Midhun babu

Classics Inspirational

4  

Midhun babu

Classics Inspirational

నా ఆత్మకథ

నా ఆత్మకథ

4 mins
16



- : నేనప్పుడు పాదుషా-నాకో బాదుషా: -

నేనప్పుడు దేవరకొండలో నాలుగో తరగతి చదువుతుంటి.ఎంతో పతార ఉన్నొల్లే ఆరోజుల్లో పట్నాలల్లకు సదువుకునేదానికి పోతుండిరి.ఎందుకంటే అది అందరితో అయ్యేపని కాకుండే దేవరకొండ మాకు తాలూకా కేంద్రం. దేవరకొండలో చదివించడానికి అప్పట్లో నుండి మా వొళ్ళు పంపింస్తంటే అదిప్పుడు హైదరాబాదుకు తమ పిల్లలను పంపినదానికంటే ఎక్కువే. ఆ ఒక్క సంవత్సరం నన్ను చదివిపిచ్చడానికి మావొళ్ళు కన్నతిప్పలు బడ్డరు. కొన్ని నెలలు పూటకులింట్ల దిన్న ,కొన్నాళ్ళు ఒక హాస్టళ్ల,మరీ కొన్నాళ్ళు ఇంకో హాస్టళ్ల చివరికి కొన్నాళ్ళు బంధువుల ఇంట్ల ఉంచిండ్రు నేను సదువనని తాకటబెడుతుంటే. చివరికి చుట్టాల ఇంట్లో కూడా నేను ఉండడానికి ఇష్టపడకపోతే అన్ని పనులు వదులుకొని మా నాయనమ్మే వచ్చి అదే యింట్ల నాతోపాటు ఉండిపోయింది.కాకుంటే మాకప్పుడు సంసారం , ఊల్లే సాగుబాటు ఉండేది కనుక మా ఊరి నుంచి ఎవరొచ్చినా ఏ పనికొచ్చినా మావోల్లు ఏది బంపితే అది తెచ్చిచ్చేవాల్లు . ఊరినుంచి పంటలకాలంలో నేనేడుంటే ఆడికి సద్ద కంకులు, బొబ్బరికాయలు, పేసరికాయలు,కందికాయలు,రెగుబండ్లు అన్ని వచ్చేవి.నాకప్పుడు పదేండ్లే కాని దోస్తులు కూడా ఎక్కువే .ఎందుకంటే ఇవన్నీ అంటే నేను తినంగజిక్కినవన్ని వాళ్లకే పంచుతుంటి.

ఇప్పుడు కొంచెం నాసదువు సంగతి శేప్పుకోవాలె.నాస్కూలు పేరు సిపిఎస్ఇ.అది దేవరకొండ ఖిల్లా దగ్గర ఉండేది.ఖిల్లా చాలా విషయాలకు మాషూర్.అక్కడికి పోయ్యేది ఆరోజుల్లో కష్టం కానీ తియ్యటి మంచినీళ్ళు అంటే తాగు నీళ్ళు అందులో దొరుకుతుండేవి ,ఇప్పటికీ దొరుకుతున్నాయనుకుంట ఆ నీళ్ళు ఎంత మధురమైనవంటే ఇప్పుడు మనకు దొరుకుతున్న మినరల్ వాటర్ దాని ముందల బలాదూర్.

 

