Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Venu KG

Thriller

4  

Venu KG

Thriller

ఉగాది వారసులు

ఉగాది వారసులు

2 mins
303


ఉగాది వారసులు (కవిత)

************************

అవునన్నా... కాదన్నా,

తెలుగు అక్షరాల సాక్షిగా అప్పటికీ, ఇప్పటికీ...మరి ఎప్పటికీ

ఉగాదికి వారసులు...

చరిత్రలో కవులు మాత్రమే


ఆ వారసత్వంలో

ఆస్తుల పంపకాలు లేవు...

అంతస్తుల తగాదాలు అసలే లేవు

ఉన్నది ఒక్కటే లక్ష్యం...

తెలుగుభాష వైభవాలు... ధ్వజస్తంభాల్లా

ఊరూర దర్శనమివ్వాలని


నిత్యం శాంతికపోతాల రెక్కల ఈకల్లో

విశ్వశాంతి గేయానికి

స్వరకల్పన చేస్తున్న కవులంతా

గాయపడ్డ హృదయాలకు

ఓదార్పు ఔషధాలవుతున్నారు

దిగంతాలను ధిక్కరించే అక్షరాలను

కవితల్లో సంధించిన ప్రతిసారి... విశ్వశ్రేయస్సుకోసం నేను సైతం

ఆహుతి అవుతానంటూ...

హామీపత్రాలమీద పోటీపడి

కవులు సంతకాలు పెడుతున్నారు


ఆకలేస్తే ......కవితలతో

కడుపునింపుకునే కవులంతా

ఖాళీ అవుతున్న మానవత్వ మందిరాలలో

తిరిగి అభిషేకాల పూజలకోసం సమాయత్తమవుతున్నారు.


చెప్పాలంటే వేపపువ్వులోని తెల్లదనానికి

తమ చిరునవ్వుల పుప్పడితో

కవులు నగిషీలు చెక్కుతున్నారు.

ఉగాది పచ్చడిలోని షడ్రుచులకు

షామియానాలు వేస్తూ...

పంచాంగంలోని అంగంగానికి

అర్థాలు చెప్తున్నది వాళ్లే

రాహుకాలాలకు లక్ష్మణరేఖలు గీస్తూ... శుభగడియలకు నిత్యం తలుపులు తీస్తున్నది కవులు మాత్రమే 

అసలు కాలానికి, శ్వాసను

అంగవస్త్రంగా తొడిగిన తల్లులు వారే

తెల్లారితే చాలు దినచర్యగా

సూర్యుడు సైతం కవులకు నమస్కారం


తెల్లకాగితం మీద

కవిత్వాన్ని రాయటమంటే

సముద్రం మీద తీరాన్ని చేర్చే నావను

మనిషికి అందించటమే

కవి అంటే, కేవలం ఓ వ్యక్తి కాదు,

నిత్యం మండే ఓ నిప్పుకణం


కవిత్వమంటే కేవలం

అక్షరాల వరుసలు కాదు

కవాతు చేస్తున్న లక్ష సైనికుల వోంట్లో మరుగుతున్న ఓ రక్త సమూహం


గంగాజలాన్ని తీసుకొచ్చి

అందులోకి తొంగి చూస్తే..

కనిపించేవన్నీ సాక్షాత్తు కవుల సంతకాలే...

నదీ పుష్కరాలు, కవి సమ్మేళనాలు

రెండూ ఒక్కటే .....

నదుల్లో మునిగి తేలితే పాప ప్రక్షాళన...

అదే కవిత్వంతో తడిచి ముద్దయితే...

బ్రతుకంతా సంస్కారపు సువాసన


అందుకే నేనంటాను ...

ప్రతి ఏడాది, ఉగాదికి పేరు మారినా

వారసత్వ పత్రాలమీద

మారని పేరు మాత్రం

అప్పటికీ, ఇప్పటికీ, మరి ఎప్పటికీ

ఒక్క కవులది మాత్రమే


--డా|| కె.జి. వేణు, 8480 70084


Rate this content
Log in

Similar telugu poem from Thriller