సాయంసమయంలో

చల్లగాలిలో చాలాసేపు విహరించాలని ,

నదిలో సరసన పడవలో కూర్చుని

హుషారుగా షికారు చేయాలని .

విమానంలో మేఘాలమధ్య నుంచి

వెళ్ళి ప్రపంచాన్ని తీరిగ్గా చుట్టిరావాలని ,

ప్రతినిమిషం ఏకాంతంలో గడపాలని .

నాకోసం పరితపించే నా రాజాది

సుకుమార సుమనోహర సుందర రూపం .

వానిప్రేమ చూడగానే మనసివ్వాలని

అనిపించేంత అపురూపం .



Rate this content
Log in

Similar telugu poem from Romance