నేనప్పుడున్న పుటకూలి ఇల్లు , హాస్టళ్లు మా స్కూల్ కు కిలోమిటర్ నర దూరంలో ఉండేవి.మా ఊరోల్లు ఇంకో ముగ్గురు చదువుతుండేటోల్లు అదేస్కూల్లో. నాకంటే ఆ ముగ్గురు పెద్దోల్లే. ఎక్కడెక్కడనో ఉండేటోల్లు .నాపై ఎవరిదీ సరైనవారి పర్యవేక్షన లేక చాలాకాలం స్కూల్ ఎగ్గొట్టి ఎక్కడెక్కడనో ఆటౌన్ అంతా తిరిగేది. స్కూల్ టైముకు ఇంట్ల నుంచిపోయ్యి మల్ల స్కూల్ ఇడిచిపెట్టే టైంకు అడ్డాకు వచ్చేది .కనుక స్కూలుకు మల్లపోవాలంటే భయమయ్యేది.అయితే నేను చివరికి ఉన్న బంధువుల ఇల్లు మాత్రం సగం దూరంలోనే ఉండేది కనుక అక్కడినుండి పోవడం సులభమే.కాని అప్పటికే నాలో భయం అంతా మించిపోయింది.ఒక రోజు మా నాయనమ్మ వచ్చిందని మా ఊరోల్ల పిల్లలు ఇద్దరు వచ్చిన్రు.నేను స్కూలుకు పోతలేని సంగతి చెప్పిన్రు. ఇక మా నాయనమ్మ పరేశాన్లబడ్డది.నాగురించి నేనున్న చొట్లల్ల అన్ని ఎంక్వైరీ చేసింది.ఇక వీడు చదువడు అని నిర్ధారణకొచ్చింది.ఐనా మరో సారి నన్నే అడిగింది. ' నీకొరకు నేనీడనే దేవరకొండలనే నీతోపాటు ఉంట గాని నువ్వు స్కూల్ కు పోతావా ? పోవా ? అని బుజ్జగిస్తూ అడిగింది ఒకరోజు నా ముచ్చటంత తెలుసుకున్నంక.కొన్నినెలలు స్కూలుకు పోలేదు అప్పటికే ,నాలో స్కూల్ అంటేనే అంతులేని భయం జొరబడ్డది . ' నేను స్కూలుకు పోను నాయినమ్మ . మనూరికి పోదాంపా అన్న ".ఇక అన్ని ఆశలొదులుకోని మా ఊరికి తీసుకొచ్చింది మా నాయినమ్మ.

