Midhun babu

Fantasy Inspirational Others

4  

Midhun babu

Fantasy Inspirational Others

ఆలోచన

ఆలోచన

2 mins
346


ఒక ఊరిలో ఒక వర్తకుడు ఉండేవాడు అతడు చాలా ధనవంతుడు అతనికి ముగ్గురి కొడుకులు ఆయనకు వయసు మీద పడుతుండడంతో తన వ్యాపార లావాదేవీలను కొడుకులకు అప్పగించాలి అని అనుకున్నాడు తన కొడుకులు అందుకు సమర్ధుడు ఎవరో తెలుసుకోవాలని అనుకున్నాడు.

ఒకరోజు ముగ్గురి కొడుకులను పిలిచి ఈ ఆస్తుపాస్తులన్నీ నీవే నా తర్వాత వాటిని ఎవరో ఒకరికి అప్పగిస్తాను నేను ఆరు నెలల పాటు తీర్థయాత్రలకు పోతున్నాను కొంచెం ధనం ఇస్తాను వాటిని మీకు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేయండి అని చెప్పాడు తన దగ్గర సిద్ధం చేసుకుని ఉన్న బంగారు కాసుల్లో నుంచి పెద్దవాడికి మూడు వాటాలు రెండో వాడికి రెండు వాటాలు చిన్నవాడికి ఒక వాట ఇచ్చాడు.

పెద్దవాడు తండ్రి తనకు మూడు వాటాలు ఇవ్వడంతో సంతోషించాడు నాన్నకు నేనంటేనే చాలా ఇష్టం నాకే అప్పగిస్తాడని ఇంతకంటే మంచి ఉదాహరణ ఇంకేం కావాలి అని అనుకున్నాడు తండ్రి నమ్మకాన్ని నిలబెట్టాలని తన ఖర్చులను తగ్గించుకొని ఒక్క బంగారు కాసు కూడా ఖర్చు చేయకుండా సాదాసీదాగా బతక సాగాడు

రెండోవాడు తండ్రి ఎలాగూ నాకు ఆస్తి నిర్వహణ బాధ్యతను అప్పగించడు బంగారు కాసులు పంచడంలోనే అతని ఉద్దేశం అర్థం అయింది ఇక వేరే ఆలోచన ఎందుకు నా వంతు ఏం వస్తే అది తీసుకొని సంతోషంగా ఉండాలి అనుకొని తన దగ్గర కోసం ఖర్చు చేయసాగాడు మూడో వాడు అన్నయ్యలు ఇద్దరి కంటే భిన్నమైన వాడు చిన్న వాడిని కాబట్టి నాకు ఇప్పుడు తక్కువ భాగమే వస్తుంది నేనేంటో రుజువు చేసి చూపిస్తాను అని అనుకున్నాడు ఆరు నెలలు గర్జన నుంచి తిరిగి వచ్చాడు కొడుకులను పిలిచి తన ఇచ్చిన ధాన్యాన్ని ఏ విధంగా ఖర్చు చేశారో చెప్పమని అడిగాడు.

పెద్దవాడు నాన్న నేను ఒక కాసు కూడా తీయలేదు నా అవసరాలు తగ్గించుకొని మీరు ఇచ్చిన ధనాన్ని అలాగే జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను అన్నాడు తండ్రి ఏం లాభం నువ్వు తినలేదు ఇతరులకు తిననివ్వలేదు అని రెండో వైపు చూశాడు మీరు చెప్పింది నిజమే నాన్న నేనైతే ఒక కాసు కూడా మిగిల్చకుండా అన్ని కరెక్ట్ చేసేసాను అని చెప్పాడు మూడోవంతు వచ్చింది ఎక్కువ ధనాన్ని ఆయన ముందుంచి నాన్న నేను వ్యాపారం చేశాను మొదటి నుండి లాభాలు వచ్చాయి లాభాన్ని పెట్టుబడిగా పెడుతూ వచ్చాను. చివరికి ఇంత సంపాదించగలిగాననిఆ న్నాడు. అందుకు తండ్రి ముఖంలో సంతోషం కనిపించింది వ్యాపార దక్షత తన చిన్న కొడుకుకి ఉందని తన వ్యాపారాన్ని ఆయనకు అప్పగించాడు 

నీతి ఇష్టంతో చేసే పని ఏమాత్రం కష్టంగా తోచకపోగా అద్భుత విజయాలను మన దగ్గరికి చేరుస్తుంది.


Rate this content
Log in

Similar telugu story from Fantasy