Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రేమ సోయగం

ప్రేమ సోయగం

1 min
3



భలే బాగుందిలే జీవితము,

అలసిపోని ప్రేమనే కోరుతుంది ప్రతి జన్మము.


పరువపు పలుకులే

నిత్య తలపుల మెరుపైన ఆనందము,

మధువుల సొగసులు

మరిపించు

వృద్దాప్యపు దుఃఖము,

ప్రేమయాత్రకు మమతలే శక్తి కారకము,

వలపురాగాల విందులే

ఆకలి మరిపించు అమృతము.


పంతాలు పట్టింపులే

చిలిపి హృదయపు మురిపము,

చిరునవ్వుల చెలిమికి

ఆత్మీయతే

గుండెగుబులు తీర్చేటి ఔషదము,

అలమరికలు లేని అనుబంధమే

ఆనందాల శాంతిమార్గము,

పెరిగే వయసు సవాళ్లకు కల్పతరువుల మనసే రక్షణకవచము,

అంతరంగ అనుబంధమే ప్రాణకాంతుల తేజోదీపము.


మురిపించే దాంపత్యసుధలే

వినిపించు నిత్యం కళ్యాణరాగము,

గుండెగూటీ గువ్వతోడుతో బ్రతుకే నందనవనము,

క్షణంక్షణం కాలం కదిలిపోయినా

తరగని ప్రేమే నిత్యప్రకాశము,

పెరిగే వయసు చెప్పే అనుభవ పాఠమే

మట్టిని సైతం చేయును కాంచనము,

సుడిగుండాల చక్రవలయంలో మాసిపోని ముడిబంధమే

దేవుడిచ్చిన వరము.




Rate this content
Log in

Similar telugu poem from Romance