     ఇక్కడమరికొంత చదువు సంగతి చెప్పుకోవాలె.చాలా కాలం ఐతే స్కూలుకు పోలేదు,చదువుకోలేదు అని రాసిన కాని మొదటినుండి అస్సలు పోలేదని కాదు దానర్ధం, కొన్ని నెలలు మొదట్లో బాగనే పోయిన.అప్పుడు స్కూలుకు దగ్గరనే మా ఊరి చుట్టపాయిన ఒకాయన టీచర్ పక్క స్కూళ్ల పనిజేస్తుండే.ఆయన ఇల్లు మా స్కూల్ దగ్గరనే కొంత దేవరకొండ ఖిల్లా గుట్ట ఎక్కినంక ఉండేది.ఆయన దగ్గర ట్యూషన్ కాదు గాని కొంత నిగ్రాని కొరకని నాయిష్టం వచ్చినప్పుడల్ల ఆల్లింటికి బోయ్యే ఏర్పాటు ఉండే.ఆసారుకు ఇద్దరు తమ్ముళ్ళు.వాళ్ళు నాకంటే చిన్నోల్లు.సారు అంతపెద్ద స్తితిమంతుడేమి కాదు.కనుక ఆపిల్లలకు ఎవంటే అవి కొనిపెట్టేటోడు కాదు.తినే చిరుతిండ్లు కొనాలన్నా వాళ్ల దగ్గర డబ్బులు ఉండేటియి కాదు. పోగా వాళ్ళింటి చుట్టూ పక్కల ఏవి కొందామన్న దొరికేయి కావు.వాటిని కొనాలంటే ఆపట్నం నడుమ అంటే టౌన్ నడుమ ఉన్న గాంధీ బొమ్మ దగ్గరికి కోసెడు దూరం పోవాల్సిందే.ఆ గాంధీ బొమ్మ పక్కన్నే తోపుడు సైకిల్ బండ్లమిద ఉండేటియి. ఎవరైనా ఆ చిరు తిండ్లు కావాలంటే అక్కడి దాకపోయి కొనుక్కొని రావాల్సిందే.ఖారా,బూంది, మిక్చర్,రకరకాల స్విట్ లు ,సాయంత్రం మిర్చీ బజ్జీలు ఆ బండ్లలో దొరికేవి.అందుకే వాటిని మిఠాయి బండ్లు, స్వీట్ బండ్లు అని పిలిచేవాల్లు. ఆ గాంధీ బొమ్మ ఆ సారు ఇంటికి ఒక్ కోసెడు దూరం ఉంటది.ఆ సంటర్లనే మా దూరపు బంధువుల బట్టల షాప్ ఉండేది.ఆ షాపులో నాకు వారానికో ఏడు అణాలు అంటే సాతాన ఇచ్చే ఏర్పాటు చేశారు మావోల్లు, రోజుకో అణా చొప్పున లెక్కగట్టి. ఈ అణాపైసలకు ఎదొస్తే అది కొనుక్కొని ఆరోజుకు తినాలనేది వారి ఉద్దేశం.పూటకూలిరో ఉన్నాహాస్టల్లో ఉప్నా అన్నం సరిగ్గా తినకపోతే ఇదేదో తిని నా కడుపు నింపుకోవాలని కూడా వాల్ల ఉద్దేశం.ఎక్కువిస్తే ఏవేవో తిని చెడిపోతనేమొననే భయం కూడా అందులో ఉంది. ఆ అణా కు నాకు ఇష్టమైన బాదుషా వచ్చేది.అది అక్కడి బండ్ల మీదనే దొరికేది.నేను ఆసారు ఇంటికాడ చాలా వరకు స్కూలు వదిలిపెట్టంగనేపోయి (సుమారు మూడు నెలలు)పొద్దూకిందాక ఉండి కథలు ముచ్చట్లు అసారు తమ్ముళ్లకు చెప్పి నాఅడ్డాకు వచ్చేటోన్ని.నేనో బండమీద కూసుంటే వాళ్ళిద్దరు చెరోవైపు కూసోని నేనుజెప్పే కతలు వినేటోల్లు సొంపుగా. ఆడ నేనో పాదుషాను .వాళ్ళిద్దరు నా బంట్లు అన్నట్లుండేది అప్పటి స్థితి. ఆ ఇద్దరిలో రోజూ ఒకరు నేనిచ్చే అణా తీసుకుపోయి ఆబాదుషాను ( ఇప్పటికీ ఆ స్వీట్ ఫేమసే) నాకు కొనుక్కొచ్చి పెట్టాలే. అది తెచ్చినోల్లకు సగం నాకు సగం అదీ లెక్క. వేనో పాదుషా అంటే నాకింద నేను చెప్పిందల్ల చేసే ఆసారు తమ్ముళ్ళు నాకు సేవకుల మాదిరిగా ఉండేవారు కనుక పాదుషాలాగే నా వ్వవహారం ఉండేది ఇక నాకో బాదుశా అంటే గదే వాళ్ళకివ్వంగ చిక్కిన సగం బాదుషా అన్నమాట.ఆసగం బాదుషా దక్కించుకునేటందుకు ఆసారు తమ్ముల్లిద్దరు కిలోమీటరుకంటే ఎక్కువ( కోసెడు) దూరమే పొయ్యి తెచ్చేటందుకు పోటీబడేవాల్లు .బాదుశా మిఠాయి కూడా వాళ్ళు రోజూ కొనగలిగిన స్తితిమంతులు కారు ,కనుక నేనిచ్చే ఆ సగం బాదుషా కొరకుఅంత దూరం పోయి తెచ్చేవాల్లు. నేనుఅక్కడికి వాల్లింటికి పోతూ స్కూలుకు పోయినన్ని రోజులు బాగనే ఉండే,బాగనే సదివినట్టు గూడ గుర్తు . మా అన్న అంటే మా పెద్దమ్మ కొడుకును మావోల్లు నిగ్రానికి పెడితే ఆయన సరిగ్గా చూసుకోలేదు. 


అదీకాక నడుమ దేవరకొండకు చదువుకోవడానికి వచ్చిన మా ఊరిపిల్లలలోని ముగ్గురిలో ఒకడు చదువు దారి తప్పి స్కూలుకు మొదటి సంది గూడ పోయ్యేటోడు కాదు.వాని సోపతి బట్టి నేనూ స్కూలు ఎగ్గొట్టేటోన్ని. ఇద్దరం కలిసి ఎక్కడెక్కడికో పోయి ,తిక్క తిక్కగా తిరిగి మా అడ్డాలకు చెరేటోల్లం. అట్లా ఆ సంవత్సరం నా సధువు సంకనాకింది. ఐనా నాకు లెక్కేలేదు సదువుపాయేననే దుగ్దే లేదు. ఆ తరువాత కూడా నా సధువు జీవితమంతా ఎవరి అదుపాజ్నలు లేకుండా కంప్లిట్ స్వతంత్రంగానే గడిచింది, అందుకే బహుష: చదువులో నేను చేరాల్సినంత ఉన్నత స్థాయికి చేరుకోలేదు.

నా ఉలరచన ఉద్దేళం:- ఎవయూ చదువును లైట్ తీసుకోవద్దని,నా లా ఒక సం. లేస్ట్ చేసుకోవద్దని చెప్పటానికి 


Rate this content
Log in

Similar telugu story from Classics